రామన్నపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో
రామన్నపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో
Published Mon, Oct 3 2016 10:48 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
రామన్నపేట :
అభివృద్ధిలో సమతుల్యను పాటించడానికి ప్రభుత్వం రామన్నపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో చిట్యాల–భువనగిరి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. డిప్యూటీ తహసీల్దార్ ఎల్లేశంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఒకప్పుడు నియోజకవర్గ, తాలుకా కేంద్రాలుగా విరజిల్లిన రామన్నపేటను పాలకులు వెనుకబాటుకు గురి చేశారని ఆరోపించారు. రామన్నపేట, చౌటుప్పల్, వలిగొండ, మోత్కూరు, వలిగొండ తదితర మండలాలను కలుపుతూ రామన్నపేట కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే ప్రజలందరికీ సౌలభ్యంగా ఉంటుందని వివరించారు. దాదాపు అన్నిశాఖలకు సంబంధించిన సబ్ డివిజన్ కార్యాలయాలు రామన్నపేటలో పని చేస్తున్నాయన్నారు. అందుకే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తే రామన్నపేట అన్ని విధాలా అభివృద్ధే అవకాశం ఉంటుందన్నారు. గంటపాటు నిర్వహించిన రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో కాంగ్రెస్,బీజేపీ,టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీయూవీ నాయకులు ఊట్కూరి నర్సింహ, ఆకవరపు మధుబాబు,గర్దాసు సురేష్, సాల్వేరు అశోక్, కందుల హన్మంత్, ఎస్‌కే చాంద్, బీకే మూర్తి, జెల్ల వెంకటేశం, వనం చంద్రశేఖర్, నీల ఐలయ్య, గంగాపురం యాదయ్య, కొమ్ము యాదయ్య, బొడ్డు అల్లయ్య, పోతరాజు శంకరయ్య, వనం భిక్షపతి, శివరాత్రి సమ్మయ్య, పాల్వంచ శంకర్, నక్క యాదయ్య, ఎండీ జమీరుద్దిన్, దండుగల సమ్మయ్య, పబ్బతి లింగయ్య, ఎండీ గౌస్, కూనూరు సుధాకర్, సుదర్శన్, మహాలింగం, సహదేవ్, తోటకూరి అంజయ్య, దండుగల సమ్మయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement