Revenue Division
-
Kuppam: రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పాలన
కులం లేదు.. మతం లేదు.. పార్టీలతో సంబంధం లేదు.. అర్హులైతే చాలు, పథకం తలుపు తడుతోంది. గతంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి విసిగిపోయిన ప్రజలకు.. ఇళ్ల మధ్యనున్న సచివాలయం సాదర స్వాగతం పలుకుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ‘నవ’రత్న పథకాలతో ప్రతి కుటుంబం వేల నుంచి లక్షల రూపాయల లబ్ధి పొందుతోంది. ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ఇంటి వద్దకే వస్తున్న వలంటీర్లు.. లోటుపాట్లు తెలుసుకునేందుకు ‘గడప గడప’కు వెళ్తున్న నేతలు.. సంక్షేమ పాలనలో ఊరూవాడా అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. చిత్తూరు కలెక్టరేట్/కుప్పం: సంక్షేమ పాలనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త అర్థం చెబుతోంది. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా ప్రతి ఇంట్లో ఆనందం నింపుతోంది. నాయకులు, అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా అర్హులైన వారందరికీ ఇళ్ల వద్దకే ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కింది. ఈ విషయంలో ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం అయినా సరే.. సీఎం సొంత నియోజకవర్గానికి ఏమాత్రం తీసిపోకుండా పాలనలో పారదర్శకత కనిపిస్తుంది. కుప్పం వాసుల చిరకాల కోరికలైన మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాము ప్రజల పక్షమని నిరూపించింది. చంద్రబాబు తన నియోజకవర్గంలో సర్కారు బడులను మూసివేసి ఓ కార్పొరేట్ పాఠశాలకు అనుమతిచ్చి విద్యను వ్యాపారం చేశారు. ప్రస్తుతం అదే నియోజకవర్గంలో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి నాడు–నేడు మొదటి దశలో 121 సర్కారు పాఠశాలల రూపురేఖల మార్పునకు రూ. 31.23 కోట్లు, రెండవ దశలో 267 పాఠశాలలకు రూ.101.48 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఇళ్లు లేని పేదలకు టీడీపీ పాలనలో 3,800 మందికి పట్టాలు ఇవ్వగా.. 4,691 మందికి ఇళ్లు నిర్మించి చేతులు దులుపుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 15,908 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పక్కా గృహాలను నిర్మిస్తోంది. కుప్పం ప్రజలను చంద్రబాబు తన రాజకీయ లబ్ధికి వాడుకోగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చీకటి జీవితాల్లో వెలుగులు నింపుతూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దుతుండడం గమనార్హం. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చెందిన ఈమె పేరు అమ్ములు. భర్త మంజునాథ్ వ్యవసాయ కూలీ. టీడీపీ కార్యకర్త. వీరికి ఇద్దరు పిల్లలు హృతిక్(4), దివ్య(3). కరోనా నేపథ్యంలో ఉపాధి లేక ఉన్న ఒక్క ఆవు ఇచ్చే పాలను అమ్ముకుని జీవించేవారు. టీడీపీ పాలనలో ఈ కుటుంబానికి ఎలాంటి లబ్ధి కలగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ కుటుంబం వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రూ.18,400, వెలుగులో రూ.50 వేల రుణం పొందింది. ప్రభుత్వ పథకాల సహాయంతో రామకుప్పం మండలంలో మురుకుల తయారీ కేంద్రం ప్రారంభించారు. ప్రస్తుతం వ్యాపారం సజావుగా సాగుతుండంతో నెలకు అన్ని ఖర్చులు పోను రూ.8 వేల నుంచి రూ.10 వేల ఆదాయం వస్తోంది. వీరి జీవనం సాఫీగా సాగుతోంది. కుప్పం పట్టణంలోని పాత పోస్టాపీసు వీధికి చెందిన ఈమె పేరు ధనలక్ష్మీ. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. భర్త మురుగన్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ప్రియదర్శిని, భూమిక. వీరిని చదివించేందుకు ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా అమ్మ ఒడి ఇస్తుండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలను చదివిస్తోంది. రామకుప్పం మండలం విజలాపునికి చెందిన సాగరాభి(65) కుటుంబంలో ఆరుగురు ఉన్నారు. సాగరాభి వృద్ధాప్యం, హనీష్(45) దివ్యాంగుడు కావడంతో నిత్యం నరకమే. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కూలీలుగా మారారు. వైఎస్సార్సీపీ ప్రభు త్వం వచ్చాక, సాగరాబీకి రూ.2,500, దివ్యాంగుడు హనీష్కు రూ.3వేల పింఛను ప్రతి నెలా వస్తోంది. ఈ మూడేళ్లలో ఆ కుటుంబానికి రూ.1.92 లక్షలు అందింది. గుడుపల్లె మండలం సంగనపల్లెకు చెందిన ఈయన పేరు నారాయణప్ప. 2.5 ఎకరాల పొలం ఉంది. అటవీ సరిహద్దు పొలాలు కావడంతో వ్యవసాయం చాలా కష్టం. విత్తనాల కొనుగోలుకు, ఎరువులు.. పెట్టుబడికి ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అలాంటి సమయంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఆయన్ను ఆదుకుంది. మూడేళ్లలో ప్రభుత్వం రూ.41 వేలు ఆయన ఖాతాలో జమచేయడంతో సాగు సాఫీగా సాగుతోంది. కుప్పం మండలం జరుగు పంచాయతీ పోరకుంట్లపల్లెకు చెందిన మళ్లికమ్మ, భర్త గోవిందప్ప టీడీపీలో క్రియాశీల కార్యకర్తలు. వీరికి ఉండడానికి ఇల్లు లేదు. గత ప్రభుత్వంలో పక్కా గృహం కోసం అధికారులు, నాయకుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వలంటీర్ స్వయంగా ఇంటి పట్టాను తెచ్చివ్వడంతో ఆ దంపతుల కళ్లలో ఆనందం వ్యక్తమైంది. ప్రస్తుతం ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకొని జగనన్న కాలనీలోనే నిసిస్తుండడం విశేషం. గుడుపల్లె మండలం అత్తినత్తం గ్రామానికి చెందిన ఈయన పేరు వెంకటాచలం. సాగునీరు లేక వ్యవసాయం వదిలి బెంగళూరులో కూలీ పనులకు వెళ్లేవాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక బిసానత్తం వద్ద ఉన్న కల్లివంక కాలువ పనులు పూర్తి కావడంతో ఈ ప్రాంతంలోని పొలాలు సస్యశ్యామలయ్యాయి. ఈ నేపథ్యంలో వెంకటాచలం తిరిగి తమ గ్రామానికి చేరుకొని వ్యవసాయ పనులతో ఉపాధి పొందుతున్నాడు. నీటి చెరువుల అనుసంధానంతో కుప్పం రైతుల సమస్యకు పరిష్కారం లభించింది. -
మారనున్న కనిగిరి పట్టణ రూపు రేఖలు
కనిగిరి పట్టణ అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడింది. రెవెన్యూ డివిజన్ కేంద్రం హోదాతో వివిధ ప్రభుత్వ శాఖల సేవలు మరింత చేరువ కాగా.. మూడేళ్లుగా నగర పంచాయతీ రెవెన్యూ ఆదాయం ఏటా రూ.4 కోట్లు పెరగడంతో తాజాగా నగర పంచాయతీ నుంచి గ్రేడ్–2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. ఫలితంగా మున్సిపాలిటీలో వివిధ శాఖల పోస్టులు పెరగడంతో అభివృద్ధి నిధుల లభ్యత పెరగనుంది. కనిగిరి రూరల్(ప్రకాశం జిల్లా) : కనకగిరి.. పేరు సార్ధకం చేసుకునేలా కనిగిరి అభివృద్ధికి మార్గం సుగమం అవుతోంది. నియోజకవర్గ కేంద్రమైన కనిగిరి అభివృద్ధిపై ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్ యాదవ్ తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో నిన్న రెవెన్యూ డివిజన్ సాధించగా.. తాజాగా కనిగిరిని నగర పంచాయతీ నుంచి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయించారు. రెవెన్యూ డివిజన్‌తో అభివృద్ధికి ఊపు: కనిగిరి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారడంతో అనేక ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలు ప్రజల చెంతకు చేరాయి.. చేరుతున్నాయి. సుమారు 4 నుంచి 5 కి.మీల దూరం వరకు విస్తరించి ఉన్న కనిగిరిలో కనుచూపు మేరలో భూముల ధరలు పెరిగాయి. రెవెన్యూ డివిజన్ పరిధిలోని మిగతా మండలాల ప్రజల రాకపోకలు సాగుతుండటంతో వ్యాపారాలు, పెరిగి ఆయా వర్గాల వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పనులకు కందుకూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా కనిగిరిలోనే పనులు చక్కబెట్టుకుంటున్నారు. దీంతో వ్యయ ప్రయాసలు తగ్గాయి. రెవెన్యూ, వైద్య, విద్య, పోలీస్, మండల పరిషత్ తదితర అంశాల సమస్యలను ఇక్కడే త్వరితగతిన పరిష్కారం అవుతుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న నగర పంచాయతీ–నేడు గ్రేడ్ 2 మున్సిపాలిటీ కనిగిరిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వ శాఖ నుంచి జీఓ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పట్టుబట్టి మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ సహకారంతో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయించారు. రాష్ట్రంలో కనిగిరి నగర పంచాయతీ ఒక్కటి మాత్రమే గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో కనిగిరి పట్టణం అభివృద్ధిలో మరింత ముందడుగు వేయనుంది. ఈమేరకు మున్సిపాలిటీలో వివిధ శాఖల పోస్టులు పెరగడంతో పాటు, ప్రత్యేక నిధులు వచ్చే అవకాశాలున్నాయి. మారనున్న కనిగిరి రూపు రేఖలు: గ్రేడ్ 2 మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో కనిగిరి రూపు రేఖలు పూర్తి స్థాయిలో మారనున్నాయి. చాలా కాలం పంచాయతీగా ఉన్న కనిగిరి.. ఆ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ అయింది. అనంతరం కనిగిరి, శంఖవరం, కాశీపురం, మాచవరం పంచాయతీలను కలిపి కనిగిరి నగర పంచాయతీగా చేశారు. నగర పంచాయతీగా హోదా ఏర్పడిన తర్వాత రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈసారి గ్రేడ్ 2 మున్సిపాలిటీ స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. మూడేళ్లుగా మున్సిపాలిటీ రెవెన్యూ ఆదాయం ఏటా రూ.4 కోట్లు పెరిగినట్లు నగర పంచాయతీ కౌన్సిల్ మున్సిపల్ శాఖకు వెల్లడించడంతో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. పెరిగిన కౌన్సిల్ హోదా... ఇప్పటి వరకు నగర పంచాయతీ చైర్మన్..మున్సిపల్ చైర్మన్‌గా, నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులుగా హోదా పొందుతారు. ఇంజినీరింగ్, అడ్మినిస్ట్రేషన్ శాఖల్లో ఉన్న పోస్టులు పెరుగుతాయి. అమృత్ సరోవర్ వంటి భారీ నిధుల ప్రాజెక్టులు, ఆర్థిక సంఘ నిధులు పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 25 వార్డులుగా మార్చుకొనే అవకాశాలు ఉన్నాయి. (క్లిక్: నల్లమల ఘాట్ రోడ్‌లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్) సీఎం సహకారంతో కనిగిరిని మరింత అభివృద్ధి చేస్తా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సహకారంతో కనిగిరిని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తా. బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో, సీఎం వద్దకు వెళ్లి కనిగిరిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసుకున్నా. మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్, సీడీఎంఏ, సీఎస్ల సహకారంతో సీఎం దృష్టికి తీసుకెళ్లి కనిగిరిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా హోదా సాధించుకున్నా. పేదలకు మంచి ఆరోగ్యం, విద్య, సాగు, తాగునీరు అందించడమే నాధ్యేయం. – బుర్రా మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు కనిగిరి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మారడంలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ చేసిన కృషి ప్రశంసనీయం. ఎమ్మెల్యే ఆదేశానుసారం కనిగిరి పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు పనిచేస్తా. చైర్మన్‌గా తాను, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులంతా ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – అబ్దుల్ గఫార్, చైర్మన్, కనిగిరి మున్సిపాలిటీ -
వారికి గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: పులివెందుల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8 మండలాలతో పులివెందుల రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటైంది. సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల, వేముల, వేంపల్లి, చక్రాయపేట, వీరపునాయునిపల్లె మండలాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. చదవండి: ద్రౌపది దాహం తీర్చుకున్న కొలను.. ఎక్కడో తెలుసా? -
కొత్త రెవెన్యూ డివిజన్: కొత్తపేటకు పచ్చజెండా
కొత్తపేట(కోనసీమ జిల్లా): కోనసీమ జిల్లాలోని మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డికు అభినందనలు తెలుపుతున్నారు. కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో ఇప్పటికే అమలాపురం, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లు ఉండగా కొత్తగా కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ గత నెల 30న ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: AP: నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.. సీఎస్ కీలక ఆదేశాలు దీంతో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యాన అధికార వైఎస్సార్ సీపీతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, స్థానికులు సంబరాలు జరుపుకొన్నారు. కొత్తపేటలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు ఎమ్మెల్యే, అమలాపురం ఆర్డీఓ వసంతరాయుడు కలిసి 31న పలు భవనాలను పరిశీలించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధిలోని ఎంవీఎస్ సుబ్బరాజు కల్యాణ మంటపం అనువైనదిగా నిర్ణయించారు. వెనువెంటనే ఆ భవనానికి ‘రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయం, కొత్తపేట, కోనసీమ జిల్లా’ పేరుతో బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే సాంకేతిక కారణాలతో కొత్తపేట డివిజన్ ప్రస్తావన లేకుండా అమలాపురం, రామచంద్రపురం డివిజన్లతోనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంతవరకూ అమలాపురం డివిజన్లో ఉన్న కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం మండలాలతో పాటు రాజమహేంద్రవరం డివిజన్లో ఉన్న ఆలమూరు మండలాన్ని రామచంద్రపురం డివిజన్లో కలుపుతూ ఈ నెల 3న గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. దీంతో సుబ్బరాజు కల్యాణ మంటపానికి ఏర్పాటు చేసిన ‘కొత్తపేట రెవెన్యూ డివిజన్ బోర్డు’ కూడా తొలగించారు. ఇదీ.. రెవెన్యూ డివిజన్ పరిధి కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగ్గిరెడ్డి.. గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన రోజు ఉదయమే ఎమ్మెల్యే జగ్గిరెడ్డి హుటాహుటిన విజయవాడ వెళ్లారు. డివిజన్ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నేరుగా కలిశారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై హామీ పొందారు. చివరకు జగ్గిరెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రజల ఆకాంక్ష నెరవేరింది కొత్తపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ప్రజల ఆకాంక్ష నెరవేరింది. పూర్వపు తాలూకా, పంచాయతీ సమితి కేంద్రంగా ఒక వైభవం, వెలుగు వెలిగిన కొత్తపేటకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పునర్వైభవం వస్తుంది. నేను ఎప్పుడూ నియోజకవర్గ అభివృద్ధినే కాంక్షించాను. ఇందుకు అనుగుణంగానే ముందుకు వెళుతున్నాను. కొత్తపేట రెవెన్యూ డివిజన్‌కు క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసిన సీఎం జగన్మోహన్రెడ్డికి, సహకరించిన సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. – చిర్ల జగ్గిరెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, కొత్తపేట -
అ‘పూర్వ బంధం’
బి.కొత్తకోట: బ్రిటీష్ పాలనలో కడప జిల్లాలో కలిసి ఉన్న చిత్తూరుజిల్లా పశ్చిమ ప్రాంతాలు మళ్లీ పూర్వ కడప జిల్లా పరిధిలోని ప్రాంతాలతో కలిసి కొత్తజిల్లా ఏర్పాటు కావడం విశేషంగా చెప్పుకోవాలి. నిన్నమొన్నటి వరకు ఏదైనా పాత రికార్డులు కావాలంటే చిత్తూరు జిల్లా ప్రజలు కడప కలెక్టరేట్‌పై ఆధారపడేవాళ్లు. జిల్లాల పునర్విభజనతో చిత్తూరు పశ్చిమ ప్రాంతం ఎక్కడినుంచి విడిపోయిందో మళ్లీ అదే ప్రాంతంలో కలిసింది. చోళ రాజుల పాలన నుంచి మైసూర్ మహరాజుల పాలన వరకు తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గ ప్రాంతాలు వారి సామ్రాజ్యాల్లో భూ భాగంగా ఉండేవి. వైడుంబులు, పాలేగాళ్లు, రేనాటిచోళులు, మలిచోళులు, విజయనగర, మైసూర్రాజు టిప్పు సుల్తాన్ పాలనలో ఉన్న ఈ నియోజకవర్గాలను మైసూర్ బెల్ట్ ప్రాంతంగా పిలిచేవారు. 1800 అక్టోబర్ 12న నిజాం పాలకులతో వెల్లస్లీకి కుదిరిన ఒప్పందం ప్రకారం కడప, కర్నూలు, అనంతపురం, ఇప్పటి కర్నాటకలోని బళ్లారి జిల్లాలు బ్రిటీష్ పాలన కిందకు వచ్చాయి. అప్పటినుంచి చిత్తూరుజిల్లా కడప జిల్లా పరిధిలో ఉండేది. ఈ ప్రాంతానికి కడప కలెక్టర్ పాలకుడు. అప్పటి కడపజిల్లా విస్తీర్ణం అధికం కావడంతో పాలనా సౌలభ్యం కోసం బ్రిటీష్ పాలకులు 1850లో మదనపల్లెను రెవెన్యూ డివిజన్ కేంద్రం చేశారు. ఇండియన్ సివిల్ సర్వీస్ చేసిన వారిని ఇక్కడ సబ్‌కలెక్టర్లుగా నియమిస్తూ పాలన సాగించారు. ఈ ప్రాంతంలో జరిగే ఉత్తరప్రత్యుత్తరాలు, రిజిస్ట్రేషన్లు, అధికారిక కార్యకలాపాలన్నీ కడపజిల్లా పేరుతోనే జరిగాయి. సరిగ్గా 111 ఏళ్లకు మళ్లీ.. బ్రిటీష్ పాలనలో కడప జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలను కలుపుకొని 1911 ఏప్రిల్ ఒకటిన చిత్తూరు జిల్లా ఏర్పడింది. సరిగ్గా 111 ఏళ్ల తర్వాత యాదృచ్ఛికంగా మళ్లీ కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలతో కలిసి కొత్తగా ఏర్పడిన అన్నమయ్యజిల్లాలో కలిసింది. కొత్తజిల్లా ఏర్పడటం అటుంచితే పూర్వం ఈ మూడు నియోజకవర్గాలు కడపలో భాగమైనవే. ఒకసారి వీడిపోయిన ఈ ప్రాంతాలు కడప జిల్లా నియోజకవర్గాలతో మళ్లీ కలిశాయి. ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయలు భిన్నమైనవే. ఆహార, ఆహర్యం, భాష, వ్యవహారికం పరంగా తేడా కనిపిస్తుంది. కడపలో సుబ్బయ్య, వెంకటసుబ్బయ్య, సుబ్బమ్మ ఇలాంటి పేర్లు అధికంగా వింటాం. ఈ నియోజకవర్గాల పరిధిలో తిరుమలలో కొలువైన వెంకటేశ్వరస్వామి, శ్రీకాళహస్తీశ్వరుడి పేరు కలిసివచ్చేలా పేర్లుంటాయి. 1850లోనే మదనపల్లె డివిజన్ కేంద్రం అత్యధిక విస్తీర్ణం కలిగిన కడప నుంచి జిల్లా పరిపాలన కష్టంగా భావించిన బ్రిటీష్ పాలకులు 1850లోనే మదనపల్లెలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. అప్పట్లోనే సబ్‌కలెక్టర్ కోసం అందమైన కార్యాలయం, బంగళాను నిర్మించారు. ఇక్కడ పనిచేసిన బ్రిటిష్ పాలకులందరూ ఐసీఎస్ అధికారులు. స్వాతంత్య్రం వచ్చేదాకా ఇక్కడ పనిచేసిన సబ్కలెక్టర్లలో అత్యధికులు బ్రిటీషర్లే. ఇప్పటి 31 మండలాలతో డివిజన్ ఉండగా బ్రిటిష్‌పాలనలో పరిధి ఇంకా ఎక్కువ. ప్రస్తుతం జిల్లాల పునర్విభజనతో తంబళ్లపల్లెలోని ఆరు, మదనపల్లెలోని మూడు, పీలేరులోని రెండు మండలాలతో డివిజన్ ఏర్పడింది. హార్సిలీహిల్స్ కనుగొన్న కలెక్టర్ 1865–67 మధ్య మదనపల్లె సబ్‌కలెక్టరుగా పనిచేసిన డబ్ల్యూడీ హార్సిలీ గుర్రంపై పర్యటిస్తూ బి.కొత్తకోట మండలం కోటావూరు గ్రామంలోని ఏనుగుమల్లమ్మ కొండ పరిసరాల్లో సంచరిస్తుండగా మండువేసవిలో చల్లటి వాతావరణ అనుభూతి పొందారు. గుర్రంపైనే కొండపైకి వెళ్లారు. అక్కడ పశుకాపరులతో ఏనుగుమల్లమ్మ కొండను హార్సిలీహిల్స్‌గా పిలవాలని వారిచేత పలికించారు. అప్పటినుంచి హార్సిలీహిల్స్‌గా పేరొచ్చింది. 1871లో కడప కలెక్టరుగా పని చేసిన డబ్ల్యూడీ హార్సిలీ మద్రాసు ప్రభుత్వం నుంచి హార్సిలీహిల్స్‌ను వేసవి విడది కేంద్రంగా అనుమతులు పొందారు. నియోజకవర్గ పరిధుల మార్పులు చిత్తూరు జిల్లా ఏర్పడ్డాక తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాలు మారుతూ వస్తున్నాయి. 1952 తొలి సార్వత్రిక ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గం లేదు. బి.కొత్తకోట మండలంలోని గట్టు కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడింది. 1957 ఎన్నికల నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంగా మారింది. అప్పటినుంచి పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాలు పూర్తిగా, బి.కొత్తకోట మండలంలోని బయ్యప్పగారిపల్లె, శీలంవారిపల్లె, బండారువారిపల్లె, కోటావూరు, తుమ్మనంగుట్ట, గోళ్లపల్లె పంచాయతీలు తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలో ఉండేవి. బి.కొత్తకోట, గుమ్మసముద్రం, గట్టు, బీరంగి, బడికాయలపల్లె పంచాయతీలు, కురబలకోట మండలం మదనపల్లె నియోజకవర్గంలో ఉండేవి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కురబలకోట, బి.కొత్తకోటలో అన్ని పంచాయతీలను మదనపల్లె నుంచి వేరుచేసి తంబళ్లపల్లె నియోజకవర్గంలో కలిపారు. మదనపల్లె నియోజకవర్గంలో మదనపల్లె మున్సిపాలిటీ, రూరల్, నిమ్మనపల్లె మండలాలుండగా తొలగించిన బి.కొత్తకోట, కురబకోట మండలాల స్థానంలో పుంగనూరు నియోజకవర్గంలోని రామసముద్రం మండలాన్ని మదనపల్లెలో కలిపారు. 2009 వరకు వాయల్పాడు నియోజకవర్గం ఉండగా పునర్విభజనలో వాయల్పాడు, గుర్రంకొండ, కలికిరి, కలడక మండలాలను పీలేరు నియోజకవర్గంలో కలపగా వాయల్పాడు నియోజకవర్గం కనుమరుగైంది. పీలేరులోని కొన్ని మండలాలను చంద్రగిరి నియోజకవర్గంలో కలిపారు. -
నెరవేరిన దశాబ్దాల కల.. సీఎం జగన్‌కు థాంక్స్ చెప్పిన కుప్పం ప్రజలు
కుప్పం(చిత్తూరు జిల్లా): జిల్లా సరిహద్దులోని కుప్పం కేంద్రంగా సరికొత్త రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కుప్పం వాసుల దశాబ్దాల కల నెరవేరుస్తున్నట్లు వెల్లడించింది. ఎమ్మెల్సీ భరత్ కృషి ఫలించింది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు చేయలేని పనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిచేశారని ప్రజానీకం కొనియాడుతోంది. తమ కల నెరవేర్చిన సీఎంకు కుప్పం ప్రజలు కృతజ్ఞతలు చెప్తున్నారు. చదవండి: సమగ్ర భూసర్వేతో దేశానికే ఏపీ ఒక దిక్సూచి కావాలి: సీఎం జగన్ ప్రజల ఆకాంక్షల మేరకు.. కుప్పం రెవెన్యూ డివిజన్‌కోసం స్థానికులు ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. ప్రజల కోరిక మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వద్దకు రెవెన్యూ డివిజన్ ప్రతిపాదన తీసుకెళ్లాం. డివిజన్ చేస్తే ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలు, నియోజకవర్గ అభివృద్ధిని వివరించాం. ఆయన సానుకూలంగా స్పందించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారు. – ఎమ్మెల్సీ భరత్ -
కొత్త రెవెన్యూ డివిజన్‌గా వేములవాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లో ఉన్న వేములవాడ, వేములవాడ (రూరల్), చందుర్తి, బోయిన్పల్లి, కోనరావుపేట్, రుద్రంగి మండలాలను కొత్తగా ఏర్పాటు చేసిన వేములవాడ రెవెన్యూ డివిజన్లో విలీనం చేశారు. కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రంగా వేములవాడను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు వినోద్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఆరు మండలాలతో వేములవాడ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కావడం వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని వినోద్ సంతోషం వ్యక్తం చేశారు. -
గుంటూరులో తహశీల్దార్ల ఆగ్రహం
-
రెవెన్యూ డివిజన్ సాధనకు పోరాటం
పరకాల: పరకాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఈనెల 18న ఆత్మగౌరవ యాత్ర, 21న బంద్‌కు పిలుపునిస్తున్నట్లు అఖిలపక్షం నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్ పెస్టర్‌ను మంగళవారం అమరధామంలో అఖిలపక్ష నాయకులు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పాత తాలుక మండలాలతో కలిపి రెవెనూ డివిజన్ చేయాలని కోరుతున్నా స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు పట్టించుకోకుండా పరకాల మండలాన్ని రెండు ముక్కలు చేశారని మండిపడ్డారు. టెక్స్టైల్ పార్క్ శంఖుస్థాపన చేయడానికి సీఎం కేసీఆర్ స్పందించి పరకాలకు న్యాయం చేసేలా బంద్‌లో ప్రజలు, వ్యాపారస్తులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పిట్ట వీరస్వామి, కొలుగూరి రాజేశ్వర్‌రావు, పసుల రమేష్, బొచ్చు కృష్ణారావు, దేవునూరి మేఘనా«థ్, బొచ్చు భాస్కర్, దుప్పటి సాంబయ్య, నక్క చిరంజీవి, ముదిరాజ్ సంఘం నాయకులు జంగేటి సారంగఫాణి, బోయిని పోశాలు తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాలన్నింటా ఒకే మెనూ
అధికారులకు ఉపముఖ్యమంత్రి కడియం ఆదేశం - ప్రతి ఆదివారం నాన్‌వెజ్ తప్పనిసరి - ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఓ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ - గురుకులాల్లో వసతుల కల్పనపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలన్నింట్లో ఒకే రకమైన మెనూ అమలు చేయాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు స్పష్టం చేశారు. అదేవిధంగా గురుకులాల వరకు కామన్ అకడమిక్ క్యాలెండర్‌తో పాటు మౌలికవసతుల కల్పనలోనూ ఒకే పద్ధతిని అనుసరించాలని ఆదేశించారు. గురుకులాల్లో వసతుల కల్పన, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుపై సోమవారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రులు జగదీశ్‌రెడ్డి, జోగురామన్న, అజ్మీరా చందూలాల్‌తో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్‌మిశ్రా, రంజీవ్ ఆర్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈమేరకు గురుకుల సొసైటీల కార్యదర్శులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గిరిజన రెసిడెన్షియల్ కాలేజీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి కోర్సులకు ప్రాధాన్యం మహిళా డిగ్రీ కాలేజీల్లో ఉపాధి కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ... వాటిపై స్పష్టత కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కడియం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ఒక్కోచోట ఒక రకమైన భోజనాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్న కడియం, ఇకపై ఒకేరకమైన భోజనాన్ని ఇవ్వాలన్నారు. ప్రతి ఆదివారం గురుకుల విద్యార్థులకు నాన్‌వెజ్ భోజనం పెట్టాలన్నారు. గురుకుల విద్యార్థినులకు ఏడాది పాటు అవసరమయ్యే ఆరోగ్య వస్తువులను కిట్ రూపంలో ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని, వీటికి డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారులను నియమించాలని ముఖ్య మంత్రి భావిస్తున్నారన్నారు. పక్షం రోజుల్లో ఓ నివేదిక ద్వారా స్టడీ సర్కిళ్లపైనా సూచనలు చేయాలన్నారు. గత విద్యాసంవత్సరంలో ప్రారంభించిన గురుకుల పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. అదేవిధంగా ఈ ఏడాది ప్రారంభం కానున్న గురుకులాలకు సంబంధించి భవనాలు, విద్యార్థులకు సౌకర్యాలు తదితర అంశాలపైనా పరిశీలన చేపట్టాలన్నారు. కొత్త గురుకులాల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండొద్దని ఆయన స్పష్టం చేశారు. -
మెడికల్ అసోసియేషన్ ప్రతినిధుల రిలేదీక్ష
రామాయంపేట: రెవెన్యూ డివిజన్‌కోసం రామాయంపేటలో దీక్షలు కొనసాగుతున్నారుు. 80 రోజులకు చేరుకున్నారుు. ఆదివారంనాటి దీక్షలో మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు వెంకటేశం, యాదగిరి, శ్రీనివాస్, సంతోష్, నరేశ్, నారాయణరెడ్డి, ప్రమోద్, నరేందర్, లింగం, భాను, బాల్‌రెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు. దీక్షలకు అఖిలపక్ష కన్వీనర్ వెల్ముల సిద్దరాంలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, మాజీ ఎంపీపీ రమేశ్‌రెడ్డి, ఇతర నాయకులు తీగల శ్రీనివాసగౌడ్, సుధాకర్‌రెడ్డి, అహ్మద్, చింతల రాములు, చింతల క్రిష్ణ, చింతల స్వామి, వెంకటి, మోతుకు రాజు, శేఖర్, దయానందరెడ్డి, నవాత్ రాజేంద్రప్రసాద్, మంగళి ముత్తయ్య, మర్కు రాములు, బాలచంద్రం, దోమకొండ యాదగిరి మద్దతు తెలిపారు. -
రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో మార్పులు
–డోన్ స్థానంలో పత్తికొండ డివిజన్ ఏర్పాటు –కర్నూలు డివిజన్‌లోనే డోన్ నియోజకవర్గం కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ నేతల సూచనలకనుగుణంగా డోన్ స్థానంలో పత్తికొండ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు ఊపందుకున్నాయి. గతంలో డోన్ కేంద్రంగా పత్తికొండ, బనగానపల్లె నియోజకవర్గాలను కలిపి రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయతలపెట్టారు. మారిన సమీకరణలతో పత్తికొండ కేంద్రంగా పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటును ప్రతిపాదించారు. డోన్ నియోజకవర్గం కర్నూలు రెవెన్యూ డివిజన్‌లోనే ఉంటుంది. ఇది వరకు డోన్ రెవెన్యూ డివిజన్లో కలపాలని ప్రతిపాధించిన బనగానపల్లె నియోజక వర్గాన్ని నంద్యాల రెవెన్యూ డివిజన్‌లోనే ఉంచనున్నారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం కర్నూలు రెవెన్యూ డివిజన్లో కర్నూలు, కోడుమూరు, డోన్, పాణ్యం, డోన్ నియోజకవర్గాలు ఉంటాయి. (జనాభా 12,09,821) నంద్యాల రెవెన్యూ డివిజన్లో నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లి నియోజకవర్గాలు ఉంటాయి. (జనాభా 8,92, 526) ఆదోని రెవెన్యూ డివిజన్లో ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవ్గాలు ఉంటాయి. (జనాభా 8, 38,817) పత్తికొండ రెవెన్యూ డివిజన్లో పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలు ఉంటాయి. (జనాభా 5,92,703) ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాలు ఉంటాయి. (జనాభా 5,12,734) -
జిల్లాలో నాలుగు కొత్త అర్బన్ మండలాలు
– ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న రెవెన్యూ అధికారులు – కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్లు అర్బన్ మండలాలుగా మార్చేందుకు కసరత్తు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కొత్తగా నాలుగు అర్బన్ మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఈ దిశగా జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, అర్బన్ మండలాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. తాజాగా కొత్తగా నాలుగు అర్బన్ మండలాలు ఏర్పాటు చేయాలని తలపెట్టారు. తాను ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే కొత్త డివిజన్లు, ఆర్బన్ మండలాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేఈ కృష్ణమూర్తి ఉన్నారు. కర్నూలు నగరం, నంద్యాల, ఆదోని, డోన్ పట్టణాలను అర్బన్ మండలాలుగా చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ దిశగా ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. అర్బన్, రూరల్ ప్రాంతాలు కలిపి ఒకే మండలంగా ఉండటం వల్ల పరిధి పెరిగిపోయి అభివృద్ధి కుంటుపడుతోంది. సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. తహసీల్దార్లపై పని ఒత్తిడి పెరిగిపోతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నాలుగు అర్బన్ మండలాలు ఏర్పాటు చేయలనే నిర్ణయానికి వచ్చారు. కర్నూలు నగరాన్ని అర్బన్ మండలం చేయాలనే ప్రతిపాదన కొన్నేళ్లుగా ఉంది. ప్రభుత్వం కూడా దీనిని ఆమోదించింది. కానీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా కర్నూలుతో పాటు మరో మూడు అర్బన్ మండలాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇవి ఏర్పాటయితే జిల్లాలో మండలాల సంఖ్య 58కి చేరనుంది. -
24 నుంచి డివిజన్ల వారీగా ఉల్లి కొనుగోళ్లు
కర్నూలు(అగ్రికల్చర్): స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 24 నుంచి రెవెన్యూ డివిజన్ వారీగా ఉల్లి కొనుగోళ్లు చేపట్టనున్నట్లుగా మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణచౌదరి తెలిపారు. బుధవారం మార్కెట్ యార్డులోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఉల్లి నాణ్యతను పరిశీలించి గ్రేడింగ్‌లు ఇవ్వడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేక బృందాలకు సూచించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
రామాయంపేట 48 గంటల బంద్
మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు ఉధృతమయ్యాయి. అఖిలపక్షాల పిలుపు మేరకు గురువారం ఉదయం నుంచి 48 గంటల బంద్ మొదలైంది. వర్తక, వ్యాపార కేంద్రాలు మూతబడ్డాయి. బస్సులు పట్టణంలోకి రాకుండా బైపాస్నుంచే వెళ్తున్నాయి. బంక్‌లు, బ్యాంక్‌లు పనిచేయటం లేదు. స్థానిక యువకులు ముగ్గురు సెల్‌టవర్ ఎక్కారు. డివిజన్‌గా ప్రకటించకుంటే దూకుతామని బెదిరిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. -
కొత్తగా షాద్‌నగర్ డివిజన్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మరో 24 గంటల్లో కొత్త జిల్లాలు కొలువుదీరనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆఖరి గడియల్లో సవరణల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రతిపాదిత రంగారెడ్డి జిల్లాలో ఇదివరకే ప్రకటించిన నాలుగు కొత్త రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో డివిజన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. షాద్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే అంజయ్య ఆదివారం సీఎంను కలిశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలను కలిపి డివిజన్ గా ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. అలాగే కొత్తూరు మండలాన్ని విభజించి నందిగామ కేంద్రంగా మరో మండలాన్ని ప్రకటించాలని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్..కొత్తగా నందిగామ మండలంతో పాటు షాద్‌నగర్ రెవెన్యూ డివిజన్ కు ఆమోదముద్ర వేశారు. కొత్తగా ఏర్పడే షాద్‌నగర్ డివిజన్ లోకి కొత్తూరు, కేశంపేట, కొందుర -
రామన్నపేట రెవెన్యూ డివిజన్ కోసం రాస్తారోకో
రామన్నపేట మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చిట్యాల-భువనగిరి మార్గంలో రాస్తారోకో చేశారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రాస్తారోకోతో రవాణా స్తంభించటంతో దైవదర్శనం చేసుకుని వస్తోన్న మంత్రి తలసాని వేరే మార్గంలో వెళ్లిపోయారు. రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలంటూ అన్ని పార్టీలు గురువారం బంద్ ప్రకటించాయి. ఈ బంద్‌లో అన్ని సంఘాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. -
కొత్త రెవెన్యూ డివిజన్లుగా డోన్, ఆత్మకూరు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో మరో రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోనున్నాయి. కొన్నేళ్లుగా జిల్లాలో కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నా కార్యరూపం దాల్చలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త రెవెన్యూ డివిజన్లకు మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లాలోని డోన్, ఆత్మకూరులు కేంద్రాలుగా డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం జిల్లాలో మూడు డివిజన్లు ఉన్నాయి. కొత్తవాటితో వీటి సంఖ్య ఐదుకు పెరగనుంది. కొత్త రెవెన్యూ డివిజన్లలో ఏఏ నియోజకవర్గాలను చేర్చాలి, ప్రస్తుత డివిజన్లలో ఏఏ నియోజక వర్గాలు ఉన్నాయి తదితర వివరాలు పంపాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఇప్పటి వరకు ఒక నియోజకవర్గంలో కొన్ని మండలాలు ఒక నియోజకవర్గంలో ఉంటే మరికొన్ని మండలాలు మరో డివిజన్లో ఉన్నాయి. వీటిని సవరిస్తూ కొత్త డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. -
రామన్నపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో
రామన్నపేట : అభివృద్ధిలో సమతుల్యను పాటించడానికి ప్రభుత్వం రామన్నపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో చిట్యాల–భువనగిరి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. డిప్యూటీ తహసీల్దార్ ఎల్లేశంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఒకప్పుడు నియోజకవర్గ, తాలుకా కేంద్రాలుగా విరజిల్లిన రామన్నపేటను పాలకులు వెనుకబాటుకు గురి చేశారని ఆరోపించారు. రామన్నపేట, చౌటుప్పల్, వలిగొండ, మోత్కూరు, వలిగొండ తదితర మండలాలను కలుపుతూ రామన్నపేట కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే ప్రజలందరికీ సౌలభ్యంగా ఉంటుందని వివరించారు. దాదాపు అన్నిశాఖలకు సంబంధించిన సబ్ డివిజన్ కార్యాలయాలు రామన్నపేటలో పని చేస్తున్నాయన్నారు. అందుకే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తే రామన్నపేట అన్ని విధాలా అభివృద్ధే అవకాశం ఉంటుందన్నారు. గంటపాటు నిర్వహించిన రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో కాంగ్రెస్,బీజేపీ,టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీయూవీ నాయకులు ఊట్కూరి నర్సింహ, ఆకవరపు మధుబాబు,గర్దాసు సురేష్, సాల్వేరు అశోక్, కందుల హన్మంత్, ఎస్కే చాంద్, బీకే మూర్తి, జెల్ల వెంకటేశం, వనం చంద్రశేఖర్, నీల ఐలయ్య, గంగాపురం యాదయ్య, కొమ్ము యాదయ్య, బొడ్డు అల్లయ్య, పోతరాజు శంకరయ్య, వనం భిక్షపతి, శివరాత్రి సమ్మయ్య, పాల్వంచ శంకర్, నక్క యాదయ్య, ఎండీ జమీరుద్దిన్, దండుగల సమ్మయ్య, పబ్బతి లింగయ్య, ఎండీ గౌస్, కూనూరు సుధాకర్, సుదర్శన్, మహాలింగం, సహదేవ్, తోటకూరి అంజయ్య, దండుగల సమ్మయ్య పాల్గొన్నారు. -
రెవెన్యూ డివిజన్ సాధనే లక్ష్యంగా పోరాటం
హుజూర్నగర్ : హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు మరింతగా ఉధృతంగా పోరాటం చేస్తామని పలువురు అఖిలపక్ష నాయకులు తెలిపారు. శనివారం స్థానిక ఇందిరా సెంటర్లో నియోజకవర్గ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గ విద్యార్థి జేఏసీ కన్వీనర్ కుక్కడపు మహేష్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు తన్నీరు మల్లికార్జున్‌రావు, యరగాని నాగన్నగౌడ్, పాలకూరి బాబు, జక్కుల నాగేశ్వరరావు, చిట్యాల అమర్నాథరెడ్డి, మేకల నాగేశ్వరరావు, పీవీ.దుర్గాప్రసాద్, అట్లూరి హరిబాబు, వట్టికూటి జంగమయ్య, ములకలపల్లి సీతయ్య, జక్కుల మల్లయ్య, శివరాం యాదవ్, ఎస్కే.సైదా, విజయ్, యరగాని గురవయ్య, కోల మట్టయ్య, చిలకరాజు లింగయ్య, యల్లావుల రాములు, గుండు వెంకటేశ్వర్లు, సుతారి వేణు, బాచిమంచి గిరిబాబు, పండ్ల హుస్సేన్‌గౌడ్ పాల్గొన్నారు. -
హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి
హుజూర్నగర్ : నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాసెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను పాటిస్తూ, అన్ని అర్హతలు ఉన్న హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలన్నారు. ఇందుకోసం నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి డివిజన్ కేంద్రంగా ప్రకటించే వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపారు. భారీ వర్షంలో సైతం సుమారు 2 రెండు గంటల పాడు రాస్తారోకో చేయడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ఎండి.నిజాముద్దీన్, తన్నీరు మల్లికార్జున్‌రావు, గొట్టె వెంకట్రామయ్య, యరగాని నాగన్నగౌడ్, ఎంఏ.మజీద్, ఎస్కె.సైదా, అట్లూరి హరిబాబు, చావా కిరణ్మయి, రౌతు వెంకటేశ్వరరావు, ఎస్డి.రఫీ,చిలకరాజు లింగయ్య, పండ్ల హుస్సేన్‌గౌడ్, కోల శ్రీను, సామల శివారెడ్డి, గూడెపు శ్రీనివాస్, ఎం.పెదలక్ష్మీనర్సయ్య, జడ రామకృష్ణ,పోతుల జ్ఞానయ్య, పిల్లి మల్లయ్య, యల్లావుల రాములు, పాలకూరి బాబు, గుండు వెంకటేశ్వర్లు, మామిడి వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్, పానుగంటి పద్మ జేఏసీ నాయకులు పీవీ.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
నేటి నుంచి ఎమ్మెల్యే వంశీ ఆమరణ దీక్ష
-
నేటి నుంచి ఎమ్మెల్యే వంశీ ఆమరణ దీక్ష
కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని వినతి సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి బుధవారం నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నారు. చారిత్రక నేపథ్యం, జనాభా, ఇతర మండలాల ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని గత కొంత కాలంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాట తీవ్రతను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఆమరణ దీక్షే సరైన మార్గమని కల్వకుర్తి అఖిలపక్షం తీర్మానం చేయడంతో వంశీ దీక్షకు దిగుతున్నారు. ఈ దీక్ష ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాదని ఆయన వెల్లడించారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా సాధించుకోవడానికే దీక్ష చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. -
సానుకూల ప్రకటన రాకపోతే ఆమరణ దీక్ష
కాంగ్రెస్ నేత ఇనుగాల వెంకట్రాంరెడ్డి పరకాల డివిజన్ సాధన దీక్ష మరో రోజు పొడిగింపు పరకాల : పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రామ్రెడ్డి స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజన్ సాధన కోసం వెంకట్రామ్రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆదివారంతో రెండోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు తాను నిరాహార దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం వరకు దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. దీక్షకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. -
కల్లూరును రెవెన్యూ డివిజన్‌గా చేయాలి
ఖమ్మం అర్బన్ : ఖమ్మం జిల్లాలో కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం సతుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఆఖిల పక్షనాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందించారు. అనేక ఏళ్లుగా ప్రతిపాదనలో ఉన్న కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. రెవెన్యూ జిల్లా ఏర్పాటు టాస్క్‌ఫోర్స్ చైర్మన్ ప్రదీప్‌చంద్రకు కూడా వినతిపత్రం అందించారు. వినతి అందించినవారిలో ఆఖిలపక్ష నాయకులు గొర్రెపాటి రాధయ్య, కాటంనేని వెంకటేశ్వరరావు, ఎన్.వెంకటేశ్వర్లు, జాస్త్రీ శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, దుర్గాప్రసాద్, రామలరాజు, అప్పిరెడ్డి, వెంకటేశ్వరరావు, అంజయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు. -
కల్లూరును రెవెన్యూ డివిజన్‌గా చేయాలి
ఖమ్మం అర్బన్ : ఖమ్మం జిల్లాలో కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం సతుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఆఖిల పక్షనాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందించారు. అనేక ఏళ్లుగా ప్రతిపాదనలో ఉన్న కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. రెవెన్యూ జిల్లా ఏర్పాటు టాస్క్‌ఫోర్స్ చైర్మన్ ప్రదీప్‌చంద్రకు కూడా వినతిపత్రం అందించారు. వినతి అందించినవారిలో ఆఖిలపక్ష నాయకులు గొర్రెపాటి రాధయ్య, కాటంనేని వెంకటేశ్వరరావు, ఎన్.వెంకటేశ్వర్లు, జాస్త్రీ శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, దుర్గాప్రసాద్, రామలరాజు, అప్పిరెడ్డి, వెంకటేశ్వరరావు, అంజయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు. -
తూప్రాన్‌ను రెవెన్యూ డివిజన్‌గానే ఉంచాలి
తూప్రాన్: ప్రభుత్వం ప్రకటించినట్లుగానే తూప్రాన్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఉంచాలని యాదవ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు అబోతు వెంకటేశ్‌యాదవ్ అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తూప్రాన్ మండలంను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడంపట్ల ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కాని నర్సాపూర్ ఎమ్మెల్యే మధన్‌రెడ్డి మాత్రం తూప్రాన్ బదులుగా నర్సాపూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావడం మానుకోవాలన్నారు. అభివృద్ధిలో ముందంజలో ఉండి హైదరాబాద్ నగరానికి సమీప దూరంలో ఉన్న తూప్రాన్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయడం పట్ల ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే మండలంలో పోలీస్ సబ్‌డివిజన్, విద్యుత్ సబ్ సబ్డివిజన్లు ఉన్నాయని చెప్పారు. చాల ఏళ్ల కాలం నుంచి మండల ప్రజలు రెవెన్యూ డివిజన్ కోసం కృషి చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి మండల ప్రజల గోడును విని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడం పట్ల సర్వత్ర అభినందనలు తెలియజేశారన్నారు. కాని నర్సాపూర్ ఎమ్మెల్యే మధన్‌రెడ్డి తమ మండల అభివృద్ధిని గుర్తించి సహకరించాల్సింది పోయి నష్టం చేకూర్చే విధంగా ప్రవర్తించడం సమంజసం కాదన్నారు. సమావేశంలో గొర్ల కాపారుల సంఘం జిల్లా డైరక్టర్ గండి మల్లేష్ యాదవ్, యూత్ నాయకులు రాజుయాదవ్, మల్లేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కోరుట్ల బంద్ సక్సెస్
కోరుట్ల : కోరుట్లను రెవెన్యూ డివిజన్ చేయాలని సాధన సమితి ఇచ్చిన పిలుపు పట్టణంలో విజయవంతమైంది. ఉదయం నుంచి వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు బంద్ పాటించాయి. సాధన సమితి అధ్యక్షుడు చెన్న విశ్వనాథం, జక్కుల ప్రసాద్, పేట భాస్కర్, ఇందూరి సత్యం, గండ్ర రాజనర్సింగరావు, తిరుమల గంగాధర్‌తోపాటు వంద మంది ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ముట్టడి సాధన సమితి ప్రతినిధులు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. సీఐ సురేందర్ ఆధ్వర్యంలో ఎస్సైలు కృష్ణకుమార్, జానీబాషా ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో నాయకులు గేట్ వద్ద బైఠాయించారు. తహసీల్దార్ మధు అనుమతితో లోపలికి వెళ్లారు. పట్టణంలో విధించిన 144 సెక్షన్ ఎత్తివేయాలని, కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా మార్చాలంటూ వినతిపత్రం సమర్పించారు. రెవెన్యూ డివిజన్ కోరుతూ సాధన సమితి అధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షల్లో మంగళవారం నాÄæూబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
సీఎంతో చర్చకు ఎంపీ హామీ
కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం వినతి కోరుట్ల: కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పినట్టు మున్సిపల్ చైర్మన్ శీలం వేణు, వైస్ చైర్మన్ రఫీయోద్దీన్ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనూప్‌రావుతో కలిసి ఈ విషయమై వినతి పత్రం సమర్పించారు. కోరుట్లకు ఉన్న అన్ని అనుకూల అంశాలను ఎంపీకి వివరించామని తెలిపారు. ఎమ్మెల్యే కల్వకుంట్లతో సీఎం కేసీఆర్‌ను కలిసిlకోరుట్ల–మెట్పల్లి మధ్యలో రెవెన్యూ డివిజన్ ఉండేలా కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారని తెలిపారు. ఆయనతో పాటు ఎంఐఎం కౌన్సిలర్ చిట్యాల భూమయ్య, టీఆర్ఎస్ నాయకులు జక్కుల జగదీశ్వర్, కస్తూరి లక్ష్మీనారాయణ, సదుల వెంకటస్వామి, మోల్లా మసూద్ ఉన్నారు. ఎంపీ కాళ్లు పట్టుకున్న కౌన్సిలర్ కోరుట్ల రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ ఎంఐఎం కౌన్సిలర్ చిట్యాల భూమయ్య ఎంపీ కవిత కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. మొదట రెవెన్యూ డివిజన్‌గా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసి మళ్లీ మార్పులు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల అర్హతలు ఉన్న కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఆయన కోరారు. -
కోరుట్ల రెవెన్యూ డివిజన్ ప్రకటించాలి
ర్యాలీలు, రాస్తారోకోలు పట్టణంలో 144 సెక్షన్ కోరుట్ల : కోరుట్లను రెవెన్యూ డివిజన్ చేయాలని చేపట్టిన పోరు ఊపందుకుంది. రెండు రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ 144 సెక్షన్ విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలుపుకోవాలని సూచించారు. కోరుట్ల మినీవ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదాం రోడ్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ తీసి రాస్తారోకో చేశారు. ముస్లిం మైనార్టీలు తెలంగాణతల్లి విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ మధుకు వినతిపత్రం ఇచ్చారు. దీక్షలో చెట్పల్లి లక్ష్మణ్, వడ్లకొండ తుక్కారాం, బాపురావు పాల్గొన్నారు. డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు చెన్న విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి పేట భాస్కర్, ప్రతినిధులు గడ్డం మధు, జక్కుల ప్రసాద్ మాట్లాడుతూ కోరుట్ల డివిజన్ సాధించే వరకు ఉద్యమిస్తామన్నారు. -
చెన్నూర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి
ఆందోళన బాటపట్టిన చెన్నూర్ ప్రజానీకం మంచిర్యాల సిటీ : కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో జిల్లాలోని చెన్నూర్ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ శుక్రవారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయం ఇన్చార్జి రాజేశ్వర్‌రావుకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఇన్చార్జి డాక్టర్ మురళీధర్‌గౌడ్ మాట్లాడుతూ చెన్నూర్‌ను డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తే వేమనపల్లి, కోటపల్లి, జైపూర్ మండలాలతోపాటు చెన్నూర్ మండలవాసులకు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మండల వ్యవస్థ రాకముందు చెన్నూర్ తహసీల్ కేంద్రంగా ప్రజలకు సేవలందించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, అందుగుల శ్రీనివాస్ ఉన్నారు. -
రెవెన్యూ డివిజన్‌పై సీఎంతో మాట్లాడుతా
రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు హుస్నాబాద్ : హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలపాలని అఖిలపక్ష నాయకులు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ను కోరారు. హైదరాబాద్‌లోని నివాసంలో గురువారం కలిశారు. సిద్దిపేటలో హుస్నాబాద్‌ను కలిపితే రెవెన్యూ డివిజన్ ఏర్పడే పరిస్థితులు లేవని అఖిలపక్ష నాయకులు వారికి తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిందని, హుస్నాబాద్‌కు రెవెన్యూ డివిజన్ విషయమై సీఎంతో మాట్లాడుతానని కెప్టెన్ లక్ష్మీకాంతారావు హామీ ఇచ్చినట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు. పదిహేను రోజుల్లోగా ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పినట్లు వారు తెలిపారు. గ్రామ పంచాయతీ తీర్మాణాల కాపీలతో అభ్యంతరాల స్వీకరణలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారన్నారు. హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండో అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, జేఏసీ మండల కన్వీనర్ కొయ్యడ కొమురయ్య, కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్, మైదంశెట్టి వీరన్న, బొల్లి శ్రీనివాస్, అక్కు శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఆడెపు లక్ష్మీనారాయణ, వేముల దేవేందర్‌రెడ్డి, దొడ్డి శ్రీనివాస్, పెందోట అనిల్‌కుమార్, సీపీఎం నాయకులు జాగిరి సత్యనారాయణ, శివరాజ్, సీపీఐ నాయకులు గడిపె మల్లేశ్, హన్మిరెడ్డి, మాడిశెట్టి శ్రీధర్, టీడీపీ నాయకులు వరయోగుల శ్రీనివాస్, ముప్పిడి రాజిరెడ్డి పాల్గొన్నారు. -
గజ్వేల్‌కు కొత్తరూపు
రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో అభివృద్ధి శరవేగం అందుబాటులో డివిజన్ స్థాయి కార్యాలయాలు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి సన్నాహాలు రాష్ట్రంలోనే ఇది తొలి కార్యాలయం గజ్వేల్: గజ్వేల్ రూపురేఖలు త్వరలో మారిపోనున్నాయి. అభివృద్ధి మరింత వేగం అందుకోనుంది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో దశదిశా మారనుంది. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ఈ పట్టణం గజ్వేల్‌తోపాటు దౌల్తాబాద్, జగదేవ్‌పూర్, కొండపాక, ములుగు, వర్గల్, చేర్యాల, మద్దూర్ మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కానుంది. కొత్తగా ఇందులోకి వరంగల్ జిల్లా చేర్యాల, మద్దూర్ మండలాలు, దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలాన్ని చేర్చారు. ఇప్పటికే ఇక్కడ రెవెన్యూ డివిజన్ స్థాయి తరహాలో వాటర్‌గ్రిడ్ ఈఈ, ప్రాణహిత పథకం ఈఈ, ఇరిగేషన్ శాఖ ఈఈ కార్యాలయాలున్నాయి. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వ శాఖలన్నింటికీ కలిపి ఇంటిగ్రేటెడ్ కార్యాలయాన్ని పట్టణంలోని హౌసింగ్ బోర్డు మైదానంలో ఏర్పాటు చేస్తున్న విషయం తెల్సిందే. గతేడాది సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో ఇక్కడ పర్యటించిన నేపథ్యంలో గజ్వేల్‌కు రెవెన్యూ డివిజన్ హంగులు తెస్తామని ప్రకటించి మాట నిలబెట్టుకున్నారు. గజ్వేల్ నేపథ్యం గజ్వేల్ రెవెన్యూ డివిజన్ వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉంది. అందుకే ఇక్కడ ఈ మూడు జిల్లాల సంస్కృతి విస్తరించింది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకొని ఉండటంతో ఇక్కడా నగర వాతావరణం కన్పిస్తోంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో గజ్వేల్‌కు చరిత్ర ఉంది. 1969లో జరిగిన కాల్పుల్లో పట్టణానికి చెందిన పన్నెండేళ్ల బాలుడు అయిల నర్సింలు అసువులు బాసాడు. 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ప్రకటన చేసి వెనక్కి తగ్గిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ ఉద్యమాలు జరిగాయి. కూరగాయల సాగుతో గజ్వేల్ డివిజన్ ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. ములుగులోని అటవీ పరిశోధనా కేంద్రంలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. దీంతోపాటు ఫారేస్ట్రీ కళాశాలను సైతం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ ‘ఇలాకా’గా ఆవిర్భావం 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్న కేసీఆర్ ఘన విజయాన్ని సాధించారు. ఆ తరువాత ఆయన ఈ ప్రాంతాన్ని తన సొంత ‘ఇలాకా’గా మార్చుకున్నారు. నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి శివారులో ఫామ్‌హౌస్‌ను నిర్మించుకున్న కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే దిశలో టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమాలకు సంబంధించి ఇక్కడి నుంచే వ్యుహా రచన చేశారు. పర్యాటక ప్రాంతంగా గుర్తింపు గజ్వేల్ పర్యాటక ప్రదేశంగానూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. వర్గల్‌లోని విద్యాసరస్వతీ ఆలయం తెలంగాణలో బాసర తర్వాత రెండో ఆలయంగా, ఇదే మండలంలోని నాచారంగుట్ట రెండో యాదగిరి గుట్టగా బాసిల్లుతున్నాయి. రెవెన్యూ డివిజన్ పరిధి ఇలా.. మండలం జనాభా గజ్వేల్ 77,264 జగదేవ్‌పూర్ 47,093 కొండపాక 48,592 ములుగు 44,076 వర్గల్ 44,525 మద్దూర్ 38,731 చేర్యాల 70,809 దౌల్తాబాద్ 53,824 -
నెరవేరనున్న కల!
నారాయణఖేడ్‌కు పూర్వవైభవం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఖేడ్ పట్టణం స్థానికుల్లో హర్షాతిరేకాలు నారాయణఖేడ్: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నారాయణఖేడ్ వాసులు కల నెరవేరనుంది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రకాలుగా నష్టపోయిన ఖేడ్ పట్టణం తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ కేంద్రం కానుంది. ఖేడ్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రాంత ప్రజల్లో సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన అఖిలపక్షం సమావేశంలో సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. త్వరలో జిల్లాలు, డివిజన్ల విభజనకు సంబంధించిన తుది ముసాయిదాను ప్రభుత్వం ప్రచురించడంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మార్గం సుగమమమైంది. మొదట నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలు, అందోల్ నియోజకవర్గంలోని పలు మండలాలను కలుపుతూ ఖేడ్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తారని భావించారు. అయితే సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్‌ను ఓ డివిజన్‌గా, జహీరాబాద్‌ను మరో రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏర్పాటు కానున్న ఖేడ్ రెవెన్యూ డివిజన్లో నియోజకవర్గంలోని ఖేడ్, మనూరు, కల్హేర్, కంగ్టి, అందోల్ నియోజకవర్గంలోని రేగోడ్ మండలాలతోపాటు ఖేడ్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు కానున్న నాగల్గిద్ద, సిర్గాపూర్ మండలాలను కలుపుతున్నారు. అంటే ఖేడ్ నియోజకవర్గంలోని ఆరు మండలాలు, అందోల్ నియోజకవర్గంలోని రేగోడ్ మండలాలు కలపడంతో మొత్తం ఏడు మండలాలతో ఖేడ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ఖేడ్ నియోజకవర్గంలో ఉన్న పెద్దశంకరంపేట మండలాన్ని ఆ ప్రాంత వాసుల కోరిక మేరకు మెదక్ రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పెద్దశంకరంపేట మండలం మెదక్ నియోజకవర్గంలోనే ఉంది. పునర్విభజనతో ఖేడ్‌లో కలిసింది. ఇక ఈ డివిజన్లో అందోల్ నియోజకవర్గంలోని రేగోడ్ మండలం ఒక్కటే అదనంగా చేరుతుంది. భౌగోళికంగా చూస్తే ఈ మండలాలన్నీ ఖేడ్ నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోనే ఉంటాయి. మధ్యస్థంగా నారాయణఖేడ్ ఉండగా చుట్టూ మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం సైతం రవాణా, పరిపాలనా పరంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ డివిజన్‌ను ఏర్పాటు చేస్తోంది. గతంలో ఖేడ్ డివిజన్ కేంద్రమే! ఆరో నిజాం కాలం నుంచే నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉండేది. వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్న సమయంలో నారాయణఖేడ్ డివిజన్ కేంద్రంగా ఉండేంది. ఈ ప్రాంతాన్ని నాడు నాలుగు సర్కిళ్లుగా విభజించారు. కల్హేర్, ఏల్గోయి, కంగ్టి, నారాయణఖేడ్ సర్కిళ్లుగా ఉండేవి. అప్పట్లో 16 జిల్లాలు ఉండగా కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ రాష్ట్రాలను మూడుగా విభజించారు. దేశ్‌ముఖ్‌లు మాలీపటేళ్లుగా, దేశ్‌పాండేలు పట్వారీలుగా, మైనార్టీ ప్రముఖులు పోలీస్ పటేళ్లుగా కొనసాగారు. అనంతరం బీదర్ జిల్లా కింద నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలను మార్చారు. 1956లో రాష్ట్రాల పుర్వ్యవస్థీకరణలో నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో వీలీనం కావడంతో డివిజన్లను తొలగించారు. కేవలం నియోజకవర్గాలుగానే ఉంచారు. అభివృద్ధికి ఆస్కారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఖేడ్ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఆర్డీఓతోపాటు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, విద్య, వైద్య, పశువైద్య, వ్యవసాయ తదితర శాఖల్లో డివిజన్‌స్థాయి అధికారులు, ఎస్సీ స్థాయి అధికారులు ఇక్కడ కొలువుదీరే అవకాశం ఉంది. ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అన్ని వనరులు ఉన్నాయి. నిజాంపేట్ నుంచి నారాయణఖేడ్ మీదుగా బీదర్ వరకు ఉన్న రహదారిని నేషనల్ హైవే 51గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంజీరా పరీవాహక ప్రాంతం కావడం, కర్మాగారాల ఏర్పాటుకు భూములు, నీటి అనుకూలత ఉంది. ఖేడ్ మండలం జూకల్ శివారులో పాలిటెక్నిక్, మార్కెట్ యార్డు తదితర ప్రభుత్వ భవనాలు ఉన్నందున ఈ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు కూడా ఎటువంటి స్థల సమస్య లేదు. ఉప ఎన్నిక సమయంలో కూడా ఖేడ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. మంత్రి హరీశ్‌రావు ఖేడ్‌ను డివిజన్ చేస్తామని హామీ ఇవ్వడంతోపాటు బహిరంగంగా ప్రకటించారు. మొత్తంగా ఈ ప్రాంత ప్రజల కల ఎన్నో ఏళ్లకు నెరవేరుతుండటంతో స్థానికులు సంబురాలు జరుపుకునేందుకు సిద్ధమాయ్యారు. -
నెరవేరనున్న దశాబ్దాల కల
హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్ చేయడానికి ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, జమ్మికుంట, హుజూరాబాద్ మండలాలను హన్మకొండ జిల్లాలోకి చేర్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో దశాబ్దాల కల తొందరలోనే నెరవేరనుంది. - హుజూరాబాద్ హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఓ ప్రత్యేకత ఉంది. 2014 ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది ఆగస్టులో హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోనే తాత్కాలికంగా అప్పటి జాయింట్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ చేతుల మీదుగా రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రస్తుత కరీంనగర్ ఆర్డీఓ చంద్రశేఖర్‌ను ఇన్చార్జి ఆర్డీఓగా నియమించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి, సైదాపూర్, మానకొండూర్ మండలంలోని శంకరపట్నం మండలాలను హుజూరాబాద్ ఆర్డీఓ పరిధిలోకి తీసుకొచ్చారు. అయితే అంతకుముందే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికి కాంగ్రెస్ సర్కారు హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించింది. దీంతో హుజూరాబాద్‌లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ సర్కారు వచ్చాక హుస్నాబాద్‌ను పక్కన పెట్టి హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించింది. దీంతో హుస్నాబాద్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. కొందరు ఈ అంశంపై కోర్టుకు వెళ్లడంతో రెండు చోట్ల డివిజన్ల ఏర్పాటు నిలిచిపోయింది. ఇప్పుడు మోక్షం... హుజూరాబాద్ కేంద్రంగా రెవెన్యూ డివిజన్ కావాలని ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం పోరాటాలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రతి ఎన్నికల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తామంటూ నాయకులు హామీలిస్తూ దీనిని ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రెవెన్యూ డివిజన్ ప్రతిపాదనలను పక్కనపెడుతూ వచ్చాయి. తాజాగా జిల్లాల పునర్విభజన నేపథ్యంలో హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ కల నెరవేరనుంది. హుజూరాబాద్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, జమ్మికుంట, కమలాపూర్ మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కానుంది. సకాలంలో అందనున్న సేవలు... ప్రస్తుతం హుజూరాబాద్‌తోపాటు పైన పేర్కొన్న మండలాలు కరీంనగర్ రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరగాలంటే ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో పనులు జరుగక నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఎట్టకేలకు హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపడంతో ఇకనుంచి సకాలంలో సేవలందనున్నాయి. భూ సమస్యల పరిష్కారం మెరుగుపడనుందని ప్రజలు భావిస్తున్నారు. -
రెవెన్యూ డివిజన్‌గా తూప్రాన్
విస్తరించనున్న వ్యాపారం, వాణిజ్యం నగర శోభను సంతరించుకోనున్న పట్టణం తూప్రాన్: మండల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఏదురుచూస్తున్న కల ఎట్టకేలకు సకారమైంది. దీంతో మండలంలో ఆనందం సంతరించుకుంది. రెవెన్యూ డివిజన్‌గా తూప్రాన్ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సర్వత్ర సంతోషం నెలకొంది. తూప్రాన్ మండలం.. హైదరాబాద్ నగరానికి 40 కీలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇప్పడికే అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. 44వ జాతీయ రహదారి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సికింద్రాబాద్ నుంచి నాగపూర్ వరకు రైలు మార్గం ఉండడం మండలానికి ఓ ప్రత్యేక గుర్తింపు అని చెప్పవచ్చు. అంతే కాకుండా మండలంలో రెండు ఇంటర్నేషనల్ స్కూల్స్, అభ్యాస, ది జైన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అందులోను రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు సరిహద్దు మండలం కావడంతో ఉక్కడి భూములకు డిమాండ్ ఎక్కువ. దీంతో వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటుకు వ్యాపారవేత్తలు మక్కువ చూపుతున్నారు. కాళ్లకల్ పారిశ్రామిక ప్రాంతంలో టీఎస్ఐఐసీని సుమారు 11 వందల ఎకరాల్లో ఏర్పాటు చేయడంతో ఇప్పటికే సుమారు 40 పరిశ్రమలు నిర్మాణం జరుగగా వీటిలో 25 పారిశ్రమల వరకు ఉత్పత్తి ప్రారంభించాయి. మండలంలో మొత్తం 100కు పైగా పరిశ్రమలున్నాయి. పంచయతీలు సైతం అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటి వరకు సిద్దిపేట ఆర్డీఓ పరిధిలో కొనసాగిన తూప్రాన్ మండల ప్రజలు అనేక వ్యయ ప్రయాసాలు పడ్డారు. భూముల విషయంలో ఏదైన సమస్య తెలెత్తితే 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేటకు వెళ్లడానికి రోజంతా సరిపోయేది. పోయిన పని అయితే సరి.. లేదంటే తిరిగి మరుసటి రోజు వేళ్లాల్సి వస్తే.. వారి బాధలు వర్ణాణాతీతం. కాని ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో తూప్రాన్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మండలంలో... తూప్రాన్ మండలం హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండడంతో దినదిన అభివృద్ధి చెందుతూ వస్తోంది. విద్యాపరంగా వివిధ రకాల 21 కళాశాలలు, వ్యాపార, వాణిజ్యం, 44వ జాతీయ రహదారి, దక్షిణ మధ్య రైల్వే మార్గంతో పాటు రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. మండలంలో పోలీస్ సబ్ డివిజన్, టీపీసీపీడీసీఎల్ డివిజన్ కార్యాలయం, సబ్ రిజిష్టర్ కార్యాలయం ఉంది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో మండలం ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చి సౌలభ్యం ఏర్పడనుంది. -
అచ్చంపేటను రెవెన్యూ డివిజన్ చేయడంపై హర్షం
లింగాల: కొత్తగా ఏర్పాటవుతున్న నాగర్‌కర్నూల్ జిల్లాలో నియోజకవర్గ కేంద్రంమైన అచ్చంపేటను రెవెన్యూ డివిజన్ చేయుటకు ప్రభుత్వం నిర్ణయించడంపై గురువారం ఎంపీపీ చీర్ల మంజుల హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అచ్చంపేట రెవెన్యూ డివిజన్‌గా మారితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీ కిషన్‌నాయక్,ఎంపీటీసీ అల్లె ప్రియాంక,టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రానోజీ, నాయకులు చీర్ల కష్ణ,అల్లె శ్రీనివాసులు ముఖ్యమంత్రికి కతజ్ఞతలు తెలిపారు. -
‘జై’హీరాబాద్
కొత్త రెవెన్యూ డివిజన్‌గా ప్రతిపాదన? వారంలో అధికారికంగా ప్రకటించే అవకాశం మొగుడంపల్లి కేంద్రంగా కొత్తగా మండలం జహీరాబాద్: జహీరాబాద్ కేంద్రంగా కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. వారంలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక సాకారం కానుంది. సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించినందున అందులో భాగంగానే రెవెన్యూ డివిజన్ కేంద్రాలనూ ప్రతిపాదించింది. జహీరాబాద్ కొత్త రెవెన్యూ డివిజన్ కిందకు నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాలతో పాటు కొత్తగా ఏర్పడనున్న మొగుడంపల్లి మండలం చేరనుంది. జహీరాబాద్ పాత తాలూకా పరిధిలో ఉన్న రాయికోడ్ కూడా ఇదే డివిజన్ కిందకు రానుంది. ప్రస్తుతం ఈ మండలం ఆందోల్ నియోజకవర్గంలో ఉంది. ఇదే నియోజకవర్గంలోని మునిపల్లి మండలం కూడా జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ కేంద్రం పరిధిలో చేరనుంది. ఈ రెండు మండలాలు జహీరాబాద్ నియోజకవర్గానికి సరిహద్దుగా ఉన్నాయి. దూరాభారమైన సంగారెడ్డి ప్రస్తుతం జహీరాబాద్ నియోజకవర్గం సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. దీంతో పనుల నిమిత్తమై ప్రజలు సంగారెడ్డికి వెళ్లి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ మండలంలోని గుడుపల్లి గ్రామం సంగారెడ్డికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోహీర్ మండలం మనియార్‌పల్లి గ్రామం 65 కిలో మీటర్లు, న్యాల్కల్ మండలంలోని హుసేన్నగర్ 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవేకాకుండా అనేక గ్రామాల ప్రజలు సంగారెడ్డి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సాధన కోసం 50 రోజుల దీక్ష జహీరాబాద్ కాకుండా మరో ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ కేంద్రం తరలిపోతున్నదనే ప్రచారం నియోజకవర్గ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో అఖిల పక్షాల నేతలు దీక్షలకు పూనుకున్నారు. 48 రోజుల పాటు రిలే దీక్షలు, రెండు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కొత్త మండల కేంద్రంగా మొగుడంపల్లి జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి గ్రామం కొత్త మండల కేంద్రంగా అవతరించనుంది. గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. జహీరాబాద్ మండలం 66 గ్రామాలతో అతి పెద్ద మండలంగా ఉన్నందున దీన్ని రెండుగా విభజించేందుకు నిర్ణయించారు. కాగా, మొగుడంపల్లి మండల కేంద్రంలో చేరేందుకు జహీరాబాద్‌కు దగ్గరగా ఉన్న గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏయే గ్రామాలను కొత్త మండల కేంద్రంలో చేర్చుతారనే విషయమై ఇంకా తేలాల్సి ఉంది. -
జహీరాబాద్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి: వైఎస్ఆర్ సీపీ
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని వైఎస్ఆర్ సీపీ పట్టణ అధ్యక్షుడు ముర్తుజా డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. అయితే జహీరాబాద్ పట్టణం రెవెన్యూ డివిజన్‌కు అన్ని విధాల అనుకూలంగా ఉందన్నారు. జాతీయ రహదారిపై పలు ప్రాంతాలకు మధ్యలో ఉందన్నారు. సీనియర్ సివిల్ కోర్టు, పలు శాఖల ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయన్నారు. నారాయణ ఖేడ్ రెవెన్యూ డివిజన్ చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం ఉండదన్నారు. రాష్ర్ట ప్రభుత్వం అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు.ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు బాల్‌రాజ్, నాయకుడు ఫసీ పాల్గొన్నారు. -
రెవెన్యూ డివిజన్‌గా ఇబ్రహీంపట్నం
♦ తాత్కాలిక కలెక్టరేట్‌గా టీబీ శానిటోరియం ♦ ఉద్యోగుల విభజనపై కసరత్తు షురూ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో కొత్తగా ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ ఏర్పడనుంది. తూర్పు ప్రాంతంలోని రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీనగర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నంతో కలుపుకొని నయా జిల్లాను ఏర్పాటు చేయాలనే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నంను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని నిర్ణయించింది. ఒకవేళ ఇబ్రహీంపట్నంను జిల్లా చేస్తే దీని పరిధిలోకి మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల, అమన్‌గల్ మండలాలను కూడా కలపాలని భావిస్తోంది. ఈ మేరకు ఆ జిల్లా యంత్రాంగం కూడా అంగీకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన జరిగే కీలక సమావేశంలో నూతన జిల్లాలపై మరికొంత స్పష్టత వచ్చే అవకాశముంది. అనంతగిరిలో తాత్కాలిక కలెక్టరేట్ వికారాబాద్ తాత్కాలిక కలెక్టరేట్‌ను అనంతగిరిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతగిరిలోని టీబీ శానిటోరియం భవన సముదాయాన్ని దీనికోసం వినియోగించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఇటీవల రూ.9 కోట్లతో శానిటోరియాన్ని ఆధునికీకరించారు. పర్యావరణహిత కలెక్టరేట్లను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నందున.. అవసరమైతే పక్కా కలెక్టరేట్‌ను కూడా ఇక్కడే ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ చర్చలు జరుపుతోంది. అయితే, ఈ ప్రాంతానికి చేరుకోవడానికి ఒకే మార్గం ఉండడం ప్రతిబంధకంగా మారింది. ఉద్యోగుల సర్దుబాటుపై కుస్తీ జిల్లాల పునర్విభజన కసరత్తు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. మండల, డివిజన్‌స్థాయి ఉద్యోగుల విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ, జిల్లా స్థాయిలో పనిచేసే అధికారులు/ ఉద్యోగులను ఎలా సర్దుబాటు చేయాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది. ప్రస్తుతం మండల, డివిజన్లలో పనిచేస్తున్న ఉద్యోగులు అక్కడే కొనసాగుతారు. అయితే, జిల్లా కేంద్రంలోని వివిధ విభాగాల అధిపతుల (హెచ్ఓడీ)ను ఎలా వినియోగించుకోవాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. వీరి మార్పులు, చేర్పులపై ఎలాంటి సంకేతాలు వచ్చినా.. విధులను పక్కన పెట్టి పోస్టింగ్‌ల కోసం ప్రయత్నిస్తారని అనుమానిస్తోంది. దీంతో ప్రస్తుతానికి వీరి జోలికి వెళ్లకూడదని నిర్ణయించింది. జిల్లాల పరిధి తక్కువగా ఉంటున్నందున దానికి అనుగుణంగా కొన్ని పోస్టుల హోదాను తగ్గించాలని భావిస్తోంది. ఉదాహరణకు పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ విభాగాలకు ప్రస్తుతం జిల్లాలో ఎస్ఈ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడే జిల్లాలో ఎస్ఈ పోస్టును రద్దు చేస్తారు. కేవలం ఈఈ స్థాయి అధికారులనే కొనసాగిస్తారు. వీరి పర్యవేక్షణలోనే కార్యకలాపాలు సాగుతాయి. ఇదే విధంగా జేడీ, డీడీ, ఏడీ పోస్టులను కూడా ఎత్తివేసి.. అసిస్టెంట్ డెరైక్టర్ పోస్టులతో సరిపెట్టాలనే యోచన చేస్తోంది. కీలకమైన రెవెన్యూ విభాగంలో మాత్రం పెద్దగా మార్పులుండకపోవచ్చు. ఇద్దరు జాయింట్ కలెక్టర్ల స్థానే ఒకరే ఉండనున్నారు. -
జిల్లాల విభజన శాస్త్రీయంగా చేపట్టాలి
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ : జిల్లాల విభజన శాస్త్రీయంగా చేపట్టాలని, రెవెన్యూ డివిజన్ మండలాల విభజ నలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఉందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బుధవారం ఓ ప్రకటనలో సూచించారు. హుజూరాబాద్, హుస్నాబాద్‌లను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రతిపాదించినప్పటికీ కొన్ని కారణాలతో ఈ అంశం మరుగునపడిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కూతురు ఎంపీ కవిత ఆర్మూర్‌లో రెవెన్యూ డివిజన్‌ను ప్రారంభించుకున్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. పక్క జిల్లాలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకుంటున్నారని గతంలోనే ప్రతిపాదించిన హుజూరాబాద్, హుస్నాబాద్‌ల కోసం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ అర్బన్, రూరల్ రెవెన్యూ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విభజన చేపట్టాలని కోరారు. నూతనంగా ఏర్పాటు చేసే మండలాలు కూడా ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. అశాస్త్రీయంగా విభజన చేపడితే ప్రజాయుద్ధం తప్పదని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. -
రెవెన్యూ డివిజన్ చేయాల్సిందే
తూప్రాన్‌లో అఖిల పక్షం ఆందోళన బంద్.. రాస్తారోకో తూప్రాన్: జిల్లాల పునర్విభజన సందర్భంగా తూప్రాన్ మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలంటూ అఖిల పక్షం ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. మండలంలోని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం పట్టణంలోని రహదారిపై గ్రామ పంచాయతీ ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. డివిజన్ సాధన సమితి కన్వీనర్, సీనియర్ పాత్రికేయుడు సీఆర్.జానకిరాములు మాట్లాడుతూ తూప్రాన్ మండలాన్ని కొత్తగా ఏర్పడే 80 కి.మీ. దూరంలోని సిద్దిపేటలో కలపడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. 40 కి.మీ. దూరంలో ఉన్న మెదక్‌లో కలిపితే తమకు మేలు జరుగుతుందన్నారు. ఇప్పటికే పోలీస్, విద్యుత్ డివిజన్ కార్యాలయాలు మండలంలో ఉన్నాయని అలాగే రెవెన్యూ డివిజన్‌తో పాటు అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సాధన సమితి నాయకులు చక్రవర్తి, కిష్టారెడ్డి, ఆంజాగౌడ్, తాటి విఠల్, చందు, రహిం, వెంకటేశ్‌యాదవ్ పాల్గొన్నారు. -
కలెక్షన్ కింగ్
►నాకు అర్జెంట్ పని ఉంది. ఓ రూ.50 వేలు ఇవ్వు. మళ్లీ ఇస్తా! ► నువ్వు కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నావంట.. ఒక్కసారి నా వద్దకు వచ్చిపో!! ►మీరిద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. కోర్టుల చుట్టూ ఎక్కడ తిరుగుతారు.. రండి హోటల్లో మాట్లాడుకుందాం!!! ► ఇదీ ఓ సీఐ వ్యవహారం సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులు తీసుకోకపోవడం.. కేవలం సెటిల్మెంట్లతో వ్యవహారాలు చక్కబెట్టడం.. తన కింద పనిచేస్తున్న ఎస్ఐతో కలిసి ఇసుక దందాకు తెగబడటం.. ఆ సీఐ బాగోతం ఎంత చెప్పినా తక్కువే. అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న కొద్ది మంది వ్యాపారులను పిలిపించి కాల్‌మనీ పేరుతో బెదిరించి సుమారు రూ.10లక్షల నుంచి రూ.12 లక్షలు వసూలు చేశారు. ఇదే డబ్బుతో కొద్దిరోజుల క్రితం కారు కొన్న సదరు సీఐ ఎంచక్కా షికారు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఆ సీఐ వ్యవహారం కాస్తా ఇప్పుడు డిపార్టుమెంట్లో చర్చనీయాంశమయింది. కొద్ది రోజుల క్రితం అవినీతి ఆరోపణలతో ఏకంగా నలుగురు సీఐలపై వేటు పడింది. ఇదే కోవలో ఈయనను కూడా తప్పిస్తారా? లేదో తేలాల్సి ఉంది. బంగారు గొలుసు మాయం కొద్దిరోజుల క్రితం సదరు సీఐ స్టేషన్ పరిధిలో ఒక బంగారు గొలుసు చోరీ అయింది. దీనిపై కేసు కూడా నమోదయింది. ఈ బంగారు గొలుసును దొంగలించిన దొంగను పట్టుకున్నారు కూడా. అయితే.. ఇప్పటి వరకు రికవరీ అయినట్టు ఎక్కడా చూపలేదు. ఎక్కడికెళ్లిందోనని ఆరా తీస్తే.. సీఐ గారి ఇంట్లో ప్రత్యక్షమయిందని తెలిసింది. ఈ వ్యవహారం స్టేషన్లో ఉన్న పోలీసులందరికీ తెలిసినా ఎవ్వరూ కిక్కురుమనలేని పరిస్థితి. అంతేకాకుండా ఎప్పుడు ఎవ్వరి మీద విరుచుకుపడతారో తెలియని ఆందోళన పరిస్థితులల్లో కిందిస్థాయి సిబ్బంది కూడా ఇబ్బందిగా కాలం వెళ్లదీస్తున్నారు. తన కింద పనిచేసే ఒక ఎస్ఐతో కలిసి మొన్నటి వరకు ఇసుక దందాను ప్రోత్సహించారు. అయితే, ఇప్పుడు ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుండటంతో.. ఇసుక ట్రాక్టర్లపైన టార్పాలిన్లు కప్పలేదనే సాకుతో వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. -
పుష్కర స్నానం చేసిన వారి సంఖ్య 7.95 లక్షలు
కొవ్వూరు/నరసాపురం అర్బన్/జంగారెడ్డిగూడెం రూరల్ : జిల్లాలోని 97 పుష్కర ఘాట్లలో గురువారం ఒక్కరోజే 7,94,848 మంది స్నానాలు ఆచరిం చారు. కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొవ్వూరు, తాళ్లపూడి, పెనుగొండ, నిడదవోలు, పెరవలి మండలాల్లో 4,85,993మంది పుష్కర స్నానాలు చేశారు. నరసాపురం డివిజన్ పరిధిలోని నరసాపు రం, యలమంచిలి, ఆచంట మండలాల్లో 2,35,991 మంది, కొవ్వూరు డివిజన్లోని పోలవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో 72,864మంది స్నానాలు చేశారు. గడచిన మూడు రోజుల్లో జిల్లావ్యాప్తంగా 21,48,009 మంది సాన్నాలు ఆచరించారు. వీరిలో కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఘాట్లలో 13,47,695 మంది, నరసాపురం డివిజన్ పరిధిలో 6,30,519 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 1,69,795 మంది ఉన్నారు. -
తీరని దాహం
చిత్తూరులోని కట్టమంచి ప్రాంతంలో తాగునీటి కోసం క్యూలో వేచి ఉన్న జనం జిల్లాలో తాగునీటి ఇక్కట్లు రోజురోజుకూ ఎక్కువవుతు న్నాయి. 2012 నాటికి కేవలం 406 గ్రామాలలో నీటిసమస్య ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ చివరినాటికి ఆరింతలు పెరిగింది. పడమటి మండలాల్లో భూగర్భ జలాలు 1500 అడుగుల లోతుకు చేరాయి. ప్రస్తుతం 2724 గ్రామాలకు ప్రభుత్వమే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తోంది. ఇందుకోసం నెలకు ’ 7.3 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తోంది. ప్రయివేటు నీటి వ్యాపారం ’ కోట్లలో సాగుతోంది. సమస్య శాశ్వత పరిష్కారానికి మాత్రం ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదు. - ఏటా తీవ్రమవుతున్న సమస్య - ఏప్రిల్ నాటికి 2724 గ్రామాలకు నీటి సరఫరా - నెలకు * 7.3 కోట్లు ప్రభుత్వ ఖర్చు - ప్రయివేటు నీటి కొనుగోలు *కోట్లలో... సాక్షి,చిత్తూరు: జిల్లాలో ప్రధానంగా చిత్తూరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్ల పరిధిలో నీటి సమస్య అధికంగా ఉండగా, ఈ ఏడాది తిరుపతి డివిజన్ పరిధిలో సైతం తాగునీటి ఎద్దడి తలెత్తింది. మూడేళ్ల గణాంకాలను చూస్తే ఏడాదికేడాది నీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాక పడమటి మండలాల్లో భూగర్భ జలాలు 1500 అడుగుల లోతుకు చేరాయి. ఈ ఏడాది వేలాది గ్రామాల్లో తాగునీరు దొరకని పరిస్థితి. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. 2012 ఏప్రిల్ నెలలో చిత్తూరు డివిజన్లో 177 గ్రామాలకు మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయగా, 2013 ఏప్రిల్‌లో 255 గ్రామాలకు, 2014లో 261 గ్రామాలకు, 2015లో ఏకంగా 1,081 గ్రామాలకు నీటి సరఫరా చేయాల్సి వచ్చింది. మదనపల్లె డివిజన్లో 2012 ఏప్రిల్‌లో వంద గ్రామాలకు, 2013 ఏప్రిల్‌లో 255 గ్రామాలకు, 2014 ఏప్రిల్‌లో 261 గ్రామాలకు,2015 లో 922 గ్రామాలకు సరఫరా చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. తిరుపతి డివిజన్లో 2012 ఏప్రిల్‌లో కేవలం ఐదు గ్రామాలకు మాత్రమే నీటిని సరఫరా చేయగా, 2013 ఏప్రిల్‌లో మూడు గ్రామాలకు, 2014లో ఒక్కగ్రామానికి కూడా నీటిసరఫరా చేయలేదు. 2015లో మాత్రం ఏకంగా వంద గ్రామాలకు ట్యాం కర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. ప్రాజెక్టులు పూర్తయితేనే... జిల్లా నీటి సమస్య తీరాలంటే హంద్రీ-నీవా, కండలేరు నీటి పథకాన్ని పూర్తిచేయడం మినహా మరో మార్గం లేదు. హంద్రీనీవా పూర్తి కావాలంటే రూ.1100 కోట్లు అవసరం. బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.200 కోట్లు. చిత్తూరు జిల్లాకు రూ.50 కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. జిల్లాలో వేలాది గ్రామాలకు తాగునీటిని అందించే కండలేరు తాగునీటి పథకాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాం లో ఆ పథకం రూపుదిద్దుకుందన్న అక్కసుతోనే బాబు ప్రభుత్వం దానిని పక్కన పెట్టింది. చిత్తశుద్ధితో ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేసి తాగునీటి సమస్యను శాశ్వ తంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. -
నెలరోజుల మురిపెం!
హుజూరాబాద్ : హుజూరాబాద్, హుస్నాబాద్ ప్రాంత వాసులను ఊరిస్తూ వస్తున్న ఆర్డీవో ఆఫీస్ కలగానే మిగిలేలా ఉంది. హుజూరాబాద్‌కు రెవెన్యూ డివిజన్ హోదా కల్పించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉండగా, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్యంగా హుస్నాబాద్‌కు రెవెన్యూ హోదా కల్పించింది. హుజూరాబాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తగా టీఆర్ఎస్ అధికారంలో వచ్చిన వెంటనే హుజూరాబాద్‌కు ‘రెవెన్యూ’ హోదా కల్పించారు. కోర్టు జోక్యంతో హుజూరాబాద్ డివిజన్ రద్దు కాగా, ఇప్పుడు గందరగోళంగా తయారైంది. హుస్నాబాద్, హుజూరాబాద్ ప్రాంతాలు గతేడాది వరకు కరీంనగర్ రెవెన్యూ డివిజన్ కిందనే ఉండేవి. హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతాలకు హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ సౌకర్యంగా ఉంటుందని అంతా భావించారు. హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటవుతుందని అంతా భావించగా, గత ఎన్నికలకు ముందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్యంగా హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్ చేసి హుజూరాబాద్‌ను అందులో కలిపింది. ఈ విషయమై హుజూరాబాద్‌లో ఆగ్రహావేశాలు, ఆందోళనలు పెల్లుబికాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్‌కు ఆర్డీవో యోగాన్ని కల్పించారు. అనుకున్నదే తడవుగా స్థానిక తహశీల్దార్ కార్యాలయంలోనే ఆర్డీవో ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు. కరీంనగర్ ఆర్డీవోకు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. తహశీల్దార్‌ను అడ్మినిస్ట్రేటివ్ అధికారి(ఏవో)గా నియమించారు. గతేడాది ఆగస్టు 14న అప్పటి జేసీ సర్ఫరాజ్ అహ్మద్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. శాశ్వత కార్యాలయంగా పట్టణంలోని ఐబీ గెస్ట్‌హౌస్‌ను ఎంపిక చేసి మరమ్మతు సైతం చేయించారు. అయితే హుజూరాబాద్‌కు ఆర్డీవో హోదా రావడంతో హుస్నాబాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. హైకోర్టు తీర్పుతో గప్‌చుప్ హుజూరాబాద్‌కు ఆర్డీవో హోదాను రద్దు చేయాలని, ముందుగా విడుదల చేసిన జీవోను అమలు చేయూలని హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. నెల రోజుల తర్వాత హైకోర్టు హుజూరాబాద్‌కు సంబంధించిన జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక్కడి ఆర్డీవో కార్యాలయాన్ని కరీంనగర్‌కు తరలించారు. ఏవోను ఎల్కతుర్తి తహశీల్దార్‌గా బదిలీ చేశారు. ఇప్పటికైనా నెరవేరేనా? కరీంనగర్ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉండడంతో ఈ ప్రాంత వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జమ్మికుంట, ఎల్కతుర్తి, కమలాపూర్, వీణవంక, భీమదేవరపల్లి, సైదాపూర్ మండలాల నుంచి దాదాపు 50 కిలోమీటర్లకు పైగా దూరంలో కరీంనగర్ ఉంటుంది. దూరం తగ్గడానికే స్థానికంగా డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ హుజూరాబాద్, హుస్నాబాద్ పట్టణాల మధ్య తీవ్రమైన పోటీ ఉండడంతో ప్రభుత్వమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. భౌగోళికంగా, రవాణాపరంగా, అన్ని మండలాల ప్రజల అభిప్రాయాలు పరిగణించి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
ప్రతి రెవెన్యూ డివిజన్ కూ రైతుబజారు
* మన ఊరు, మన కూరగాయల పథకానికి అనుసంధానం * మూసీ నదిలో పండించే కూరగాయలకు నో ఎంట్రీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున రైతు బజార్లు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలను త్వరలో ముఖ్యమంత్రి పరిశీలనకు పంపనున్నారు. ఇందుకు అవసరమైన భూ సేకరణపై ఇప్పటికే కొన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో చర్చలు కూడా జరిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 26 రైతు బజార్లలో హైదరాబాద్‌లోనే 9 ఉన్నాయి. మిగిలినవి జిల్లా కేంద్రాల్లో నడుస్తున్నాయి. రైతు బజార్లు విజయవంతం కావడం... దళారుల ప్రమేయం లేకుండా ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుండటంతో డివిజన్ కేంద్రాలకు విస్తరించాలని నిర్ణయించినట్లు రైతు బజార్ల అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఒక్కో రైతు బజారు నిర్మాణానికి ప్రస్తుత ధరల ప్రకారం రూ. 2 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 26 రైతు బజార్లలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు. శిథిలావస్థకు చేరిన వాటికి మరమ్మతులు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన కూరగాయలు’ పథకాన్ని రైతు బజార్లతో అనుసంధానం చేసేందుకు యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం తక్కువ పురుగు మందులు, తక్కువ ఎరువులు వాడి కూరగాయలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తామని.. తద్వారా నాణ్యమైన కూరగాయలను వినియోగదారులకు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. మూసీ నదిలో పండించే వాటికి అనుమతి లేదు హైదరాబాద్ నగరంలోని కొన్ని కూరగాయల దుకాణాలకు, రైతు బజార్లకు మూసీ నదిలో పండించే కూరగాయలు సరఫరా అవుతున్న విషయంపై పరిశీలన జరపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మూసీ నీటితో పండించే కూరగాయలు, ఆకుకూరలు విష పూరితమైనవని, వాటిని తింటే అనారోగ్యం ఖాయమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతు బజార్లకు వాటిని రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా రైతు బజార్లలో అలాంటి విక్రేతలెవరైనా ఉంటే నిఘా పెట్టి వారి గుర్తింపు రద్దు చేసి పంపుతామని అంటున్నారు. -
చెయ్యేరులో ఇసుకదందా!
రాజంపేట: చెయ్యేరులో ఇసుకదందా అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. అధికార పార్టీ నేతలుగా చెలామణి అవుతున్న కొందరి కనుసన్నల్లో భారీగా ఇసుకను తోడేస్తున్నారు. దాడి చేసే అధికారులకు దొరకకుండా ఉండేందుకు సొంతంగా నిఘా ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు వాహనాల్లో వేగంగా చేరుకోకుండా సొంతంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసుకున్నారంటే ఈ దందా ఏ స్థారుులో జరుగుతోందో అర్థమవుతుంది. రెవిన్యూ డివిజన్ పరిధిలోని రాజంపేట, నందలూరు, పెనగలూరులో ఇసుకమాఫియా పెట్రేగిపోతోంది. ఈ మాఫీయాకు అధికారపార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కొందరు అధికారులు సైతం వారితో మిలాఖత్ అయ్యారన్న విమర్శలున్నాయి. చెయ్యేరు నది రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాలకు అనుకూలంగా ఉండటంతో అడ్డదారులు ఏర్పాటుచేసుకుని ఇసుకను అడ్డూఅదుపూ లేకుండా తోడేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో వందలాది ట్రాక్టర్లలో ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. రాజంపేట సబ్‌డివిజన్ పరిధిలోని రెండు పోలీస్స్టేషన్లకు మాముళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు వినపడుతున్నాయి. మందరం వయా రాజంపేట మీదుగా... చెయ్యేరు నది పరిధిలోని మందరం(రాజంపేట) కేంద్రంగా ఇసుక అక్రమరవాణా సాగిస్తున్నారు. అనధికారిక క్వారీలను ఏర్పాటుచేసుకొని ఏటికి వెళ్లే రహదారిలో గేట్ పెట్టుకున్నారు. దానికి తాళాలు కూడా వేస్తారు. చెయ్యేరులోకి దారులు ఏర్పాటుచేసుకొని వందలాది ట్రాక్టర్లతో ఇసుకను రవాణా చేసుకుంటున్నారు. అక్రమరవాణాకు పటిష్టమైన నిఘా వ్యవస్థను సైతం ఏర్పాటు చేసుకున్నారు. బెస్తపల్లె, మందరం, ఇసుకపల్లె, తాళ్లపాక(ఆర్చి) మర్రిపల్లెతోపాటు యేటి పరిసరాల్లో బృందాలుగాా ఉంటూ రవాణా విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అధికారులో, విజిలెన్స్ వస్తున్నారంటే వెంటనే ట్రాక్టర్లు, ఇసుక నింపే కూలీలు చెయ్యేటిలో నుంచి సురిక్షిత ప్రాంతానికి చేరుకుంటారు. మందరం నుంచి పుల్లంపేట, రైల్వేకోడూరు, చిట్వేలితోపాటు తదితర ప్రాంతాలకు ఇసుక రవాణా జరుగుతోంది. భారీగా ఫైన్ వేస్తున్నా.. పోలీసు, రెవిన్యూ అధికారుల కన్నా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించిన తరుణంలో పట్టుబడిన డంప్, రవాణా చేసే వాహనాలను సీజ్ చేసి భారీగా పైన్ వేస్తున్నా వీరు వెనుకంజ వేయడంలేదు. నందలూరు మండలంలోని కుమరనిపల్లెలో అధికారిక క్వారీ ఉంది. దాని ముసుగులో ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అనధికారిక క్వారీ ఇసుకకే డిమాండ్ సర్కారు మహిళా సంఘాల ద్వారా ఇసుక అమ్మకం చేపట్టినా వాటి కంటే అనధికార క్వారీల ఇసుకకే డిమాండ్ ఉంది. మహిళా సంఘాల ద్వారా ఇసుకతవ్వకంతోపాటు ఇంటికి సరఫరా చేసేందుకు కిలోమీటర్‌కు రూ.30చొప్పున, క్యూబిక్‌మీటరు రూ650 లెక్కన అమ్మకాలు జరుగుతున్నాయి. మీసేవ, బిల్లుల సమస్య లాంటివి లేకుండా అనధికారిక క్వారీ నుంచి రిస్క్ లేకుండా ఇంటికి ఇసుకను చేర్చుతుండడమే కారణం. -
రెప్పవాల్చిన నిఘా నేత్రం
నూజివీడు : పెచ్చుమీరుతున్న నేరాలను అదుపు చేసేందుకు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసు నిఘా నేత్రంఅధికారులు గాలికొదిలేశారు. రెండేళ్ల క్రితం నూజివీడులో రోడ్లపైనే బంగారు గొలుసులు తెంపుకొనిపోవడం, ఇళ్లలో పట్టపగలే చోరీలకు పాల్పడటం, ఆ క్రమంలో ప్రాణాలు తీసేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు విచ్చలవిడిగా జరిగాయి. 2012లో పట్టపగలు మధ్యాహ్న సమయంలో మహిళ మెడలోని బంగారు గొలుసులు లాక్కొని హత్యచేసిన ఘటనలో నిందితులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభ్యంకాని నేపథ్యంలో సీసీ కెమెరాల ఆవశ్యకతను గుర్తించారు. పట్టణంలోని చిన్న గాంధీబొమ్మ సెంటర్, సింగ్ హోటల్ సెంటర్, బస్టాండు సెంటర్ల వద్ద అప్పటి ఎస్ఐ ఐవీ నాగేంద్రకుమార్ దాతల సహకారంతో వీటిని ఏర్పాటుచేశారు. వీటి పర్యవేక్షణ కోసం చిన్నగాంధీబొమ్మ సెంటర్లో ఒక కంప్యూటర్ గదిని కూడా కేటాయించారు. సీసీ కెమెరాల కారణంగా అప్పట్లో చైన్ స్నాచింగ్‌లు, ఈవ్‌టీజింగ్‌లు, ట్రాఫిక్ ఉల్లంఘనలు అదుపులోకి చాలావరకు తగ్గాయి. కొరవడిన పర్యవేక్షణ... సీసీ కెమెరాలను ఏర్పాటుచేసిన కొత్తలో కొద్దిరోజులపాటు బాగానే నిర్వహించినా.. అనంతర కాలంలో వాటి నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో నిఘా నేత్రాలు నిరుపయోగంగా మారాయి. కొన్ని రోజులు మాత్రమే పనిచేసిన ఈ సీసీ కెమెరాలు ఆ తర్వాత పనిచేయడం లేదు. పోలీసు అధికారులు కూడా వాటిని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. సీసీ కెమేరాల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన గది కూడా ఖాళీచేయడం గమనార్హం. తీవ్ర నేరాలు జరిగితే గుర్తించడం ఇబ్బందే... సీసీ కెమెరాలు వినియోగంలో లేని నేపథ్యంలో గతంలో మాదిరిగా తీవ్ర నేరాలు జరిగితే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. సంఘ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలను పసిగట్టడానికి, నేరాలను నిరోధించడానికి ఉపయోగపడే సీసీ కెమెరాలను పునరుద్ధరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
తెలుగు తమ్ముళ్ల ప‘రేషన్’!
రాజంపేట: తొమ్మిదేళ్లు అధికారంలేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం.. ఎలాగోలా అధికారంలోకి వచ్చాం..ఓ రేషన్‌షాపు..మధ్యాహ్న భోజనం ఏజెన్సీ ఇప్పించాలని తమ్ముళ్ల నుంచి నేతలకు వత్తిడిలు అధికమయ్యాయి. అధికార పార్టీ పెద్దల ఆదేశాలతో రెవెన్యూ అధికారులు టీడీపీ శ్రే ణులకు రేషన్‌షాపులు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలు ఇప్పించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో తెలుగు తమ్ముళ్లు తమ ప్రాంతాల్లోని రేషన్‌షాపులు తమకు కేటాయించాలని తమ పెద్దల నుంచి రెవెన్యూశాఖపై వత్తిడి తెస్తున్నారు. అయితే బాధిత డీలర్లకు అనుకూలంగా కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేయడంతో తెలుగు తమ్ముళ్లు పరేషాన్ అవుతున్నారు. డివిజన్ పరిధిలో ... రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో 430 రేషన్‌షాపులు ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీలర్లపై పలు రకాల కేసులు బనాయించి సస్పెండ్ చేస్తున్నారు. ఈ ఐదు నెలల్లో చిన్న చిన్న కారణాలతో రేషన్‌షాపు డీలర్లపై వేటు వేసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు ప్రత్యేకించి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వారి షాపులపై విజిలెన్స్ దాడులు నిరంతరం జరుగుతున్నాయి. సస్పెండ్ చేయడానికి కారణం కోసం అధికారుల బృందం అన్వేషిస్తోంది. నిల్వలో వ్యత్యాసాలు చూపి.. రేషన్‌షాపుల నిల్వలో వ్యత్యాసాలు చూపి 6-ఏ కేసులు నమోదు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. కొన్నిచోట్ల వర్గీకరణ పేరుతో ఒకే షాపును ముక్కలు చేసేందుకు కూడా పావులు కదుపుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీలర్లను ఒక్కొక్కరిగా తొలగించుకుంటూ వస్తున్నారు. గతంలో ఉన్న రేషన్ డీలర్లు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకుంటే అక్రమ కేసులు బనాయిస్తామని రెవెన్యూ అధికారుల మీద అధికారపార్టీ పెద్దలతో వత్తిడి చేయిస్తున్నారు. ఓ రెవెన్యూ ఉన్నత స్థాయి అధికారి ఇటీవల ఓ సందర్భంలో ఏ తప్పులేకుండా సస్పెండ్ చేయాలంటే బాధాకరంగా ఉందని డీలర్లతో అన్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టే అధికార పార్టీ నేతల తీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అధికారపార్టీ ఆగడాలకు బలవుతున్న రేషన్ షాపుల డీలర్లు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. కోర్టు స్టే మంజూరు చేస్తుండటంతో తెలుగు తమ్ముళ్లు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. రెవెన్యూ అధికారులు అటు డీలర్లను తొలగించలే క.. ఇటు అధికార పార్టీ పెద్దలను సంతృప్తి పరచలేక నలిగిపోతున్నారు. ప్రభుత్వ శాఖల్లో టీడీపీ శ్రేణుల హవా మధ్యాహ్న పథకం ఏజెన్సీలను తమకు అనుకూలంగా ఉన్న వారికి ఇప్పించాలని గ్రామాల్లో తెలుగుb తమ్ముళ్లు హెచ్ఎం, కమిటీలపై వత్తిడి తెస్తున్నారు. రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని చింతకాయలపల్లెలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసుకుంటున్న వారిని తొలగించి టీడీపీ అనుకూలురను నియమించుకున్నారు. మున్సిపాలిటితోపాటు పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ తదితర శాఖల్లో కూడా టీడీపీ శ్రేణుల హవా కొనసాగుతోంది. -
కోల్డ్ వార్
* అమాత్యుల మధ్య అగాధం! * ఆర్డీఓల బదిలీలపై ఆధిపత్య పోరు * చినరాజప్ప, యనమల వైఖరిపై విస్తుపోతున్న టీడీపీ వర్గాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : బదిలీల జాతర అమాత్యుల మధ్య కోల్డ్ వార్‌కు తెరలేపింది. అధికారులందరినీ సాగనంపి, నచ్చిన వారిని తెచ్చుకోవాలనుకోవడంతో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. ప్రధానంగా రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారుల బదిలీల కోసం ఇస్తున్న సిఫారసు లేఖలు వీరి మధ్య దూరాన్ని మరింత పెంచుతున్నాయి. పనితీరు ప్రామాణికంగా బదిలీలని పైకి చెబుతున్నా.. నచ్చని వారిని సాగనంపే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బది లీల్లో పట్టు కోసం ఎవరిమట్టుకు వారు ఎత్తులకు పైఎత్తు లు వేస్తున్నారు. ఆ పరిణామాలతో అధికారుల పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్క’లా తయారైంది. ప్రధానంగా కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓ పోస్టింగ్‌లు ఆధిపత్య పోరులో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు చేస్తున్న సిఫారసులు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నచ్చినోళ్లను తెచ్చుకోవాలనుకోవడమే ఈ అగాధానికి కారణంగా నేతలు విశ్లేషిస్తున్నారు. కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓలుగా ప్రస్తుతం అంబేద్కర్, కూర్మనాథ్ పనిచేస్తున్నారు. వీరి స్థానే కొత్తవారిని తెచ్చుకోవాలని ప్రయత్నాలు ఊపందుకున్నాయి. పెద్దాపురం ఆర్డీఓ పోస్టింగ్ కోసం నువ్వా, నేనా అనే స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూర్మనాథ్‌ను సాగనంపి, అతని స్థానంలో విశాఖపట్నం హెచ్పీసీఎల్లో పనిచేస్తున్న మల్లిబాబును తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి రాజప్ప గట్టి ప్రయత్నం చేశారు. కాకినాడ కలెక్టరేట్‌తో పాటు పెదపూడి సహా పలు మండలాల్లో పనిచేసిన మల్లిబాబుకు వివాదరహితుడనే పేరుంది. ఈ కారణంగానే పెద్దాపురం నియోజకవర్గ నేతల సూచన మేరకు రాజప్ప.. మల్లిబాబుకు సిఫారసు చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో మల్లిబాబుకు పెద్దాపురం ఆర్డీఓగా పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. ఈ మేరకు జీఓ కూడా విడుదలైంది. జాయిన్ అవ్వడంలో ఒక్క రోజు ఆలస్యం కావడాన్ని ఆసరాగా చేసుకుని ప్రత్యర్థి వర్గం పావులు కదిపి మల్లిబాబు పోస్టింగ్ ఆర్డర్‌ను నిలుపుదల చేయించారని రాజప్ప వర్గం కారాలుమిరియాలు నూరుతోంది. మల్లిబాబును కాకుండా విశాఖపట్నంలో పనిచేస్తున్న విశ్వేశ్వరరావును పెద్దాపురానికి తీసుకురావాలని యనమల వర్గం పట్టుదలతో పావులు కదుపుతోంది. ఈ విషయంలో పెద్దఎత్తున సొమ్ములు కూడా చేతులుమారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన సోదరుడి పేరుతో బదిలీల దందా నిర్వహిస్తోన్న తెలుగు తమ్ముడు ఇతర నియోజకవర్గాల వ్యవహారాల్లో వేలు పెట్టేస్తున్నారని అక్కడి నేతలు మండిపడుతున్నారు. ఇప్పుడు ఈ బేరసారాల్లో కూడా సంబంధిత నాయకుడు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తీరుపై రాజప్ప వర్గీయులు రుసరుసలాడుతున్నారు. ఆ ముఖ్యనేతకు తెలిసే ఈ వ్యవహారమంతా నడుస్తుందా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. అనవసరంగా పెద్దాపురం ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో మితిమీరిన జోక్యాన్ని రాజప్ప వర్గం ప్రశ్నిస్తోంది. పెద్దాపురం డీఎస్పీ ఓలేటి అరవిందబాబును కొనసాగించాలని యనమల వర్గం ప్రయత్నాలు చేయడాన్ని రాజప్ప తప్పుపట్టారని అతని అనుచర వర్గం చెబుతోంది. గతంలో జిల్లాలో పలు చోట్ల పనిచేసిన ప్రసన్నకుమార్‌ను తెచ్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అయిన రాజప్ప ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ విషయం తెలిసి కూడా డీఎస్పీ బదిలీలో పావులు కదపడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని రాజప్ప సన్నిహితుల వద్ద చర్చించారని చెబుతున్నారు. హోం మంత్రి హోదాలో, తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పెద్దాపురంలో డీఎస్పీ, ఆర్డీఓల బదిలీల్లో సైతం తన ఆధిపత్యాన్ని లేకుండా చేస్తారా అని రాజప్ప ఒకింత ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. దీనిపై తాడోపేడో తేల్చాల్సిందేనని రాజప్ప వర్గం పట్టుబడుతోందని సమాచారం. కాకినాడ ఆర్డీఓ పరిస్థితి ఇంతే.. దాదాపు ఇదే పరిస్థితి కాకినాడ ఆర్డీఓ పోస్టింగ్‌లో కూడా ప్రస్ఫుటమవుతోంది. కాకినాడ ఆర్డీఓగా ప్రస్తుతం అంబేద్కర్ పనిచేస్తున్నారు. పనిచేస్తున్న అధికారులందరినీ బదిలీ చేయాలనే సర్కార్ విధానపరమైన నిర్ణయంతో ఆయనను బదిలీ చేయాలని నిర్ణయం జరిగింది. ఈ పోస్టు కోసం ఇద్దరు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాకినాడ కలెక్టరేట్ ఏఓ, కాకినాడ అర్బన్, రూరల్ తహశీల్దార్‌గా పనిచేసి పదోన్నతిపై డిప్యుటీ కలెక్టర్‌గా ప్రస్తుతం నెల్లూరులో పనిచేస్తున్న మల్లికార్జునను ఆర్డీఓగా తీసుకురావాలని కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం ఎమ్మెల్యేలు కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, ఎస్వీఎస్ఎన్ వర్మ లేఖ ఇచ్చారు. వీరంతా కలిసి ఏకాభిప్రాయంతో ఒకే లేఖ ఇవ్వడంతో మంత్రి రాజప్ప గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పోస్టింగ్ ఇవ్వడమే మిగిలి ఉందనుకుంటున్న తరుణంలో మెట్ట ప్రాంతానికి చెందిన ముఖ్యనేత సోదరుడి జోక్యంతో వివాదం ముదురు పాకానపడింది. ఆ ముఖ్యనేత సోదరుడు, కాకినాడ సిటీలో ఓ టీడీపీ నేత మధ్య కుదిరిన లోపాయికారి ఒప్పందంతో ఆర్డీఓ పోస్టింగ్‌లో సీన్ మారిపోయింది. ఈ విషయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, ఆమె భర్త పార్టీ కార్యదర్శి పిల్లి సత్తిబాబు వారితో వ్యతిరేకిస్తున్నారని తెలియవచ్చింది. ముందుగా అంతా అనుకుని లేఖ ఇచ్చి ఇప్పుడు ఏ కారణంతోనైనా సరే ఇలా మాట మార్చి ప్రస్తుత ఆర్డీఓ అంబేద్కర్ కొనసాగింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఈ పోస్టింగ్‌ను గతంలో అంబేద్కర్ కంటే ముందుగానే ఆశించి భంగపడ్డ పౌర సరఫరాల కార్పొరేషన్ డీఎం గంగాధర్‌కుమార్ మరోసారి తెరపైకి రావడంతో బదిలీల వ్యవహారం రసకందాయంలో పడింది. -
ఆర్డీఓ పోస్టింగ్ ప్లీజ్!
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో రెవె న్యూ డివిజన్ అధికారులుగా నియామకం పొందేందుకు పలువురు అధికారులు తెలుగుదేశం నేతల ఇళ్లవద్ద క్యూ కడుతున్నారు. తమ మాటను తు.చ తప్పక పాటిస్తూ జీ హుజూర్ అనే అధికారి కావాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు వారు ఒకరిద్దరు అధికారులకు పోస్టింగ్ ఇప్పిస్తామని కబురు పంపారు. ఈ విషయం తెలుసుకున్న మరికొందరు అధికారులు తాము వారికంటే బెటర్‌గా పనిచేస్తాం. మాకు అవకాశం కల్పించండి.. ఉత్తి పుణ్యానికే పోస్టింగ్ వద్దు.. నజరానా ముట్టజెపుతాం అంటూ ముందుకొచ్చినట్లు తెలిసింది. దీంతో అధికారపార్టీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో డివిజన్ పంచుకున్నట్లు సమాచారం. ఎట్టకేలకు రెవె న్యూ మంత్రి వద్ద తుది జాబితాకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్లలో పనిచేస్తున్న అధికారులు దీర్ఘకాలికంగా విధుల్లో ఉన్నారు. కడపలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు స్థానాల్లో పోస్టింగ్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ నెలకొన్నట్లు సమాచారం. జమ్మలమడుగుకు వినాయకం ఖరారు జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారిగా వినాయకం పేరు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో పలుచోట్ల తహశీల్దారుగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉపయోగపడినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఓ నాయకుడి సోదరుడి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో ఆయనను జమ్మలమడుగు ఆర్డీఓగా నియమించినట్లు తెలుస్తోంది. అలాగే అక్కడ విధుల్లో ఉన్న రఘునాథరెడ్డి కోరుకున్న మేరకు శ్రీశైలం ఆర్డీఓగా పోస్టింగ్ ఖరారైనట్లు సమాచారం. కడపలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న లవన్న స్థానంలో వరప్రసాద్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఆయన జిల్లా వాసి కావడంతో ఉన్నత స్థాయి అనుమతి కోసం వేచి ఉన్నట్లు తెలిసింది. రాజంపేట ఆర్డీఓ విజయసునీత స్థానంలో శ్రీకాకుళంలో పనిచేస్తున్న శ్యాంప్రసాద్ పేరు ఖరారైనట్లు తెలిసింది. ఆ మేరకు అధికారికంగా వెలువడనున్న బదిలీ ఉత్తర్వుల జాబితాలో జిల్లాకు చెందిన ఈ ముగ్గురికి స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. గత అనుభవం... పరిచయంతోపాటు..... ‘తమ్ముడు..తమ్ముడే-పేకాట..పేకాటే’ అన్నట్లుగా ఎంత పరిచయం ఉన్నా అనుకున్న రీతిలో మచ్చిక చేసుకోకపోతే పోస్టింగ్ దక్కదని తెలుగుతమ్ముళ్లు నిరూపిస్తున్నారు. ఎక్కడన్నా మామ అనండి, వంగతోట కాదు అన్నట్లు డివిజన్ ప్రాధాన్యత బట్టి రేటు ఫిక్స్ చేసినట్లు పరిశీలకులు వివరిస్తున్నారు. స్వయంవరంలా తమ ఇళ్లవద్ద క్యూ కట్టిన వారిలో అన్ని విభాగాల్లో సమఉజ్జీలుగా నిలుస్తారని భావించిన వారినే టీడీపీ నేతలు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తల నిర్ణయానికి ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో ఆ మేరకు సొమ్ము చేసుకునే పనిలో అనుచరవర్గాలు నిమగ్నం కావడంతోనే ఈ తరహా వ్యవహారం నడిచినట్లు పలువురు భావిస్తున్నారు. -
అసామాన్యుడు
హుస్నాబాద్ : హుస్నాబాద్‌కు మంజూరైన రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్‌కు తరలించుకుపోవడాన్ని నిరసిస్తూ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో అందరూ ఆందోళనబాట పడితే.. మండలంలోని నందారం గ్రామపంచాయితీకి చెందిన అజ్మీర హరియా నాయక్ మాత్రం ఈ అన్యాయాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని న్యాయపోరాటానికి దిగాడు. ఆగస్టు 27న హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని మదన్మోహన్ అనే న్యాయవాది ద్వారా దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ జీవో 18ని రద్దు చేస్తూ.. హుస్నాబాద్ పేరిట జారీ అయిన 235ను కొనసాగించాలని హైకోర్టు న్యాయమూర్తి విలాస్ అఫ్జల్ పుర్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అజ్మీరా హరియా నాయక్ పేరు హుస్నాబాద్, హుజారాబాద్ నియోజకవర్గాలతో పాటు జిల్లాలో మారుమోగుతోంది. వివిధ పార్టీల నాయకులు, ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
అటో.. ఇటో..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఎన్నికలకు ముందు... ఈ ఏడాది ఫిబ్రవరిలో హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 235 జీవో జారీచేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దుచేసింది. హుస్నాబాద్‌కు బదులు... హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తూ గత నెల 11న జీవో నం.18 జారీచేసింది. మూడు రోజులకే హుజూరాబాద్‌లో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. మంత్రి ఈటెల రాజేందర్ తన సొంత నియోజకవర్గానికి పెద్దపీట వేసేం దుకు.. హుస్నాబాద్‌కు అన్యాయం చేశారం టూ విపక్షాలతోపాటు స్వపక్షం నుంచి నిరసనలు పెల్లుబికాయి. జేఏసీ ఆధ్వర్యంలో వరుసగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వం అనుచిత నిర్ణయం తీసుకుందని.. ఈ జీవోను సవాల్ చేస్తూ హుస్నాబాద్ మండలం నందారం గ్రామ పంచాయతీకి చెందిన ఆజ్మీర హర్యానాయక్ ఆగస్టు 27న హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయన తరఫున హైకోర్టు న్యాయవాది ఈ.మదన్మోహన్ రెండుసార్లు వాదనలు వినిపించారు. వాదనల అనంతరం చట్టవిరుద్ధంగా జారీచేసిన 18 జీవోను రద్దుచేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన 235 జీవోను యధావిధిగా అమలుచేయాలని జడ్జి విలాస్ అఫ్జల్ పుర్కర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త రెవెన్యూ డివిజన్ వివాదం హుజూరాబాద్, హుస్నాబాద్‌ల మధ్య హాట్‌టాపిక్‌గా మారింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉం దని రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులతో హుస్నాబాద్‌లో అఖిలపక్షాలు సంబరాలు జరుపుకున్నాయి. -
విస్తరణకు వేళాయె
రూ.260కోట్లతో గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి 482ఎకరాల సేకరణ లక్ష్యం 206కుటుంబాల తరలింపు నూజివీడు : నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గన్నవరం విమానాశ్రయాన్ని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విస్తరించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో విజయవాడకు వీఐపీలు, వీవీఐపీల రాకపోకలు పెరిగినందున విమాన సర్వీసులు పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం 5వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ విమానాశ్రయంలో చిన్న విమానాలు మాత్రమే దిగేం దుకు వీలుంది. రాబోయే రోజుల్లో దీనిని అంతర్జాతీయ స్థాయికి పెంచాల్సిన అవసరం రానుంది.అలాగే బోయింగ్ 747 లాంటి విమానాలు దిగేందుకు వీలుగా విమానాశ్రయాన్ని విస్తరించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా సేకరించాల్సిన భూ వివరాలను రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి పంపారు. భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం గతంలోనే రూ.260కోట్లు కేటాయించింది. విమానాశ్రయంలో ఉన్న ప్రస్తుత రన్‌వే పొడవు 6500 అడుగులుండగా దానిని 10500 అడుగుల పొడవుకు పెంచేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనికి గానూ ఇప్పుడున్న దానికి అదనంగా మరో 482ఎకరాలు సేకరించాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే అందుబాటులో 51ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నందున మిగిలిన 431ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంది. గన్నవరం మండలం కేసరపల్లిలో 121.97ఎకరాలు, బుద్ధవరంలో 196.56ఎకరాలు, అర్జంపూడిలో 112.49 ఎకరాలు సేకరించనున్నారు. దీనికి సంబంధించి రెవెన్యూ సిబ్బంది సమగ్ర సర్వే పూర్తిచేశారు. ఈ భూసేకరణ కారణంగా 206 కుటుంబాలను విమానాశ్రయం విస్తరణ చేయనున్న ప్రాంతం నుంచి తరలించాల్సి వస్తోంది. దీనికి గానూ వారికి నష్టపరిహారం చెల్లించడమే కాకుండా పునరావాసాన్ని కల్పించడానికి నిధులు కేటాయించారు. వీరందరికీ రీ సెటిల్మెంట్ అండ్ రీహేబిటేషన్ కింద పునరావాసం కల్పిస్తారు. భూసేకరణ, పునరావాసానికి కలిపి ప్రభుత్వం రూ.260కోట్లు కేటాయించినట్లు సబ్‌కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు పేర్కొన్నారు. బాధితులకు పూర్తిగా న్యాయం చేసిన తరువాతే భూసేకరణ ప్రక్రియ చేపడతామని ఆయన తెలిపారు. -
రెవె‘న్యూ’ చిచ్చు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రెవిన్యూ డివిజన్ల మార్పు జిల్లాలో చిచ్చు రేపింది. హుస్నాబాద్‌కు బదులుగా హుజూరాబాద్‌ను రెవిన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన వివరాలతో రెవెన్యూ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా పేరిట సోమవారం జీవో నెం.18 విడుదలైంది. హుజూరాబాద్, కమలాపూర్, జమ్మికుంట, వీణవంక, శంకరపట్నం, ఎల్కతుర్తి, సైదాపూర్, భీమదేవరపల్లి మండలాలతో హుజూరాబాద్ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది. ఆరు నెలల ముందు.. ఫిబ్రవరి 19న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ జీవో నెం.235 జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పటివరకు కరీంనగర్ డివిజన్ పరిధిలో ఉన్న హుస్నాబాద్, ఎల్కతుర్తి, సైదాపూర్, భీవుదేవరపల్లి, చిగురువూమిడి, కోహెడ, కవులాపూర్, జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక వుండలాలతో హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కేంద్రం ఆవిర్భవించింది. అనంతరం రాష్ట్ర విభజన పరిణామాలు... వరుస ఎన్నికలతో గెజిట్ జారీ చేసే ప్రక్రియ ఆగిపోయింది. ఆర్డీవో ఆఫీసు ఏర్పాటు.. ఆర్డీవో నియామకం.. తదితర కార్యాచరణ ప్రక్రియలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రవీణ్‌రెడ్డి అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో తనకున్న దోస్తానాతో సొంత నియోజకవర్గంలో డివిజన్ కేంద్రం ఉండేలా ఉత్తర్వులు తీసుకొచ్చినట్లు రాజకీయంగా చర్చ జరిగింది. భౌగోళికంగా.. రవాణా సదుపాయాలు పరిగణనలోకి తీసుకుంటే ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు హుజూరాబాద్‌ను డివిజన్ కేంద్రంగా మార్చాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. స్థానికంగా ఆందోళనలు తలపెట్టింది. దొంగదారిన జీవోను తెచ్చుకున్నారని.. తాము అధికారంలోకి వచ్చాక ఆ జీవోను రద్దు చేస్తామని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అప్పుడే కాంగ్రెస్ నేతలకు సవాలు విసిరారు. డివిజన్‌ను సాధించకుంటే తాను ప్రజలకు ముఖమే చూపించబోనంటూ చెప్పారు. అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాత జీవోను రద్దు చేసింది. హుస్నాబాద్ ప్రాంత వాసులు కలలు కన్న రెవెన్యూ డివిజన్ కేంద్రం అమలుకు నోచుకోకుండానే చెదిరిపోయినట్లయింది. దీంతో స్థానికంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఇది సరైంది కాదు : మాజీ ఎంపీ పొన్నం హుజురాబాద్... హుస్నాబాద్ రెండింటినీ రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌ను డివిజన్ కేంద్రంగా మార్చాలని ఎప్పటినుంచో తాము డిమాండ్ చేస్తూనే ఉన్నామని.. అందుకు హుస్నాబాద్ డివిజన్‌ను పణంగా పెట్టడం సరైంది కాదని అన్నారు. అధికారంలోకి ఎవరొస్తే వారి ఇష్టమైతే.. అధికారులు పంపిన ప్రతిపాదనలకు విలువ లేదా...? అని ప్రశ్నించారు. -
గిరి‘జన గోడు’
సాక్షి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లోని గిరిజన మండలాలతోపాటు రాష్ట్ర విభజన తర్వాత రెండు జిల్లాల్లో కలిసిన పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలతో ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, గిరిజన జిల్లా ఏర్పాటు అంశం క్రమంగా జఠిలమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం లేదా మన జిల్లాలోని పోలవరాన్ని కొత్త జిల్లాకు కేంద్రంగా చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ విషయంపై రచ్చ సాగుతోంది. మరోవైపు గిరిజన జిల్లాలో కలవడం తమకు ఇష్టం లేదని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లోని గిరిజనేతరులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు ఇలా.. జిల్లాలో ఇప్పటికే 39లక్షల పైగా జనాభా ఉన్నారు. మొన్నటివరకూ ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న వేలేరుపాడు, బూర్గంపాడు మండల పరిధిలోని కొన్ని గ్రామాలు కలిసిన కుక్కునూరు మండలాలు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లో విలీనం అయ్యూరుు. తద్వారా ఆ మండలాలకు చెందిన దాదాపు 70వేల జనాభా మన జిల్లాలో చేరింది. దీంతో జిల్లా జనాభా 40 లక్షలు దాటిపోనుంది. జనాభాతోపాటు భూ విస్తీర్ణం, అటవీ విస్తీర్ణం కూడా పెరుగుతున్నారుు. ఈ నేపథ్యంలో గిరిజన మండలాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, టి.నరసాపురం, కొత్తగా కలిసిన కుకునూరు, వేలేరుపాడు మండలాలతోపాటు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, దేవీపట్నం, ఆ జిల్లాలో కలిసిన కూనవరం, చింతూరు, భద్రాచలం రూరల్ మండలాలతో కలిపి గిరిజన జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గిరిజనేతరుల ఆందోళన ప్రత్యేక జిల్లా ఏర్పాటుపై జంగారెడ్డిగూడెం మండలం ఎ.పోలవరం, తాడువాయి, వేగవరం, చక్రదేవరపల్లి గ్రామాల్లో సోమవారం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. జంగారెడ్డిగూడెంలో నాలుగురోజుల క్రితం జిల్లా కలెక్టర్ స్వయంగా ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించారు. గిరిజనులు ప్రత్యేక జిల్లాకు ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నప్పటికీ గిరిజనేతరులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కొయ్యలగూడెం మండలాన్ని కొత్త జిల్లాలో విలీనం చేయూలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా కన్నాపురం పంచాయతీ సోమవారం తీర్మానం చేసింది. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలో తరచూ నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. గోపాలపురం మండలంలోని గిరిజనేతరులు సైతం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. గిరి జన ప్రత్యేక చట్టాల వల్ల తాము నష్టపోతామని ఆ మండలాల్లోని గిరిజనేతరులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంపై రచ్చ గిరిజన జిల్లా ఏర్పాటు అనివార్యమైతే ఆ జిల్లా కేంద్రం ఎక్కడ ఉండాలనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా గిరిజనులు గట్టిగానే పట్టుపడుతున్నారు. జిల్లాలోని పోలవరం లేదా కేఆర్ పురంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇక్కడి గిరిజనుల నుంచి వినిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరాన్ని జిల్లా కేంద్రం చేయాలని అక్కడి గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని పోల వరం నుంచి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వెళ్లేందుకు ప్రస్తుతం నేరుగా మార్గం లేదు. పోలవరం నుంచి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీదుగా గోదావరిని దాటి రాజమండ్రికి.. అక్కడి నుంచి రంపచోడవరం వెళ్లాలి. అంటే దాదాపు 120 కిలోమీటర్లు చుట్టుతిరిగి వెళ్లాల్సి వస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి పోలవరం నుంచి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వరకూ రోడ్డు నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే ఈ రెండు ప్రాం తాల మధ్య దూరం 50 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. ఇటు ఖమ్మం జిల్లా నుంచి కలిసిన మండలాలకు సైతం దూరం తగ్గుతుంది. ఈ సౌలభ్యం ఉందనే కారణంగా పోలవరాన్ని జిల్లా కేంద్రం చేయాలని జిల్లాలోని గిరిజనులు కోరుతున్నారు. ఐటీడీఏను విస్తరిస్తారా గిరిజన జిల్లా ఏర్పాటు ఆలస్యమయ్యేలా ఉంటే గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ)ను విస్తరించాల్సి వస్తుంది. ఖమ్మం జిల్లా పాల్వంచ రెవెన్యూ డివిజన్లోని కుకునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా (73 గ్రామాలు), బూర్గంపాడు మండలాన్ని పాక్షికంగా (6 గ్రామా లు) జిల్లాలోని జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లో కలపాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ఈ మండలాలు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉండేవి. వీటిని జిల్లాలోని కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావాల్సి ఉంది. ప్రస్తుతం కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలు ఉన్నాయి. కలెక్టర్‌ను కలిసిన బాలరాజు కొత్తగా ఏర్పాటయ్యే గిరిజన జిల్లా కేంద్రంగా పోలవరాన్ని ఎంపిక చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ కన్వీనర్, పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను సోమవారం కోరారు. ఇరు జిల్లాలకు అందుబాటులో ఉండటంతోపాటు ఇందిరా సాగర్ జాతీయ ప్రాజెక్టు నిర్మితమవుతున్న దృష్ట్యా పోలవరానికి ప్రాధాన్యత ఏర్పడిందని కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని బాలరాజుకు కలెక్టర్ హామీ ఇచ్చారు. -
మూడు రోజుల్లో ‘స్థానిక’ తీర్పు
13న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహణ అర్ధరాత్రి దాటాకే ఫలితాలు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : స్థానిక ఎన్నికల ఫలితాల ముహూర్తం సమీపిస్తోంది. జిల్లా, మండల పరిషత్ పీఠాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో మరో మూడు రోజుల్లో తేలిపోనుంది. ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 13న జరగనుంది. రెవెన్యూ డివిజన్ల వారీగా కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలకు రెండు దశల్లో గత నెల 6, 11 తేదీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 14 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఏకగ్రీవమయ్యాయి. జెడ్పీటీసీ స్థానాలకు 188 మంది, ఎంపీటీసీ స్థానాలకు 1974 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో మొత్తం 16,50,329 మందికి 13,05,268 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడకుండా ఈ నెల 13 లెక్కింపు చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రౌండ్లో బ్యాలెట్బాక్సుల్లోని బ్యాలెట్ పత్రాలను బయటకు తీసి వేరు చేసి 25 చొప్పున కట్టలు కడతారు. తర్వాత రౌండ్లో ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చిందీ లెక్కిస్తారు. ఇలా చేయడం వల్ల ఏ ప్రాంతంలో ఎవరికి ఎక్కువ, తక్కువ ఓట్లు వచ్చాయో తెలుసుకొనే అవకాశముండదు. కౌంటింగ్కేంద్రంలోకి అభ్యర్థితోపాటు, వారి తరపున జనరల్ ఏజెంటు, కౌంటింగ్ ఏజెంట్‌ను మాత్రమే అనుమతిస్తారు. సెల్ఫోన్లు, కెమెరాలు కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకురావడానికి వీలులేదు. అర్ధరాత్రి దాటాకే ఫలితాలు నాలుగు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును చేపడుతున్నారు. ఆయా కేంద్రాల్లో గది విస్తీర్ణాన్ని బట్టి 8 నుంచి 12 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 3 లేదా 4గురు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. ప్రాథమిక కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. బ్యాలెట్ పత్రాలను కలిపి కట్టలు కట్టడం పూర్తయ్యే సరికి మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కొరూమ్లో 5 టేబుళ్లలో జెడ్పీటీసీ, 5 టేబుళ్లలో ఎంపీటీసీ ఓట్లు లెక్కిస్తారు. యలమంచిలి, నర్సీపట్నం వంటి చిన్న సెగ్మెంట్ల ఫలితం సాయంత్రం 6, 7 గంటలకు వస్తుంది. అనకాపల్లి, పాయకరావుపేట, చోడవరం, ఎస్.రాయవరం, నక్కపల్లి వంటి పెద్ద స్థానాల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి అర్ధరాత్రి దాటుతుందని అధికారులు చెబుతున్నారు. ఫలితాలను ఆయా కేంద్రాల్లో ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన ప్రత్యేక మీడియా ప్రతినిధి ద్వారా వెల్లడిస్తారు. కౌంటింగ్ కేంద్రాలు మొదటి విడతలో గత నెల 6న జరిగిన విశాఖ డివిజన్లోని ఆనందపురం, పెందుర్తి, భీమిలి, పరవాడ, సబ్బవరం, పద్మనాభం మండలాలకు విశాఖ పోతినమల్లయ్యపాలెంలోని సిమ్స్ లా కాలేజి క్యాంపస్‌లో లెక్కింపు చేపట్టనున్నారు. అనకాపల్లి డివిజన్లోని అనకాపల్లి, అచ్యుతాపురం, బుచ్చెయ్యపేట, మునగపాక, కశింకోట, చోడవరం, చీడికాడ, యలమంచిలి, రాంబిల్లి, కె.కోటపాడు మండలాలకు అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాలలో లెక్కిస్తారు. నర్సీపట్నం డివిజన్‌కు సంబంధించి నర్సీపట్నం, మాకవరపాలెం, కోటవురట్ల, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాలకు నర్సీపట్నం పెదబొడ్డేపల్లిలోని డాన్‌బాస్కో కాలేజిలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెండో విడతగా గత నెల 11న జరిగిన అనకాపల్లి డివిజన్‌కు సంబంధించి దేవరాపల్లి, వి.మాడుగుల మండలాలకు అనకాపల్లి ఏఎంఏఎల్ కాలేజిలో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. నర్సీపట్నం డివిజన్‌కు సంబంధించి రావికమతం, రోలుగుంట, నాతవరం, గొలుగొండ మండలాలతో పాటు పాడేరు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి కొయ్యూరు, చింతపల్లి మండలాలకు నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో నిర్వహిస్తారు. పాడేరు రెవెన్యూ డివిజన్లో మిగిలిన మండలాలు జి.కె.వీధి, డుంబ్రిగుడ, అనంతగిరి, జి.మాడుగుల, హుకుంపేట, అరకువ్యాలీ, ముంచింగ్‌పుట్టు, పాడేరు, పెదబయలు ఓట్ల లెక్కింపు పాడేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో జరుగుతుంది. -
ఓటెత్తారు
సాక్షి, కరీంనగర్ : చెదురుమదురు సంఘటనలు మినహా.. జిల్లాలో రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్, సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లలో శుక్రవారం జరిగిన పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తారు. మొత్తం 10,16,928 మందికి గాను 8,26,578 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండు డివిజన్లలో కలిపి 81.19 శాతం పోలింగ్ నమోదైంది. కరీంనగర్ డివిజన్లో 82.33 శాతం, సిరిసిల్ల డివిజన్లో 78.58 శాతం ఓటింగ్ నమోదైంది. మండలాల్లో అత్యధికంగా హుజూరాబాద్‌లో 86.90 శాతం, తక్కువగా గంభీరావుపేటలో 71.97 శాతం పోలింగ్ జరిగింది. తొలి విడత ఎన్నికల్లో మాదిరిగానే రెండో విడతలోనూ మహిళా చైతన్యం వెల్లివిరిసింది. ఉద యం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులు, వికలాంగులు మండుటెండను సైతం లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్, పెద్దూరులో పోలింగ్ ముగింపు సమయంలో ఒకేసారి మూడొందల మంది ఓటేసేందుకు రావడంతో అందరికీ అవకాశం కల్పించారు. దీంతో రాత్రి 6.30 గంటల దాకా పోలింగ్ జరిగింది. కరీంనగర్ మండలం బాహుపేటలో సాయంత్రం 5.30 వరకు ఓటేశారు. పోలింగ్ అనంతరం జిల్లా యంత్రాం గం బ్యాలెట్ బాక్సులను డివిజన్ కేంద్రాలకు తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు, ఫలితాలు వచ్చే నెలలో ప్రకటించనున్నారు. అప్పటిదాకా ఉత్కంఠ తప్పదు. ఓట్ల గల్లంతు! కరీంనగర్ డివిజన్లో 18 జె డ్పీటీసీ, 282 ఎంపీటీసీ స్థానా లు, సిరిసిల్లలో 09 జెడ్పీటీసీ, 126 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. చాలా మండలాల్లో ఓటరు జాబితా నుంచి తమ పేర్లు గల్లంతవడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్కాలనీలో బుడిగజంగాల కులస్తులవి 400 మందికి పైగా ఓట్లు గల్లంతు కావడంతో రాజీవ్ రహదారిపై బైఠాయించారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అక్కడికి వచ్చిన తహశీల్దార్ రజనిని బాధితులు నిలదీశారు. స్థానికంగా ఉండకపోవడంతో తొలగించామని, మళ్లీ చేర్చామని ఆమె సుముదాయించారు. కొత్త జాబితా రెండు రోజు ల్లో ప్రకటిస్తామని, 30న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పడంతో శాంతించారు. ఒక్క ముస్తాబాద్ మండలంలోనే 2వేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి. తెర్లుమద్దిలో 250, పోత్గల్‌లో 200, ముస్తాబాద్‌లో 300, చిప్పలపల్లిలో 50, బందనకల్‌లో 360 ఓట్లు గల్లంతయ్యాయి. చీకోడులో 270 మంది ఓట్ల జాడే లేదు. ఎల్లారెడ్డిపేటలో 87, వీణవంక మండలంలో 60 ఓట్లు, కరీంనగర్ మండలంలో సుమారు 200కు పైగా ఓట్లు గల్లంతు కావడం తో బాధితులు ఆందోళనకు దిగారు. పోల్ చీటీలు సరిగా అందక మొదటి విడత ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురైనా... రెండో విడతకు కూడా పరిస్థితి మారలేదు. బెజ్జంకి మండలం గన్నేరువరం పోలింగ్ కేంద్రంలో ఓటర్ల రద్దీ ఎక్కువవడంతో.. వారిని ‘క్యూ’లో నిలబట్టేందుకు పోలీసులు ఓటర్లను వెనకకు తోయగా క్యూలో నిల్చున ఎల్లవ్వ అనే వృద్ధురాలు కిందపడడంతో కాలు విరిగింది. ఓటేసిన ప్రముఖులు మానకొండూర్‌లో ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలాపూర్‌లో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, హుజూరాబాద్ మండలం జూపాకాలో అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డి, సింగాపూర్‌లో మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఓటు వేశారు. కోనరావుపేట మండలం నాగారంలో కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు, చందుర్తి మండలం రుద్రంగిలో నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
నిఘా నీడలో..
కర్నూలు, న్యూస్‌లైన్: ప్రాదేశిక సమరంలో మలి విడతకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలో 17 జెడ్పీటీసీలకు, 289 ఎంపీటీసీ స్థానాలకు 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతంలో వివాదాస్పద నాయకులు ఉండటంతో ఎస్పీ రఘురామిరెడ్డి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. అల్లరి మూకల ఆగడాలను నియంత్రించేందుకు పల్లెల వారీగా పక్కా జాబితాలను సేకరించారు. కొంతమందికి కౌన్సెలింగ్ ఇప్పించారు. నేర చరిత్ర ఉన్న వారి జాబితాను స్టేషన్ల వారీగా సిద్ధం చేసి, వారి కదలికలపై నిఘా ఉంచారు. సబ్‌డివిజన్ పరిధిలో అత్యంత సమస్యాత్మక గ్రామాలు 75, సమస్యాత్మక గ్రామాలు 100కు పైగా గుర్తించారు. ఆయా గ్రామాల్లో 155కు పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలపై నిఘా తీవ్రం.. అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో నిత్యం ఒక సీఐ, ఎస్ఐలతో పాటు పోలీసు కానిస్టేబుల్‌తో కూడిన బృందం పర్యటించే విధంగా పోలీసు శాఖ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మొదటి విడత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల బయట తోపులాటలు, రాళ్లదాడులు, స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి సంఘటనలు మలి విడతలో పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోనున్నారు. అత్యంత సమస్యాత్మక గ్రామాలు ఇవే.. కప్పట్రాళ్ల, కుంకనూరు, అలారుదిన్నె, పి.కోటకొండ, పందికోన, మాచాపురం, గుండ్లకొండ, నక్కలదొడ్డి, ఎద్దులదొడ్డి, పెండేకల్ ఆర్ఎస్, శెబాష్పురం, బొందిమడుగుల, బసినేపల్లి, తుగ్గలి, పగిడిరాయి, అగ్రహారం, తెర్నేకల్లు, కరివేముల, నేలతలమర్రి, చక్రాళ్ల, జొన్నగిరి, జి.ఎర్రగుడి, మారెల్ల, పత్తికొండ. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా.. మలి విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే సాయుధ బలగాలను ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో ఫ్యాక్షన్ గ్రామాల్లో గస్తీ తిప్పుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు, బళ్ళారి జిల్లాల సరిహద్దు గ్రామాలకు చెందిన ఓటర్లు కర్నూలు జిల్లా సరిహద్దు గ్రామాలకు వచ్చి సైక్లింగ్ ఓట్లకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఆయా ప్రాంతాల్లో నిఘాను తీవ్రతరం చేశారు. కర్ణాటక, మహబూబ్‌నగర్ జిల్లాల పోలీసు అధికారుల సమన్వయంతో సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఛత్రగుడి, హోళగుంద, పెద్ద హరివాణం, బాపురం, మాధవరం, నాగులదిన్నె ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేసి ఎన్నికలతో సంబంధం లేని వ్యక్తులు రాకుండా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. పేరుకే మూత..ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రామాల్లో బెల్టు దుకాణాలు ఉండకూడదని కఠినంగా ఆదేశాలిచ్చినప్పటికీ జిల్లా సరిహద్దులోని అనేక గ్రామాల్లో కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఒత్తిడి చేయడంతో కొన్ని ప్రాంతాల్లో బెల్టు దుకాణాలు మూసి వేసినట్లు చూపుతున్నప్పటికీ మరో మార్గంలో వాటి విక్రయాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తోటలు, గడ్డివాములు, ఇసుక ట్రాక్టర్లలో మద్యం బాటిళ్లను నిల్వ చేసి పంపిణీ సాగిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఆదోని, డోన్ పోలీస్‌సబ్ డివిజన్ అధికారులను అప్రమత్తం చేసి వాటి కట్టడికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. -
పంచాయతీ పరీక్ష
సాక్షి, నల్లగొండ : పంచాయతీ సెక్రటరీ పరీక్ష ఆది వారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో ఉన్న 133 పోస్టులకు 59,793 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఉదయం నిర్వహిం చిన పేపర్-1కు 41,661 మంది, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ -2 పరీక్షకు 41,503 మంది హాజరయ్యారు. మొత్తం మీద పేపర్ -1 పరీక్షను 69.93 శాతం, పేపర్ -2ను 69.67 శాతం మంది అభ్యర్థులు రాశారు. మొత్తం 8 పట్టణాల్లో ఏర్పాటు చేసిన 200 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఐదు రెవెన్యూ డివిజన్లతో పాటు కోదాడ, హుజూర్నగర్, చౌటుప్పల్‌లలో పరీక్ష జరిగింది. పేపర్ -1కు హాజరైన అభ్యర్థులకంటే.. పేపర్ -2 పరీక్షకు 158 మంది తక్కువ సంఖ్యలో పరీక్ష రాశారు. మొదటి పేపర్‌పై ఆశించిన మార్కులు రాకపోవచ్చన భావనతో రెండో పేపర్‌కు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. రెండు పేపర్లకు హాజరైన అభ్యర్థులను పరిగణనలోనికి తీసుకుంటే ప్రతి పోస్టుకు 312 మంది పోటీలో ఉన్నారు. పరీక్ష హాల్లోకి కీ? జిల్లాకేంద్రంలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలోకి కీ పేపర్ అందజేశారన్న పుకార్లు వెల్లువెత్తాయి. దీనిపై పలువురు విద్యార్థి సంఘం నేతలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూం నంబర్ 2లో ఓ అభ్యర్థికి పేపర్-2కు సంబంధించిన కీ పేపర్ గుర్తు తెలియని వ్యక్తి అందజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని చూసిన మిగిలిన అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సదరు అభ్యర్థిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. ఆ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలిలేటర్, డీఓపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఎస్ఐని విద్యార్థి సంఘం నేతలు కోరారు. కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సదరు అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కింద ఎస్ఐ బాషా కేసు నమోదు చేసుకున్నారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ జాగృతి, బీడీఎస్ఎఫ్, బీజేవైఎం, టీఆర్ఎస్వీ నాయకులు భోనగిరి దేవేందర్, పందుల సైదులు, తిరందాసు సంతోష్, బొమ్మరబోయిన నాగార్జున ఉన్నారు. చదివిందంతా వృథా అయ్యింది గ్రామపంచాయతీ పరీక్ష కోసం ఆరు నెలలు కష్టపడి చదివా. సూర్యాపేట పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో సెంటర్ పడింది. దీంతో రాజాపేట మండలం బొందుగుల నుంచి ఉదయాన్నే బస్సులో వెళ్తుండగా మార్గ మధ్యలో ఆగిపోయింది. దీంతో మరో బస్సులో వచ్చాను. సూర్యాపేట కొత్తబస్టాండ్‌లో దిగి లోకల్ ఆటోలో సెంటర్ వద్దకు వెళ్లే సరికి 2 నిమిషాలు ఆలస్యమైంది. దీంతో లోనికి వెళ్లనీయలేదు. ఎంత బ్రతిమిలాడినా పట్టించుకోలేదు. ఆరు నెలల పాటు కోచింగ్ తీసుకొని కష్టపడి చదివిందంతా వృథా అయ్యింది. - మూటకోడూరు గాయత్రి -
సత్తుపల్లి ఇక రెవెన్యూ డివిజన్!
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సత్తుపల్లి కేంద్రంగా జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాబోతోంది. రాష్ట్ర భూ పరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం జిల్లాలో 47 మండలాలకు నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఖమ్మంలో 17 మండలాలు, పాల్వంచలో 10 , భద్రాచలంలో 8 , కొత్తగూడెంలో 11 మండలాలతో డివిజన్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలో 17 మండలాలు ఉండటంతో పాలనా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు డివిజన్ చివర్లో ఉన్న మండలాలకు వెళ్లడం ఇబ్బంది అవుతోంది. గతంలో ప్రజా ప్రతినిధులు కల్లూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆ విషయం మరుగునపడింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో మళ్లీ ప్రభుత్వం పాలనా పరమైన ఇబ్బందులను తొలగించేందుకు, జనాభా, భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా మరో నూతన డివిజన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రక్రియ మొదలైంది. దీనిలో భాగంగానే సత్తుపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్ ఫైల్ సిద్ధం చేస్తున్నారు. ఈ ఫైల్‌కు గ్రీన్‌సిగ్నల్ లభిస్తే జిల్లాలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఐదుకు చేరుతుంది. డివిజన్ ఇలా.... జిల్లాలో నూతనంగా సత్తుపల్లి రెవెన్యూ డివిజన్‌ను ఎనిమిది మండలాలతో ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఖమ్మం డివిజన్లో 17 మండలాలకు ఆరు, పాల్వంచ డివిజన్లోని పది మండలాలకు రెండింటితో ఈ నూతన డివిజన్ ఏర్పడనుంది. అదే జరిగితే ఖమ్మం డివిజన్లో 11, పాల్వంచ డివిజన్లో 8 మండలాలు మాత్రమే ఉంటాయి. ఖమ్మం డివిజన్లోని మండలాలైన కల్లూరు, సత్తుపల్లి, వైరా, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు, పాల్వంచ డివిజన్లోని దమ్మపేట, అశ్వారావుపేట మండలాలతో కొత్తగా సత్తుపల్లి రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పడనుంది. ఈ డివిజన్ పరిధిలోనికి సత్తుపల్లి, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలు రానున్నాయి. కొత్తగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలనుకునే మండలాల్లో జనాభా, భౌగోళిక విస్తీర్ణం తదితర వివరాలను జిల్లా అధికారులు సేకరిస్తున్నారు. నూతన డివిజన్ విస్తీర్ణం, నైసర్గిక స్వరూపం ఎలా ఉంటుందనే ఆధారాలతో కూడిన మ్యాప్‌ను పంపాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అధికారులు ఆయా వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారం రోజుల్లో జిల్లాస్థాయిలో కసరత్తు పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. గతంలో కల్లూరు కేంద్రంగా ప్రతిపాదనలు జిల్లాలో కల్లూరు కేంద్రంగా వైరా, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేటలతో నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని పదేళ్ల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. కల్లూరు కాకుండా సత్తుపల్లిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తేనే అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పాలనాపరమైన అంశాలతోపాటు నియోజకవర్గ కేంద్రంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేస్తే అధికారులు అందరూ అందుబాటులో ఉంటారని చెబుతున్నారు. నూతన భవన నిర్మాణాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదని, పాత భవనాల్లోనే పాలన కొనసాగించేందుకు వీలుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలా పలురకాల కారణాలతో సత్తుపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని సమాచారం. -
కొత్త జేసీకి సవాళ్లెన్నో
నేడు విధులకు హాజరు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : రెండురోజుల క్రితం బాధ్యతలు స్వీకరించి శుక్రవారం విధులకు హాజరయ్యేందుకు జిల్లాకు వస్తున్న కొత్త జాయింట్ కలెక్టర్ మురళికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో గత కొంతకాలంగా పక్కదారి పట్టిన రెవెన్యూ పాలనను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఇసుక దొంగ రవాణా యథేచ్ఛగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇసుక మాఫియా ఆగడాలు పెచ్చుమీరుతుండటం, అధికారులపై సైతం దాడులకు తెగబడుతుండటంతో వారి కార్యకలాపాలను అడ్డుకునేందుకు సిబ్బంది భయపడుతున్నారు. కృష్ణానదీతీరంలో ఇసుక దొంగ రవాణాకు చెక్ పెట్టాలి. విజయవాడ రెవెన్యూ డివిజన్లోని పలు గ్రామాల్లో అక్రమంగా తరలించుకుపోతున్న ఇసుక రవాణాను అరికట్టాలి. ఇసుక మాఫియా ఆగడాలను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంది. మరోపక్క ప్రజాపంపిణీ వ్యవస్థ జిల్లాలో పక్కదారి పట్టింది. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు యథేచ్ఛగా తరలించేస్తున్నారు. జిల్లాలో కొందరు అధికారులు, డీలర్లతో కుమ్మక్కై ప్రజాపంపిణీ వ్యవస్థ అవకతవకలకు పాల్పడుతున్నట్లు ప్రతీ మండలంలో ఫిర్యాదులు కోకొల్లలుగా ఉన్నాయి. బినామీ డీలర్లను ఏరేసి ఆ స్థానంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగేలా కొత్త డీలర్ల నియామకాలు చేపట్టాల్సి ఉంది. జిల్లాలో తహశీల్దార్ కార్యాలయాల్లో, రెవెన్యూ డివిజన్లలో పెండింగులో ఉన్న పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ పంపిణీకి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కొన్ని మండల కేంద్రాల్లో పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీకి భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు పిర్యాదులు ఉన్నాయి. సొమ్ము ఇవ్వలేని బక్కరైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భూవివాదాలు పరిష్కారం కాక అనేకమంది బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎక్సైజ్, పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, సినిమాహాళ్ల నిర్వహణపై అజమాయిషీ కొరవడింది. ఎంతోకాలంగా వాటిపై తనిఖీలు లేకపోవటంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అన్నింటీకి మించి ఈ జిల్లాలో రాజకీయ పరిస్థితులు పెనుసవాలుగా మారనున్నాయి. -
కొత్త రెవెన్యూ డివిజన్ల కోసం 320 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తాజాగా ఏర్పాటుచేసిన 10 రెవెన్యూ డివిజన్ల కోసం ప్రభుత్వం కొత్తగా 320 పోస్టులు మంజూరు చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంజూరైన పోస్టుల వివరాలు.. స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ - 2, డిప్యూటీ కలెక్టర్ -8, డివిజినల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు -10, డిప్యూటీ తహసీల్దార్లు -30, సీనియర్ అసిస్టెంట్లు-60, జూనియర్ అసిస్టెంట్లు -60, టైపిస్టులు -20, రికార్డు అసిస్టెంట్లు 10, స్టెనోలు -10, అటెండర్లు - 70, డ్రైవర్లు -10, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే -10, చైన్‌మెన్ -10, ఉప గణాంక అధికారులు -10 పోస్టులు ఉన్నాయి. -
ఏడు పంచాయతీల్లో వైఎస్సార్సీపీ విజయం
సాక్షి, నరసరావుపేట: గుంటూరు జిల్లాలో ఎన్నికలు వాయిదా పడిన 12 పంచాయతీల్లో గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో 11, గుంటూరు డివిజన్లో ఒక పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. గత నెల 31న జరిగిన ఎన్నికల్లో ఐదు పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎత్తుకెళ్లి బావిలో పడేయడంతో వాటికి తిరిగి ఎన్నికలు నిర్వహించారు. అయితే, ఈ ఎన్నికలను కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులు బహిష్కరించారు. పల్నాడులో ఎన్నికలు జరిగిన 11 పంచాయతీల్లో రొంపిచర్ల, ఇక్కుర్రు, తూబాడు, కండ్లకుంట, ఊడిజెర్ల, గోగులపాడులలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. పెదరెడ్డిపాలెం, శిరిగిరిపాడు గ్రామాల్లో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు, అందుగులపాడు, ముత్తనపల్లిలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. సారంగపల్లి అగ్రహారంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. గుంటూరు డివిజన్లోని గుంటూరు రూరల్ మండలం చల్లావారిపాలెంలో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు.