
సాక్షి, నంద్యాల జిల్లా: డోన్‌లో మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వాకింగ్ కోసం మున్సిపల్ పార్క్‌కు వస్తున్నారనే సమాచారంతో గేటుకు తాళాలు వేశారు. వాకింగ్ పార్క్‌లో బుగ్గనను సిబ్బంది అడ్డుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఫోన్ చేస్తే కూడా మున్సిపల్ కమిషనర్ స్పందించలేదు.
మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపైనే మాజీ మంత్రి వాకింగ్ చేశారు. నిత్యం వందలాది మంది వాకింగ్ చేసే పార్కుకు తాళం వేయడంతో వాకింగ్‌కి వచ్చిన వారు సైతం వెనుదిరిగారు. వాకింగ్ పార్‌కు తాళం వేయడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్క్‌కు తాళం వేస్తారా అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment