పాలన సౌలభ్యం కోసమే కొత్తజిల్లాల ఏర్పాటు
పాలన సౌలభ్యం కోసమే కొత్తజిల్లాల ఏర్పాటు
Published Sun, Aug 21 2016 7:27 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
రామన్నపేట : రాజకీయ ప్రయోజనాలకు తావులేకుండా ప్రజల సౌకర్యార్థం, పాలన సౌలభ్యం కోసమే కొత్తజిల్లాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. ఆదివారం రామన్నపేటలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, పార్టీ జిల్లాఅధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డిలతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 17కొత్తవాటితోపాటు, మొత్తం 27జిల్లాల ఏర్పాటు దాదాపు ఖరారయినట్లేనని వివరించారు. అఖిలపక్షభేటీ జిల్లాకు సంబంధించిన విషయంలో ఏకాభిప్రాయానికి రావడం సంతోషకర విషయమన్నారు. చిట్యాల–భువనగిరి, వలిగొండ–భద్రాచలం(వయా తిర్మలగిరి, మహబూబాబాద్)రోడ్లను నాలుగులేన్లుగా విస్తరించి జాతీయ రహదారులుగా గుర్తించాలని ముఖ్యమంత్రిద్వారా కేంద్రమంత్రి గట్కరీకి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రామన్నపేట నియోజకవర్గం తిరిగి పునరుద్ధరించబడుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో జెడ్పీటీసీ మాద యాదగిరి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బందెల రాములు, కాల్య శ్రవణ్‌కుమార్, గంగుల వెంకటరాజిరెడ్డి, బాల్తు నాగయ్య, బొడ్డుపల్లి లింగయ్య, బండ దామోదర్‌రెడ్డి, మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ.నాజర్, అక్రం, మోటె రమేష్, బండ లింగస్వామి ఉన్నారు.
Advertisement
Advertisement