komarada
-
పెళ్లైన నాలుగు నెలలకే...
జీవితంపై కోటి ఆశలతో కొత్త కాంతులతో నాలుగు నెలల కిందటే ఆమె అత్తవారింట అడుగు పెట్టింది. కన్నవారు కూడా మేనరిక వివాహం కావడంతో తమ బిడ్డకు కొండంత భరోసా ఉంటుందని ఆశ పడ్డారు. ఇటు కన్నవారు...అటు అత్తవారు అంతా ఒకే కుటుంబ సభ్యులు కావడంతో ఆమె తన జీవితం ఇక పూల పాన్పే అనుకొంది. ఇంతలోనే ఏమైందో...అత్తవారింట అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఇటు కన్నవారు...అటు అత్తవారింట విషాదం నెలకొంది. మృతదేహానికి అంత్యక్రియలు ఏర్పాట్లు జరిగే సమయానికి శ్మశానవాటిక వద్దకు వచ్చిన పోలీసులు దాన్ని నిలుపు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆ వివాహిత మృతి వెనుక ఏమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... కొమరాడ: మండలంలోని విక్రంపురం పంచాయతీ కొత్తమార్కొండపుట్టి గ్రామానికి చెందిన మేలాపు త్రినాధ, మధు దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో పెద్ద కుమార్తె మేలాపు సౌజన్య(20)కు మధుకుమేనల్లుడైన కళ్లికోట గ్రామానికి చెందిన మిరియాల అప్పలనాయుడు కుమారుడు హరీష్‌తో ఈ ఏడాది ఏప్రిల్ 1న వివాహం జరిపించారు. అనంతరం సౌజన్య తల్లిదండ్రులు ఉపాధి కోసం విజయవాడ వెళ్లారు. సౌజన్య కూడా వివాహ అనంతరం ఆషాడం కోసం కన్నవారింటికి వెళ్లి ఈ నెల ఏడో తేదీనే కళ్లికోటలోని అత్తవారింటికి వచ్చింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సౌజన్య అత్తవారింటి వారు అంతా పొలం పనులకు వెళ్లిపోగా ఇంట్లోనే సౌజన్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్తవారింటి వారు పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి చూడగా సౌజన్య మంచంపై పడి ఉండడంతో ఒక్కసారిగా గొల్లుమన్నారు.108కి ఫోన్ చేయగా ఫలితం లేకపోవడంతో పార్వతీపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు సౌజన్యను పరీక్షించి మృతి చెందినట్టు వెల్లడించారు. దీంతో ఏం జరిగిందోనంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసుల అనుమానంతో... సోమవారం సాయంత్రం మృతి చెందిన సౌజన్య మృతదేహానికి మంగళవారం ఉద యం అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామంలోని శ్మశానవాటికి వద్దకు తీసుకువెళ్లగా సీఐ అరంగి దశరధ తన బృందంతో వచ్చి నిలుపు చేయించారు. ఇదే సమయంలో ఉప తహసీల్దార్ సూర్యనారాయణ నేతృత్వంలో కూడా ఓ బృందం శ్మశాన వాటికి వద్దకు చేరుకొంది. సౌజన్య మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొమరాడ ఇన్చార్జి ఎస్ఐ లోవరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా తమకు అందిన సమాచారంతోనే శ్మశాన వాటికి వద్దకు చేరుకొని అంత్యక్రియలు నిలుపు చేశామని, పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
నవ వధువు అనుమానాస్పద మృతి..!
సాక్షి, విజయనగరం: పెళ్లైన నాలుగు నెలలకే ఓ నవవధువు అనుమానాస్పదంగా ప్రాణాలు విడిచింది. ఈ ఘటన కొమరాడలో మంగళవారం వెలుగు చూసింది. సౌజన్య అనే యువతికి గత ఏప్రిల్ 16న సొంత బావతో వివాహం జరిగింది. అయితే, మంగళవారం ఉదయం కుంటుంబ సభ్యులు పొలానికి వెళ్లారు. వారు ఇంటికి తిరిగొచ్చేసరికి సౌజన్య విగత జీవిగా పడిఉంది. యువతి కుటుంబీకుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిమిత్తం అంత్యక్రియలను అడ్డుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆసుప్రతికి తరలించారు. -
మద్యం మత్తులో... కన్నకూతురినే కడతేర్చాడు..
