కోల్‌కత్తా : హైదరాబాద్ లోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికంగా మలేషియా టౌన్‌షిప్‌లోని ఓ ఫ్లాట్‌లో కోల్‌కతాకు చెందిన పాయల్‌భావన్ (33) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు సోమవారం పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా భావిస్తున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు.