వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టును ఆపాలి
వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టును ఆపాలి
Published Wed, Aug 3 2016 7:18 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
కక్కిరేణి(రామన్నపేట)
ప్రజల ప్రాణాలను హరించే అవకాశం ఉన్న తెలంగాణవేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే ఆపాలని మాజీఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. బుధవారం మండలంలోని కక్కిరేణి గ్రామంలో వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు జిల్లాల్లోని మున్సిపాలిటీలు, పరిశ్రమలు, ఆసుపత్రులు, శ్మశానాలలోని చెత్తను రోజుకు 490 లారీలలో కక్కిరేణికి తరలించి ఇక్కడ పాతిపెట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. మూసీకాలుష్యం, ఫ్లోరిన్‌రక్కసితో బాధపడుతున్న ప్రజలపై మూలిగేనక్కపై తాడిపండుపడ్డ చందంగా వ్యర్థ పదార్థాల శుద్ధి, నిల్వచేసే ఆలోచనరావడం దుర్మార్గమని అన్నారు. జిల్లాకు చెందిన అధికారపార్టీ మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎంపై ఒత్తిడితెచ్చి ప్రాజెక్టును ఆపాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన నిర్వహించ తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కంపెనీ ప్రలోభాలకు లొంగితే భవిష్యత్ తరాలు క్షమించవని, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి చేసే కుట్రలను తిప్పికొటాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా మొండిగా ప్రాజెక్టును కడితే బాంబులతో పేల్చడానికి కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు.
బతకాలంటే పోరాడాల్సిందే : వామపక్ష పార్టీల నాయకులు
కక్కిరేణితోపాటు, నియోజకవర్గంలోని సుమారు యాబై గ్రామాల ప్రజలు బతకాలంటే వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడాల్సిందేనని సీపీఎం, సీపీఐ జిల్లాకమిటీ సభ్యులు మామిడి సర్వయ్య, లొడంగి శ్రవన్‌కుమార్‌లు తెలిపారు. పోలీసుల లాఠీలకు, తూటాలకు భయపడేదిలేదని చెప్పారు. సర్పంచ్ దువ్వాసి పార్వతమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, వివిధపార్టీలు, మండలాలకు చెందిన నాయకులు సోమనబోయిన సుధాకర్‌యాదవ్, పిట్ట కుశలవరెడ్డి, పిట్ట జగనోహన్‌రెడ్డి, నీల దయాకర్, గంగుల వెంకటరాజిరెడ్డి, వేముల సైదులు, వెలిజాల నర్సింహ, బొక్క భూపాల్‌రెడ్డి, ఉండ్ర లింగారెడ్డి, నీల దయాకర్, బత్తుల శంకరయ్య, చింతపల్లి బయ్యన్న, ఎస్‌ఆర్ వెంకటేశ్వర్లు, అవిశెట్టి శంకరయ్య, గాలి నర్సింహ, చిరుమర్తి యాదయ్య, పిట్ట రాఘవరెడ్డి, విజయలక్ష్మి, బద్దుల రవి, జిట్ట నాగేష్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement