Chennai building
-
చెన్నై బాధితులకు ఆర్థిక సాయం
కొమరాడ:చెన్నైలో భవనం కుప్పకూలి మృతి చెందిన బాధిత కుటుంబాలకు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి వైఎస్ఆర్సీపీ తరుపున చెక్కుల పంపిణీ చేశారు. గురువారం మాదలింగి, దళాయిపేట గ్రామా ల్లో గల బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా దళాయిపేట గ్రామానికి చెంది చెన్నైలో మృతి చెందిన రెడ్డి సుజాత, రెడ్డి సూర్యనారాయణ, పడాల సింహాచలమమ్మ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.75 వేలు చొప్పున పంపిణీ చేశారు. మాదలింగి గ్రామానికి చెంది నారాయణపురం జాను కుటుంబానికి రూ.75 వేలు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు తమ పార్టీ తరుఫున చేయూతను అందించేందుకు తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటిని పంపించారన్నారు. ఇటీవల జగన్మోహన్రెడ్డి నేరుగా వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించిన సంగతి తెలిసిందేనని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున రూ. 5 ల క్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించిందని, ఆ పరిహారం ఏనిమిదేళ్లకు డిపాజిట్ చేసి తదనంతరమే ఆ కుటుంబాలకు ఆ పరిహారం వస్తుందన్నారు. వీరు అప్పుల బాధలు తాళలేక సుదూ ర ప్రాంతాలకు వలసలు వె ళ్లి తమ ప్రాణాలు కోల్పోయారన్నారు. వెంటనే ప్రభుత్వం ప్రకటించిన సాయా న్ని అందేలా చేయాలన్నారు. అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత తన నియోజకవర్గం పరిధిలో చాలా మంది చెన్నై ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నేటి వరకు ఆమె వారిని పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. దీనికి తోడు ఈ కుటుంబాలను ఓదార్చేం దుకు వచ్చిన జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పిం చడం తగదన్నారు. ఆమె వెంట కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు, చినమేరంగి సర్పంచ్ పరీక్షిత్‌రాజు, మండల కన్వీనర్ ద్వారపురెడ్డి జనార్దనరావు, ప్రసాద్, తిరుపతి, చింతల సంగంనాయుడు, గుంపస్వామి, జె.రామలక్ష్మి, డి. రమాదేవి, డి.చంద్రశేఖరరావు, శెట్టి మధుసూదనరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
భవనం కూలిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు
చెన్నై: నగరంలో 11 అంతస్తుల భవనం కూలి భారీ ప్రాణ నష్టం సంభవించిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తుకు రంగం సిద్ధమైంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ పార్టీల డిమాండ్ అధికంగా కావడంతో జయలలిత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భవనం ఆకస్మికంగా కూలి 61 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. భవన నిర్మాణాన్ని చేపట్టే క్రమంలో ప్రణాళిక లోపం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుపడటంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. ఈ బృందానికి నగర జాయింట్ పోలీస్ కమీషనర్ నేతృత్వం వహించనున్నారు. ఇందుకు గాను సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్ ఇంజనీర్లు సహకారం కూడా తీసుకోనున్నారు. గత శనివారం చెన్నై మొగలివాక్కంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కుప్ప కూలింది. ఆ భవన నిర్మాణంలో కార్మికులుగా పని చేస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు. -
చెన్నై శిథిలాల తొలగింపు పూర్తి.
-
చెన్నై భవనం ఎందుకు కూలింది?
జానెడు పొట్ట నింపుకోడానికి రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లి కూలి పనులు చేసుకుంటున్న 61 మంది అసువులు బాశారు. మరో 27 మంది గాయపడ్డారు. వారం రోజుల పాటు 'ఆపరేషన్ రక్ష' పేరిట శిథిలాల తొలగింపు చేపట్టి.. ఎట్టకేలకు మృతదేహాలను, బతికున్నవారిని బయటకు తీశారు. అయితే.. 11 అంతస్థులతో చేపట్టిన ఈ భారీ నిర్మాణంలో అడుగడుగునా లొసుగులే ఉన్నాయి. భవన నిర్మాణ నాణ్యతను పూర్తిగా గాలికి వదిలేయడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని నిపుణులు తేల్చారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్)తో పాటు.. ఐఐటీ మద్రాస్ నుంచి కూడా నిపుణులు ఈ భవన నిర్మాణంలో వాడిన సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించి.. నిజాన్ని నిగ్గుతేల్చారు. ఈ భవనం దుర్ఘటనలో మరణించిన 61 మందిలో 51 మంది తెలుగువాళ్లే. అందులోనూ ఎక్కువగా విజయనగరం జిల్లాకు చెందిన వలస కూలీలే ఉన్నారు. అత్యంత నాసిరకమైన సామగ్రిని ఉపయోగించి, ఏమాత్రం బరువు భరించలేని బీమ్‌లు, కాలమ్‌లతో ఈ భవనాన్ని కట్టారని, నిర్మాణ ప్రమాణాల పరంగా చూస్తే ఇది అత్యంత ఘోరమైనదని నిపుణులు చెప్పారు. శ్లాబులన్నీ ఒకదానిమీద ఒకటి పడిపోయాయని, కాలమ్‌లు కూడా పూర్తిగా పడిపోయాయని, పైన, కింద, అన్నివైపులా ఇందులోనిర్మాణ లోపాలు చాలా ఎక్కువగా ఉన్నాయని క్రెడాయ్ చైర్మన్ డాక్టర్ ఆర్.కుమార్ తెలిపారు. చెన్నై వెలుపల గల పోరూరు చెరువుకు ఈ భవనం కేవలం 500 మీటర్ల దూరంలో ఉంది. అయినా సాయిల్ టెస్టింగ్ లాంటివి ఏవీ సరిగా చేయకపోవడం వల్ల భవనం భూమిలోకి కూరుకుపోయింది. ఈ ప్రాంతమంతా చెరువుకు పరివాహక ప్రాంతంగా ఉండటంతో చిత్తడినేలగానే ఉంది. భవన ప్రమోటర్లు సహా ఆరుగురిని ఇప్పటికే ఈ కేసులో అరెస్టు చేశారు. అయితే బిల్డర్లు మాత్రం తమ లోపం ఏమీ లేదని.. పిడుగుపాటు వల్లే భవనం కూలిందని వాదిస్తున్నారు. -
61కి చేరిన చెన్నై మృతుల సంఖ్య
-
61కి చేరిన చెన్నై మృతుల సంఖ్య
చెన్నైలోని బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారానికి 61కి చేరింది. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతు తుది దశకు చేరుకున్నాయి. చెన్నై మొగలివాక్కంలో నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం శనివారం కుప్ప కూలిన విషయం తెలిసిందే. ఆ భవన నిర్మాణంలో కార్మికులుగా పని చేస్తున్న అత్యధికులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే.