లింగారెడ్డిగూడలో మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
మొక్కలు నాటడం అందరి బాధ్యత
Published Tue, Jul 19 2016 7:14 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
షాద్‌నగర్ : మొక్కలు నాటడం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం లింగారెడ్డిగూడలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని ప్రారంభించారన్నారు. అందరు భాగస్వామ్యం అయినప్పుడే హరితహారం విజయవంతం అవుతుందన్నారు. ప్రతి గ్రామంలో మొక్కలు విరివిగా నాటడానికి నాయకులు, అధికారులు ప్రజలకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో కొందూటి నరేందర్, వెంకట్రామ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నటరాజన్, యుగంధర్, చింటూ, మన్నెనారాయణ, యాదయ్య, తహసీల్దార్ చందర్‌రావు, ఎంఈఓ శంకర్‌రాథోడ్, ఏడీ భిక్షపతి, మాజీ సర్పంచ్ నర్సింహులు, అందెబాబయ్య, మల్లేష్, బలరాం, లక్ష్మయ్య, శశాంక్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
హరితహారంలో భాగంగా మండలంలోని మధురాపూర్‌లో సర్పంచ్ జ్యోతి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఇందులో భాగంగా గ్రామంలోని పలు వీధుల్లో గ్రామస్తులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వెంకట్రాంరెడ్డి, హెచ్‌ఎం గోపాల్, రంగయ్య, విటల్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement