ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తాం
ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తాం
Published Sat, Jul 30 2016 8:42 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
కక్కిరేణి(రామన్నపేట)
కక్కిరేణి గ్రామశివారులో వ్యర్థ రసాయనాల శుద్ధి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నిస్తే ప్రతిఘటించి తీరుతామని మాజీఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి మండలాలకు చెందిన సుమారు 200మంది రైతులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం కక్కిరేణి గ్రామశివారులో తెలంగాణ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో పర్యటించారు. పార్టీ జెండాలను, ప్రాణాలైనా అర్పిస్తాం–ప్రాజెక్టును అడ్డుకుంటామనే నినాదాలతో కూడిన ప్లకార్డులను నాటారు. కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పరిసర గ్రామాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటికే మూసీకలుషిత జలాలతో సతమతమవుతున్న ప్రజలు, వ్యర్థ పదార్థాల శుద్ధిప్లాంట్ ఏర్పాటు ద్వారా ఇంకా ఇబ్బందుల పాలయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 5న ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహిస్తే జరుగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రాజెక్టు ఏర్పాటును నిలిపివేయాలని, ప్రజాభిప్రాయ సేకరణను రద్దుచేయాలనే డిమాండ్‌తో ఆగస్టు 1న నిర్వహించే కలెక్టరేట్ ముట్టడికి ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆయనవెంట జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, వివిధగ్రామాల సర్పంచ్‌లు కొండూరు శంకర్, బొక్క భూపాల్‌రెడ్డి, మంచిరాజు శరత్‌చందర్, మందడి రవీందర్‌రెడ్డి, నీల దయాకర్, సాల్వేరు అశోక్, బద్దుల రమేష్, ఉండ్ర లింగారెడ్డి, వడ్డె భూపాల్‌రెడ్డి, పాశం శ్రీనివాస్‌రెడ్డి, కన్నెబోయిన సైదులుయాదవ్, భరత్‌గౌడ్, వేముల సత్తయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement