రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
–డోన్ స్థానంలో పత్తికొండ డివిజన్ ఏర్పాటు
–కర్నూలు డివిజన్‌లోనే డోన్ నియోజకవర్గం
కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ నేతల సూచనలకనుగుణంగా డోన్ స్థానంలో పత్తికొండ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు ఊపందుకున్నాయి. గతంలో డోన్ కేంద్రంగా పత్తికొండ, బనగానపల్లె నియోజకవర్గాలను కలిపి రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయతలపెట్టారు. మారిన సమీకరణలతో పత్తికొండ కేంద్రంగా పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటును ప్రతిపాదించారు. డోన్ నియోజకవర్గం కర్నూలు రెవెన్యూ డివిజన్‌లోనే ఉంటుంది. ఇది వరకు డోన్ రెవెన్యూ డివిజన్‌లో కలపాలని ప్రతిపాధించిన బనగానపల్లె నియోజక వర్గాన్ని నంద్యాల రెవెన్యూ డివిజన్‌లోనే ఉంచనున్నారు.
-
కొత్త ప్రతిపాదనల ప్రకారం కర్నూలు రెవెన్యూ డివిజన్‌లో కర్నూలు, కోడుమూరు, డోన్, పాణ్యం, డోన్ నియోజకవర్గాలు ఉంటాయి. (జనాభా 12,09,821)
-
నంద్యాల రెవెన్యూ డివిజన్‌లో నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లి నియోజకవర్గాలు ఉంటాయి. (జనాభా 8,92, 526)
-
ఆదోని రెవెన్యూ డివిజన్‌లో ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవ్గాలు ఉంటాయి. (జనాభా 8, 38,817)
-
పత్తికొండ రెవెన్యూ డివిజన్‌లో పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలు ఉంటాయి. (జనాభా 5,92,703)
-
ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌లో శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాలు ఉంటాయి. (జనాభా 5,12,734)