సానుకూల ప్రకటన రాకపోతే ఆమరణ దీక్ష | If a positive statement on a fast-unto-death | Sakshi
Sakshi News home page

సానుకూల ప్రకటన రాకపోతే ఆమరణ దీక్ష

Published Sun, Sep 11 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

If a positive statement on a fast-unto-death

  • కాంగ్రెస్‌ నేత ఇనుగాల వెంకట్రాంరెడ్డి
  • పరకాల డివిజన్‌ సాధన దీక్ష మరో రోజు పొడిగింపు
  • పరకాల : పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజన్‌ సాధన కోసం వెంకట్రామ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆదివారంతో రెండోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు తాను నిరాహార దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుపై తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం వరకు దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. దీక్షకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement