చెన్నూర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి
-
ఆందోళన బాటపట్టిన చెన్నూర్ ప్రజానీకం
మంచిర్యాల సిటీ : కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో జిల్లాలోని చెన్నూర్ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ శుక్రవారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు.
అనంతరం కార్యాలయం ఇన్‌చార్జి రాజేశ్వర్‌రావుకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఇన్‌చార్జి డాక్టర్ మురళీధర్‌గౌడ్ మాట్లాడుతూ చెన్నూర్‌ను డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తే వేమనపల్లి, కోటపల్లి, జైపూర్ మండలాలతోపాటు చెన్నూర్ మండలవాసులకు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
మండల వ్యవస్థ రాకముందు చెన్నూర్ తహసీల్ కేంద్రంగా ప్రజలకు సేవలందించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, అందుగుల శ్రీనివాస్ ఉన్నారు.