ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలి
ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలి
Published Tue, Aug 2 2016 9:49 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ టూటౌన్ : రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ, నిల్వ చేసే తెలంగాణ వ్యర్థ నిర్వహణ ప్రాజెక్టు పేరుతో జరిపే ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలని కోరుతూ అఖిల పక్ష పార్టీల నేతలు మంగళవారం కలెక్టర్ పి. సత్యనారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామ సమీపంలో వివిధ సర్వే నంబర్లలో 74 ఎకరాల స్థలంలో కంపెనీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఇటువంటి కంపెనీ వల్ల నీరు, గాలి కలుషితం కానుందని, ఇప్పటికే మూసీ నీరు కలుషితమైందని, చౌటుప్పల్ ప్రాంతంలో 60 కెమికల్ కంపెనీల వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వివరించారు. వినతిపత్రం అందజేసిన వారిలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్, టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి, నార్కట్‌పల్లి జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, సీపీఐ నాయకుడు శ్రవణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement