![Korutla Sub-inspector suspension](/styles/webp/s3/article_images/2024/10/5/555.jpg.webp?itok=KZdKg1kr)
జగిత్యాలక్రైం: కోరుట్ల ఎస్సై–2గా పనిచేస్తున్న శ్వేతను సస్పెన్షన్ చేస్తూ మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాలలోని మంచినీళ్ల బావి ప్రాంతాలకు చెందిన బొల్లారపు శివప్రసాద్ తనపై ఎస్సై శ్వేత చేయి చేసుకుందని మనస్తాపానికి గురై అక్టోబర్ 23న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడంతో ఎస్సై శ్వేతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్సై దాడితోనే ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment