హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి
హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి
Published Wed, Sep 14 2016 8:24 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
హుజూర్‌నగర్ : నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాసెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను పాటిస్తూ, అన్ని అర్హతలు ఉన్న హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలన్నారు. ఇందుకోసం నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి డివిజన్ కేంద్రంగా ప్రకటించే వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపారు. భారీ వర్షంలో సైతం సుమారు 2 రెండు గంటల పాడు రాస్తారోకో చేయడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ఎండి.నిజాముద్దీన్, తన్నీరు మల్లికార్జున్‌రావు, గొట్టె వెంకట్రామయ్య, యరగాని నాగన్నగౌడ్, ఎంఏ.మజీద్, ఎస్‌కె.సైదా, అట్లూరి హరిబాబు, చావా కిరణ్మయి, రౌతు వెంకటేశ్వరరావు, ఎస్‌డి.రఫీ,చిలకరాజు లింగయ్య, పండ్ల హుస్సేన్‌గౌడ్, కోల శ్రీను, సామల శివారెడ్డి, గూడెపు శ్రీనివాస్, ఎం.పెదలక్ష్మీనర్సయ్య, జడ రామకృష్ణ,పోతుల జ్ఞానయ్య, పిల్లి మల్లయ్య, యల్లావుల రాములు, పాలకూరి బాబు, గుండు వెంకటేశ్వర్లు, మామిడి వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్, పానుగంటి పద్మ జేఏసీ నాయకులు పీవీ.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
Advertisement