జిల్లాలో మరో రెండు రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు కాబోనున్నాయి. కొన్నేళ్లుగా జిల్లాలో కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నా కార్యరూపం దాల్చలేదు.
ప్రస్తుతం జిల్లాలో మూడు డివిజన్‌లు ఉన్నాయి. కొత్తవాటితో వీటి సంఖ్య ఐదుకు పెరగనుంది. కొత్త రెవెన్యూ డివిజన్‌లలో ఏఏ నియోజకవర్గాలను చేర్చాలి, ప్రస్తుత డివిజన్‌లలో ఏఏ నియోజక వర్గాలు ఉన్నాయి తదితర వివరాలు పంపాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఇప్పటి వరకు ఒక నియోజకవర్గంలో కొన్ని మండలాలు ఒక నియోజకవర్గంలో ఉంటే మరికొన్ని మండలాలు మరో డివిజన్‌లో ఉన్నాయి. వీటిని సవరిస్తూ కొత్త డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.