MLA Anjaiah
-
కొత్తగా షాద్నగర్ డివిజన్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మరో 24 గంటల్లో కొత్త జిల్లాలు కొలువుదీరనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆఖరి గడియల్లో సవరణల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రతిపాదిత రంగారెడ్డి జిల్లాలో ఇదివరకే ప్రకటించిన నాలుగు కొత్త రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో డివిజన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. షాద్నగర్ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే అంజయ్య ఆదివారం సీఎంను కలిశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలను కలిపి డివిజన్ గా ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. అలాగే కొత్తూరు మండలాన్ని విభజించి నందిగామ కేంద్రంగా మరో మండలాన్ని ప్రకటించాలని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్..కొత్తగా నందిగామ మండలంతో పాటు షాద్నగర్ రెవెన్యూ డివిజన్ కు ఆమోదముద్ర వేశారు. కొత్తగా ఏర్పడే షాద్నగర్ డివిజన్ లోకి కొత్తూరు, కేశంపేట, కొందుర -
మొక్కలు నాటడం అందరి బాధ్యత
షాద్నగర్ : మొక్కలు నాటడం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం లింగారెడ్డిగూడలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని ప్రారంభించారన్నారు. అందరు భాగస్వామ్యం అయినప్పుడే హరితహారం విజయవంతం అవుతుందన్నారు. ప్రతి గ్రామంలో మొక్కలు విరివిగా నాటడానికి నాయకులు, అధికారులు ప్రజలకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో కొందూటి నరేందర్, వెంకట్రామ్రెడ్డి, వెంకట్రెడ్డి, నటరాజన్, యుగంధర్, చింటూ, మన్నెనారాయణ, యాదయ్య, తహసీల్దార్ చందర్రావు, ఎంఈఓ శంకర్రాథోడ్, ఏడీ భిక్షపతి, మాజీ సర్పంచ్ నర్సింహులు, అందెబాబయ్య, మల్లేష్, బలరాం, లక్ష్మయ్య, శశాంక్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా మండలంలోని మధురాపూర్లో సర్పంచ్ జ్యోతి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఇందులో భాగంగా గ్రామంలోని పలు వీధుల్లో గ్రామస్తులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వెంకట్రాంరెడ్డి, హెచ్ఎం గోపాల్, రంగయ్య, విటల్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.