పాముకాటుతో విద్యార్థి మృతి
పాముకాటుతో విద్యార్థి మృతి
Published Mon, Aug 22 2016 11:56 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
రామన్నపేట: పాముకాటుకు గురై 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి మండలంలోని కక్కిరేణి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కక్కిరేణి గ్రామానికి చెందిన కన్నెబోయిన యాదయ్య, మంగమ్మ దంపతులది వ్యవసాయాధారిత కుటుంబం. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్నకూతురైన కన్నెబోయిన దివ్య(8) ఆదివారం రాత్రి 8గంటల సమయంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటివద్ద ఆడుకుంటుండగా ఏదో విషపురుగు కరిచింది. కాటుకు గురైన దివ్య బాధతో అరవగా కుటుంబ సభ్యులు గమనించి దీపం వెలిగించి చూస్తుండగానే పాపనోటి నుండి నురగలు కారుస్తూ కింద పడిపోయింది. చికిత్స నిమిత్తం బైక్‌మీద రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రథమచికిత్స అనంతరం పాపపరిస్థితి విషమంగా ఉండడంతో నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. బాలిక అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది.
Advertisement
Advertisement