సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మరో 24 గంటల్లో కొత్త జిల్లాలు కొలువుదీరనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆఖరి గడియల్లో సవరణల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రతిపాదిత రంగారెడ్డి జిల్లాలో ఇదివరకే ప్రకటించిన నాలుగు కొత్త రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో డివిజన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. షాద్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే అంజయ్య ఆదివారం సీఎంను కలిశారు.
నియోజకవర్గంలోని ఐదు మండలాలను కలిపి డివిజన్ గా ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. అలాగే కొత్తూరు మండలాన్ని విభజించి నందిగామ కేంద్రంగా మరో మండలాన్ని ప్రకటించాలని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్..కొత్తగా నందిగామ మండలంతో పాటు షాద్‌నగర్ రెవెన్యూ డివిజన్ కు ఆమోదముద్ర వేశారు. కొత్తగా ఏర్పడే షాద్‌నగర్ డివిజన్ లోకి కొత్తూరు, కేశంపేట, కొందుర