చెన్నై బాధితులకు ఆర్థిక సాయం
కొమరాడ:చెన్నైలో భవనం కుప్పకూలి మృతి చెందిన బాధిత కుటుంబాలకు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి వైఎస్‌ఆర్‌సీపీ తరుపున చెక్కుల పంపిణీ చేశారు. గురువారం మాదలింగి, దళాయిపేట గ్రామా ల్లో గల బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా దళాయిపేట గ్రామానికి చెంది చెన్నైలో మృతి చెందిన రెడ్డి సుజాత, రెడ్డి సూర్యనారాయణ, పడాల సింహాచలమమ్మ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.75 వేలు చొప్పున పంపిణీ చేశారు. మాదలింగి గ్రామానికి చెంది నారాయణపురం జాను కుటుంబానికి రూ.75 వేలు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు తమ పార్టీ తరుఫున చేయూతను అందించేందుకు తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీటిని పంపించారన్నారు.
ఇటీవల జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించిన సంగతి తెలిసిందేనని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున రూ. 5 ల క్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించిందని, ఆ పరిహారం ఏనిమిదేళ్లకు డిపాజిట్ చేసి తదనంతరమే ఆ కుటుంబాలకు ఆ పరిహారం వస్తుందన్నారు. వీరు అప్పుల బాధలు తాళలేక సుదూ ర ప్రాంతాలకు వలసలు వె ళ్లి తమ ప్రాణాలు కోల్పోయారన్నారు. వెంటనే ప్రభుత్వం ప్రకటించిన సాయా న్ని అందేలా చేయాలన్నారు. అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత తన నియోజకవర్గం పరిధిలో చాలా మంది చెన్నై ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నేటి వరకు ఆమె వారిని పరామర్శించిన దాఖలాలు లేవన్నారు.
దీనికి తోడు ఈ కుటుంబాలను ఓదార్చేం దుకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పిం చడం తగదన్నారు. ఆమె వెంట కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు, చినమేరంగి సర్పంచ్ పరీక్షిత్‌రాజు, మండల కన్వీనర్ ద్వారపురెడ్డి జనార్దనరావు, ప్రసాద్, తిరుపతి, చింతల సంగంనాయుడు, గుంపస్వామి, జె.రామలక్ష్మి, డి. రమాదేవి, డి.చంద్రశేఖరరావు, శెట్టి మధుసూదనరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.