రెవెన్యూ డివిజన్‌పై సీఎంతో మాట్లాడుతా
-
రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు
హుస్నాబాద్ : హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలపాలని అఖిలపక్ష నాయకులు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ను కోరారు. హైదరాబాద్‌లోని నివాసంలో గురువారం కలిశారు. సిద్దిపేటలో హుస్నాబాద్‌ను కలిపితే రెవెన్యూ డివిజన్ ఏర్పడే పరిస్థితులు లేవని అఖిలపక్ష నాయకులు వారికి తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిందని, హుస్నాబాద్‌కు రెవెన్యూ డివిజన్ విషయమై సీఎంతో మాట్లాడుతానని కెప్టెన్ లక్ష్మీకాంతారావు హామీ ఇచ్చినట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు. పదిహేను రోజుల్లోగా ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పినట్లు వారు తెలిపారు. గ్రామ పంచాయతీ తీర్మాణాల కాపీలతో అభ్యంతరాల స్వీకరణలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారన్నారు. హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండో అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, జేఏసీ మండల కన్వీనర్ కొయ్యడ కొమురయ్య, కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్, మైదంశెట్టి వీరన్న, బొల్లి శ్రీనివాస్, అక్కు శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఆడెపు లక్ష్మీనారాయణ, వేముల దేవేందర్‌రెడ్డి, దొడ్డి శ్రీనివాస్, పెందోట అనిల్‌కుమార్, సీపీఎం నాయకులు జాగిరి సత్యనారాయణ, శివరాజ్, సీపీఐ నాయకులు గడిపె మల్లేశ్, హన్మిరెడ్డి, మాడిశెట్టి శ్రీధర్, టీడీపీ నాయకులు వరయోగుల శ్రీనివాస్, ముప్పిడి రాజిరెడ్డి పాల్గొన్నారు.