మద్యం తాగొద్దన్నందుకు ఓ తండ్రి మృగాడిగా మారాడు. అందరూ నిద్రపోయే వేళ భార్య, కుమార్తెపై కత్తితో దాడి చేశాడు. భార్య గాయాలతో బయటపడగా, తండ్రి కత్తి వేటుకు ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయిన విషాదకర ఘటన కొమరాడ మండలం నయా పంచాయతీ పరిధిలోని దేరుపాడు గిరిజన గ్రామంలో చోటుచేసుకుంది. విజయనగరం, కొమరాడ: నయా పంచాయతీ పరిధిలోని దేరుపాడు గ్రామం కొమరాడ మండల కేంద్రానికి సుమారు 8 కిలోమీటర్ల దూరం. పచ్చని కొండల నడుమ ప్రశాంతమైన పల్లె. సుమారు 36 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. పొద్దుకుంగితే చాలు అందరూ నిద్రలోకి జారుకుంటారు. అలాంటి పల్లెలో సోమవారం రాత్రి 11 గంటలకు ఓ మానవ మృగం కత్తితో వీరంగం సృష్టించింది. మద్యం సేవించడం అనారోగ్యదాయకమనిచెప్పిన భార్య, కుమార్తెలపై దాడి చేసింది. ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల చిన్నారిని పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనతో పల్లె గొల్లుమంది. విషాదంలో ముని గిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హిమరిక వెంకటరావు మద్యానికి బానిసయ్యాడు. పోడు వ్యవసాయం, గిరిజన ఉత్పత్తులు అమ్మగా వచ్చిన డబ్బులతో మద్యం సేవించేవాడు. ఇంటికి రూపాయి ఇచ్చేవాడు కాదు. భార్య సంపాదననూ మద్యానికే పోసేవాడు. భార్య, పిల్లల పోషణ పట్టించుకునేవాడు కాదు. మద్యం సేవించొద్దంటూ భార్య గంగులమ్మతో పాటు దేరుపాడు ప్రాథమిక పాఠశాలలో మూడోతరగతి చదువుతున్న కుమార్తె సునీత(8) తరచూ హితబోధ చేసేవారు. ఇంటిలో సరుకులు లేక పిల్లలు పస్తులతో పడుకున్నారని, మద్యం సేవించొద్దంటూ విన్నవించిన ప్రతీసారీ వెంకటరావు భార్యతో గొడవపడేవాడు. సోమవారం రాత్రి కూడా ఇంటిలో గొడవ చేశాడు. భార్య, పిల్లలు నిద్రపోయేవేళ రాక్షసత్వంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య గంగులమ్మ కుడి చేయిపై కత్తివేటు పడడంతో పరుగుతీసింది. అదే సమయంలో ఎదురుగా కనిపించిన కుమార్తె సునీత మెడపై కత్తి వేటు వేయడంతో అక్కడికక్కడే మరణించింది. భార్యను హతమార్చేందుకు పరుగుతీస్తుండగా గ్రామస్తులు మేల్కొని వెంకటరావును పట్టుకున్నారు. గ్రామంలోని స్తంభానికి తాడుతోకట్టేసి కొమరాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వజ్రాల పేరిట ఘరానా మోసం
