
పిండి మిల్లులో పడి మహిళ మృతి
మణుగూరురూరల్(పినపాక):
అంబేడ్కర్ సెంటర్‌లోని టీడీపీ కార్యాలయం పక్కన ఉన్న నాగశ్రీదుర్గా ఆయిల్ పిండిమిల్లు యజ మానురాలు ప్రమాద వశాత్తు సోమవారం మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. పిండిమిల్లు యజమానురాలు కుడిపూడి కనకదుర్గ(32) ఎప్పటిలాగా పిండి మిల్లులో గ్రైండింగ్ చేస్తుంది. పక్కనే పిండి పట్టే మరో మిల్లు నడుస్తుంది. ఈ క్రమంలో ఆమె పిండి గ్రైండింగ్ పడుతున్న క్రమంలో పక్కనే ఉన్న మరో మిల్లు బెల్టును తప్పించే క్రమంలో ఆమె జడ బెల్టుకు చుట్టుకుపోవడంతో తల అందులో పడి నుజ్జయింది.
విషయం గమనించిన భర్త కేకలు వేస్తుండటంతో అప్పటికే ఆమె తల పూర్తిగా నుజ్జయి మృతి చెందింది. స్థానికులు వచ్చి మిల్లులు నిలిసివేశారు. ఎస్సై నరహరి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. భర్త నాగబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీరి స్వస్థలం అమలాపురం కావడంతో మృతదేహాన్ని అక్కడకు తరలిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.