నేటి నుంచి ఎమ్మెల్యే వంశీ ఆమరణ దీక్ష
కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని వినతి
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి బుధవారం నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నారు. చారిత్రక నేపథ్యం, జనాభా, ఇతర మండలాల ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని గత కొంత కాలంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాట తీవ్రతను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఆమరణ దీక్షే సరైన మార్గమని కల్వకుర్తి అఖిలపక్షం తీర్మానం చేయడంతో వంశీ దీక్షకు దిగుతున్నారు.
ఈ దీక్ష ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాదని ఆయన వెల్లడించారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా సాధించుకోవడానికే దీక్ష చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.