కళ్లలో కారం కొట్టి రూ.15 లక్షలు చోరీ బాధితులు కృష్ణాజిల్లా వాసులు నిందితుల్లో ఒకరు అల్లవరం వాసిగా గుర్తింపు మామిడికుదురు : లక్షల విలువ చేసే వజ్రాలు అతి తక్కువ మొత్తానికి మీ సొంతం అవుతాయంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కళ్లల్లో కారం కొట్టి రూ.15 లక్షలతో ఉడాయించిన సంఘటన మండల పరిధిలోని కొమరాడ గ్రామంలో జరిగింది. బాధితుడు విజయవాడకు చెందిన మేదరమట్ల శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేదరమట్ల శ్రీధర్ తన సోదరుడు గంటా రాజేష్, స్నేహితుడు ఎలీషాలకు పది రోజుల క్రితం కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన పాస్టర్ ఎంఎస్ రాజుతో పరిచయం ఏర్పడింది. అతను అమలాపురానికి చెందిన తన స్నేహితుని వద్ద రూ.40 లక్షల విలువ చేసే నాలుగు వజ్రాలు ఉన్నాయని, అవి కేవలం రూ.15 లక్షలకే మన వశమవుతాయని నమ్మించాడు. దీంతో అన్నదమ్ములిద్దరూ స్నేహితుడు రాజును ముందువెళ్లి వజ్రాలు చూడమని, వెనుక తాము వస్తామని బుధవారం రాత్రి అమలాపురం పంపారు. వజ్రాలు తాను చూశానని, డబ్బు తీసుకుని రావడమే తరువాయన్న రాజు సూచన మేరకు గురువారం విజయవాడ నుంచి వారు ముగ్గురూ కారులో అమలాపురం వచ్చారు. ఇక్కడ జనం రద్దీ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈ డీల్ అంత కరెక్టు కాదు పాశర్లపూడి రేవులో మా గెస్ట్ హౌస్ ఉంది అక్కడ డబ్బు తీసుకుని వజ్రాలు ఇస్తామని చెప్పడంతో అక్కడి నుంచి బాధితులు మధ్యాహ్నం పాశర్లపూడి రేవు దగ్గరకు వచ్చారు. తీరా ఇక్కడ వచ్చాకా ఇక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా లేవని మామిడికుదురు వెళ్దామని చెప్పడంతో ఇక్కడకు వచ్చారు. ఇక్కడకు సమీపంలోని కొమరాడలో వజ్రాలు ఇస్తామని చెప్పి అక్కడకు వెళ్లాకా కారు వెనుక మోటార్ సైకిళ్లపై వచ్చిన పాస్టర్ రాజుతో సహా ముగ్గురు వ్యక్తులు గంటా రాజేష్‌ను ఎక్కించుకుని మళ్లీ వచ్చి మిమ్మల్ని ఇద్దరినీ తీసుకు వెళ్తామని చెప్పి వెళ్లారు. పొలాల్లో రాజేష్‌తో పాటు పాస్టర్ రాజు కళ్లలో కారం కొట్టిన నిందితులు రూ.15 లక్షలు తీసుకుని పరారయ్యారు. జరిగిన విషయాన్ని బాధితులు కారులో వేచి ఉన్న మేదరమట్ల శ్రీధర్, ఎలీషాలకు చెప్పడంతో వారు లబోదిబోమన్నారు. నగరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై జి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు అల్లవరానికి చెందిన పి.రాజేష్‌గా గుర్తించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
అగ్నిప్రమాదం: రూ.10 లక్షల ఆస్తినష్టం
కొమరాడ: విజయనగరం జిల్లా కొమరాడ మండలం లాబేసు గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల వల్ల సుమారు రూ. 10 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో చెలరేగిన మంటలు సమీపంలోని 15 ఇళ్లకు తాకడంతో.. ఇళ్లన్ని కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో.. నగదు, బంగారం, ఇతర వస్తువులతో పాటు బియ్యం కూడా కాలిబూడిదయ్యాయి. -
పింఛన్లు స్వాహా !
పింఛన్ లబ్ధిదారులు చనిపోతే ఆయన పండగ చేసుకుంటాడు. వారి మరణాన్ని రికార్డుల్లో నమోదు చేయడు. సర్కారు వారికి అందించే మొత్తాలను ఎంచక్కా సొంతానికి వాడుకుంటాడు. ఒకటికాదు.. రెండు కాదు... గడచిన మూడేళ్లుగా ఈయన స్వాహా పర్వం కొనసాగుతున్నా... ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఓ అధికార పార్టీ నాయకుడి అండ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలి సామాజిక తనిఖీ బృందం పరిశీలనలో వెల్లడైన అంశాలు వింటే ఎవరికైనా మైండ్‌బ్లాంక్ అవుతుంది. కొమరాడ: మండలంలోని విక్రమపురానికి చెందిన వీఆర్ఓ ధనుంజయరావు ఆయన పరిధిలోని గ్రామాల్లో మృతి చెందిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వస్తున్న పింఛన్ మొత్తాలను ఎంచక్కా భోంచేస్తున్నాడు. బతికున్నవారికి కూడా మంజూరవుతున్న పింఛన్లు చెల్లించకుండా సొంతానికి వాడుకుంటున్నాడు. ఎన్నో నెలలుగా ఈ తతంగం జరుగుతున్నా... గడచిన కొద్దిరోజులుగా చేపట్టిన సామాజిక తనిఖీల్లో ఈ భాగోతం వెలుగు చూసింది. దీనిపై బుధవారం విక్రమపురంలో నిర్వహించిన గ్రామసభలో మరికొందరు లబ్ధిదారులు వాస్తవాలు వెల్లడించి... తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరణించినవారి మొత్తాలు స్వాహా... నందాపురం గ్రామానికి చెందిన కొండగొర్రి చిన్నమ్మి మూడేళ్ల క్రితమే మరణించింది. ఆమెకు రావాల్సిన వృద్ధాప్య పింఛన్ 39 నెలలకు సంబంధించి రూ. 21వేలు వీఆర్ఓ కాజేశారు. గాదపు అప్పలస్వామి మృతి చెంది ఎనిమిది నెలలు కావస్తున్నప్పటికీ ఆయన పేరున వస్తున్న పింఛన్ రూ.8వేలు తినేశారు. సురగాపు చిన్నంనాయుడు మృతిచెంది మూడు నెలలు కావస్తున్నా ఆయన పేరున వస్తున్న పింఛన్ డ్రా చేసేస్తున్నారు. బతికున్నవారి మొత్తాలు మాయం రాముద్ర గుంపమ్మ వితంతువు అయినప్పటికీ ఆమెకు ఇవ్వకుండా ఐదునెలల పింఛన్ తినేశారు. బొమ్మాన విశ్వనాధం వృద్ధాప్య పింఛన్ నాలుగునెలలుగా ఇవ్వడంలేదు. సారికి సింహాచలం వృద్ధాప్య పింఛన్ మార్చి నెలకు సంబంధించి ఇవ్వలేదు. సురగాపు సోములు వృద్ధాప్య పింఛన్ ఇవ్వలేదు. పిచ్చుక శాంతారావుకు చేనేత పింఛన్ మార్చినెలది, సైలాడ సూరినాయుడు వృద్ధాప్య పింఛన్ రెండు నెలలకు ఇవ్వలేదు. బాధితులు గ్రామసభకు వచ్చి అధికారులకు ఈ విషయాన్ని స్వయంగా వచ్చి చెప్పారు. తక్షణమే తమకు పింఛన్లను అందించి భవిష్యత్‌లో ఇటువంటి తప్పిదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాగా ఈయనకు స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నందువల్లే ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై ఎంపీడీఓ కె.విజయలక్ష్మి సాక్షితో మాట్లాడుతూ స్వాహా చేసిన మొత్తాలను ముందస్తుగా రికవరీ చేసి అనంతరం ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఆ కనులు కన్నీరు కార్చలేవు..
విధి ఆడిన వింతనాటకం అనాథ అయిన పసిగుడ్డు ఐసీడీఎస్‌కు అప్పగించిన పోలీసులు ఆ కనులు కన్నీరు కార్చలేవు.. ఆ పెదాలు అబద్ధాలాడలేవు..ఆ పొట్టకు ఆకలేస్తే అడగలేదు.. ఆ మనసుకి తల్లీతండ్రి అనుబంధాలు కూడా తెలియవు. భూమి మీద పడిన ఆరు నెలలకే ఆ పసికందుతో విధి వింతనాటకం ఆడింది. తల్లి విగతజీవి అయింది. తండ్రి జైలు పాలయ్యాడు. కుటుంబంలో జరిగిన అనుకోని సంఘటన ఆ పసికందును ఒంటరిని చేసింది. పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని కొమరాడ మండలం, నయ పంచాయతీలోని వనకాబడి గ్రామానికి చెందిన ఊయక చంద్రమ్మ(22), ఊయక శోభన్న భార్యాభర్తలు. వారికి ఆరునెలల క్రితం మగబిడ్డ జన్మించాడు. ఆ పసికందుకు సాయికుమార్ అని నామకరణం కూడా చేశారు. ఐసీడీఎస్‌కు అప్పగించిన పోలీసులు... ఒంటరిగా మిగిలిపోయిన పసికందును గమనించిన ఎస్సై వి.అశోక్ కుమార్ చలించిపోయారు. దీంతో ఆయన పార్వతీపురం ఐసీడీఎస్ సీడీపీఓ కె.విజయగౌరితో పాటు ఏసీడీపీఓ పి.వెంకటలక్ష్మి, సూపర్వైజర్లు సీహెచ్ గోవిందమ్మ, ఎస్.శకుంతలమ్మలకు ఆదివారం రాత్రి పసికందు సాయికుమార్‌ను అప్పగించారు. కొమరాడ/: భర్త వేధింపులు భరించలేక ఓ గిరిజన మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఆరు నెలల కుమారుడు అనాథగా మారాడు. మండలంలోని గిరిశిఖర గ్రామమైన నయా పంచాయతీ వనకాబడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వనకాబడి గ్రామానికి చెందిన వూయక సోబన్న కొద్దిరోజులుగా మద్యం తాగి తన భార్య వూయక చంద్రమ్మ(22)ను వేధిస్తున్నాడు. శనివారం రాత్రి కూడా మద్యం తాగి తీవ్రంగా వేధించాడు. దీంతో భరించలేక చంద్రమ్మ తమ ఇంట్లోని వెన్నుకర్రకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించిన స్థానికులు కొమరాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్చార్జి ఎస్ఐ ఎస్.అశోక్‌కుమార్ సిబ్బందితో కలిసి వచ్చి చంద్రమ్మ మృతికి గల కారణాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చంద్రమ్మకు ఆరు నెలల వయసు గల కుమారుడు సాయికుమార్ ఉన్నాడు. తల్లి మరణించడంతో పాలు లేక ఆ బాలుడు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. ఆ బాలుడిని పెంచేందుకు చంద్రమ్మ, సోబన్న తల్లిదండ్రులు ముందుకురాలేదు. దీంతో ఎస్ఐ అశోక్‌కుమార్‌ను ఆ చిన్నారిని చైల్డ్‌లైన్‌కు అప్పగించారు. భర్తను కఠినంగా శిక్షించాలి : సీపీఎం చంద్రమ్మ మృతికి కారణమైన ఆమె భర్త సోబన్నను కఠినంగా శిక్షించాలని సీపీఎం మండల నాయకులు కె.సాంబమూర్తి, ఆర్.చిన్న డిమాండ్ చేశారు. వారు ఆదివారం చంద్రమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాల వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని, వెంటనే మద్యం విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్‌చేశారు. -
లారీ-ఆటో ఢీ..ఒకరి మృతి
కోమరాడ: విజయనగరం జిల్లా కోమరాడ శివారులోని మలుపువద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. పార్వతీపురం వైపు వెళుతున్న లారీ ముందు వెళుతున్న ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పార్వతీపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు మాట్లాడలేని స్థితిలో ఉండడంతో వారి వివరాలు తెలియలేదు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కొమరాడలో వడదెబ్బకు కూలీ మృతి
విజయనగరం: విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలంలో వడదెబ్బకు కూలీ మృతి చెందాడు. వివరాలు.. మండలానికి చెందిన సోములు (54) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. అయితే ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురైన సోములు ఆదివారం ప్రాణాలు వదిలాడు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
చెన్నై బాధితులకు ఆర్థిక సాయం
కొమరాడ:చెన్నైలో భవనం కుప్పకూలి మృతి చెందిన బాధిత కుటుంబాలకు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి వైఎస్ఆర్సీపీ తరుపున చెక్కుల పంపిణీ చేశారు. గురువారం మాదలింగి, దళాయిపేట గ్రామా ల్లో గల బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా దళాయిపేట గ్రామానికి చెంది చెన్నైలో మృతి చెందిన రెడ్డి సుజాత, రెడ్డి సూర్యనారాయణ, పడాల సింహాచలమమ్మ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.75 వేలు చొప్పున పంపిణీ చేశారు. మాదలింగి గ్రామానికి చెంది నారాయణపురం జాను కుటుంబానికి రూ.75 వేలు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు తమ పార్టీ తరుఫున చేయూతను అందించేందుకు తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటిని పంపించారన్నారు. ఇటీవల జగన్మోహన్రెడ్డి నేరుగా వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించిన సంగతి తెలిసిందేనని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున రూ. 5 ల క్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించిందని, ఆ పరిహారం ఏనిమిదేళ్లకు డిపాజిట్ చేసి తదనంతరమే ఆ కుటుంబాలకు ఆ పరిహారం వస్తుందన్నారు. వీరు అప్పుల బాధలు తాళలేక సుదూ ర ప్రాంతాలకు వలసలు వె ళ్లి తమ ప్రాణాలు కోల్పోయారన్నారు. వెంటనే ప్రభుత్వం ప్రకటించిన సాయా న్ని అందేలా చేయాలన్నారు. అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత తన నియోజకవర్గం పరిధిలో చాలా మంది చెన్నై ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నేటి వరకు ఆమె వారిని పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. దీనికి తోడు ఈ కుటుంబాలను ఓదార్చేం దుకు వచ్చిన జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పిం చడం తగదన్నారు. ఆమె వెంట కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు, చినమేరంగి సర్పంచ్ పరీక్షిత్‌రాజు, మండల కన్వీనర్ ద్వారపురెడ్డి జనార్దనరావు, ప్రసాద్, తిరుపతి, చింతల సంగంనాయుడు, గుంపస్వామి, జె.రామలక్ష్మి, డి. రమాదేవి, డి.చంద్రశేఖరరావు, శెట్టి మధుసూదనరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రీ పోలింగ్ ప్రశాంతం
కొమరాడ, న్యూస్‌లైన్ : మండలంలోని చెక్కవానివలస 192వ నంబరు పోలింగ్ బూత్‌లో మంగళవారం జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిపివేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం రీపోలింగ్ నిర్వహించారు. ఈ బూత్‌లో 217 ఓట్లకుగాను 154 ఓట్లు పోలయ్యూయి. ఎస్ఐ ఎ.ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. పెదచామలాపల్లిలో... మెంటాడ : పెదచామలాపల్లిలో 134వ పోలింగ్ బూత్‌లో పార్లమెంటు స్థానానికి సంబంధించి మంగళవారం నిర్వహించిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 7న జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఈవీఎం మొరాయించడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రీపోలింగ్ నిర్వహించారు. సీఐ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. -
చున్నీతో చంపిన గిరిజన యువతిపై కేసు నమోదు
మద్యం మత్తులో తనపై అత్యాచారానికి యత్నించిన మృగాడి మెడకు చున్నీ బిగించి, రాయితో కొట్టి చంపినందుకు గిరిజన యువతిపై కేసు నమోదైంది. విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని గిరిశిఖర పెదశాఖ పంచాయతీ జల గ్రామంలో కొండ సమీపాన పాకలో బుధవారం రాత్రి ఆ యువతి నిద్రపోతోంది. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన గిరిజనుడు కడ్రక తిరుపతి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అతడిని చున్నీతో చుట్టి బయటికి గెంటేశానని, తర్వాత ఏమైందో తనకు తెలియదని యువతి తెలిపింది. అయితే.. ఆత్మరక్షణ కోసమే అయినా వ్యక్తిని చంపినందుకు ఆమెపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కడ్రక తిరుపతి మద్యం మత్తులో ఉండటం వల్లే ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు చెప్పారు. చున్నీ మెడకు బిగించడంతో పాటు రాయితో తలపై కొట్టడం వల్ల తలకు తీవ్ర గాయం కావడం వల్లే అతడు మరణించినట్లు తేలింది. ఆ మహిళను మాత్రం ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. -
గిరిజన యవతి పై ఆత్యాచారం