పుష్కరాలకు వెళ్లి.. మృత్యుఒడికి చేరింది | Andhra Woman Deceased In Srinagar Pushkaralu | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు వెళ్లి.. మృత్యుఒడికి చేరింది

Published Mon, Nov 22 2021 10:52 AM | Last Updated on Mon, Nov 22 2021 10:57 AM

Andhra Woman Deceased In Srinagar Pushkaralu - Sakshi

సాక్షి,పాలకొండ రూరల్‌(శ్రీకాకుళం): శ్రీనగర్‌లో జరుగుతున్న సింధూ నది పుష్కరాలకు వెళ్లిన జిల్లా వాసి అక్కడ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. పాలకొండలోని దేవరపేటకు చెందిన వ్యాపారి బోగాది సీతయ్య,  సతీమణి ఆదిలక్ష్మి (53) ఈ నెల 17న పుష్కర స్నానాల కోసం శ్రీనగర్‌ వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో బస  ఏర్పాట్లు చేసుకున్న వీరు శనివారం దైవ దర్శనం పూర్తి చేసుకున్నారు. తిరిగి ప్రయాణంలో భాగంగా బస చేస్తున్న హోటల్‌కు చురుకున్నారు. అదే రోజు రాత్రి కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్డికి వెళ్లిన ఆదిలక్ష్మి మృతి చెందారు. ఈ విషయాన్ని సీతయ్య ఫోన్‌ ద్వారా పాలకొండలోని కుంటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement