కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పినట్టు మున్సిపల్ చైర్మన్ శీలం వేణు, వైస్ చైర్మన్ రఫీయోద్దీన్ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు అనూప్‌రావుతో కలిసి ఈ విషయమై వినతి పత్రం సమర్పించారు.
-
కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం వినతి
కోరుట్ల: కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పినట్టు మున్సిపల్ చైర్మన్ శీలం వేణు, వైస్ చైర్మన్ రఫీయోద్దీన్ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు అనూప్‌రావుతో కలిసి ఈ విషయమై వినతి పత్రం సమర్పించారు. కోరుట్లకు ఉన్న అన్ని అనుకూల అంశాలను ఎంపీకి వివరించామని తెలిపారు. ఎమ్మెల్యే కల్వకుంట్లతో సీఎం కేసీఆర్‌ను కలిసిlకోరుట్ల–మెట్‌పల్లి మధ్యలో రెవెన్యూ డివిజన్ ఉండేలా కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారని తెలిపారు. ఆయనతో పాటు ఎంఐఎం కౌన్సిలర్ చిట్యాల భూమయ్య, టీఆర్‌ఎస్ నాయకులు జక్కుల జగదీశ్వర్, కస్తూరి లక్ష్మీనారాయణ, సదుల వెంకటస్వామి, మోల్లా మసూద్ ఉన్నారు.
ఎంపీ కాళ్లు పట్టుకున్న కౌన్సిలర్
కోరుట్ల రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ ఎంఐఎం కౌన్సిలర్ చిట్యాల భూమయ్య ఎంపీ కవిత కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. మొదట రెవెన్యూ డివిజన్‌గా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసి మళ్లీ మార్పులు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల అర్హతలు ఉన్న కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఆయన కోరారు.