kalwakurthy
-
ఇది ప్రజల తెలంగాణ, దొరల తెలంగాణ మధ్య యుద్ధం: రాహుల్
-
అభ్యర్థులను మార్చాల్సిందే..! బీఆర్ఎస్లో ‘సీట్ల’ పంచాయితీ
సాక్షి, మహబూబ్‌నగర్: అధికార బీఆర్ఎస్లో టిక్కెట్ల పంచాయితీ ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పలు నియోజకవర్గాల్లో సీట్ల గొడవ ఎంతకీ తెగడం లేదు. అభ్యర్థుల జాబితాపై అసంతృప్తి గళాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అలంపూర్, కల్వకుర్తి అభ్యర్థులను మార్చాల్సిందేనని అసమ్మతి నేతలు తేల్చి చెబుతున్నారు. అలంపూర్‌లో విభేదాలు తారా స్థాయికి చేరగా, ఎమ్మెల్యే అబ్రహం అనుకూల, వ్యతిరేక వర్గీయుల పోటాపోటీ సమావేశాలతో పార్టీ క్యాడర్లో గందరగోళం పరిస్థితి నెలకొంది. కల్వకుర్తి సీటు విషయంలో జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు వ్యతిరేకంగా సమావేశాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం -
వెంకటేశ్‌కు పెద్ద పదవి గ్యారెంటీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: 18 ఏళ్లకే గ్రామ సర్పంచ్ అయ్యి.. మరోవైపు పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్న తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్‌ను తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పొగడ్తలతో ముంచెత్తారు. కండువా కప్పి బీఆర్ఎస్లోకి సాదరంగా స్వాగతించడమే కాకుండా.. పెద్ద పదవి గ్యారెంటీగా ఇస్తామని తెలంగాణ భవన్ నుంచి హామీ ఇచ్చారాయన. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్, ఇతర పార్టీ కార్యకర్తలు తెలంగాణ భవన్లో ఇవాళ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘వెంకటేశ్‌ను గత వారమే కలిశాను. తన రాజకీయ జీవితం ఏంటి అని అడిగాం. 18 ఏళ్లకే సర్పంచ్ అయ్యాను అని చెప్పాడు. పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నడు. కచ్చితంగా బీ ఆర్ ఎస్ అండ మీ అండ మీకు ఉంటుంది. వుప్పల వెంకటేష్ గ్యారెంటీగా పెద్ద పదవి ఇస్తామని హామీ ఇచ్చారాయన. తలకొండపల్లి కి వస్తాను., మీ సత్తా చూస్తాను అంటూ ఉప్పల వెంకటేశ్‌ను ఉద్దేశించి కేటీఆర్ చమత్కరించారు. కేటీఆర్ హాట్ కామెంట్లు బీఆర్ఎస్లో టికెట్ కేటాయింపులపైనా కేటీఆర్ హాట్ కామెంట్లు చేశారు. ‘‘ఒక నియోజకవర్గంలో ఎందరో టికెట్లు ఆశిస్తారు. కానీ, అందరికీ ఇవ్వలేం. ఎవరో ఒక్కరికే టికెట్ ఇస్తారు. ఒకటే నియోజకవర్గం, ఒకటే సీటు, ఒకటే బీఫామ్. ఆశలు, విబేధాల్ని పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయండి. పార్టీ ప్రకటించిన అభ్యర్థిని అందరూ సమిష్టిగా గెలిపించుకోవాలి. కేసీఆర్‌ను హ్యాట్రిక్సీఎంను చేయాలి అని బీఆర్ఎస్ శ్రేణుల్ని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది సంక్షేమ ప్రభుత్వం ‘‘రాష్ట్రంలో 9ఏళ్లుగా ఇంటింటికి సంక్షేమ పథకం ఇస్తున్నాం. పుట్టిన బిడ్డ నుంచి,వృద్ధుల వరకు అందరికీ సంక్షేమం అందుతోంది. కేసీఆర్ కిట్, చదువులకు ఆర్ధిక సాయం, పెన్షన్లు, కల్యాణలక్ష్మి, సొంత భూమి కలిగిన వారికి గృహలక్ష్మి, ఉద్యోగాలు,రైతు బంధు, చేనేత మిత్ర, గొర్రెల పంపిణీ ఇలా అనేక పథకాలు అందిస్తున్నాం. 76 యేళ్లు అయ్యింది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఇన్నేళ్లలో ఎందుకు గత ప్రభుత్వాలు ఇంటింటికి నీళ్ళు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు’’ అని కేటీఆర్ మాట్లాడారు. రేవంత్‌పై సెటైర్లు ‘‘ప్రతిపక్ష పార్టీలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారు. 4వేల పెన్షన్లు, 25 గంటల కరెంట్ ఇస్తాం అంటున్నారు. ఇన్నేళ్లు ఎందుకు ఇవ్వలేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఒకాయన అడుక్కుంటున్నడు. బీజేపీ అధికారం లోకి వస్తె కేసిఆర్ పథకాలు కొనసాగిస్తాం అని బీజేపీ నాయకులు అంటున్నారు. కేసీఆర్ పథకాలు కొనసాగించాకా మీరెందుకు. సంపద పెంచాలి,పేదలకు పంచాలి మా నినాదం. కానీ సంపద పెంచుకొని, వెనక వేసుకోవాలి అనేది ప్రతిపక్షాల తీరు. సంచులు మోసినా వాడు కూడా నీతులు పలుకుతున్నాడు. సంచులు మోసి, జైల్లో చిప్ప కూడు తిన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. పీసీసీ పదవి అదొక పదవా? ప్రైమ్ మినిస్టర్ పదవి అయినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. వీళ్లకు అభ్యర్థులే లేరు, వీళ్లకు ఓటు ఎలా వేస్తారు?. కేసీఆర్‌నే జైలుకు పంపుతరా? మహబూబ్ నగర్ ను సస్యశ్యామలం చేస్తాం. కల్వకుర్తి ప్రజలు చాలా తెలివి గల వారు. మీతో పెట్టుకున్నోడు ఎవడు బాగు పడలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు బాగా చెప్తున్నారు. కాంగ్రెస్ హయం లో కరెంట్ కోసం కష్టపడే వాళ్ళం. వీళ్ళను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టే. వీళ్ళను నమ్మకండి. బీజేపీ అధికారం లోకి వస్తే అందరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తాం అన్నాడు మోదీ. పడ్డయా?. కానీ కేసిఆర్ రైతు బంధు, పెన్షన్లు, ఇలా అనేక పథకాలు అమలు చేశారు. కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణ కు ఉండాలి, ఢిల్లీ నేతల మాటలు పట్టుకుంటే మాటిమాటికీ ఢిల్లీ వెళ్ళాలి. తెలంగాణ ఆత్మగౌరవానికి, ఢిల్లీ గులాంగురికి మధ్య జరుగుతున్న పోటీ. బీజేపీ ది హిందు ముస్లిం మధ్య చిచ్చు పెట్టడమే పని. కేసీఆర్ ను జైలుకు పంపుతాం అన్నవాడే షెడ్డుకు పోయాడు. కేసీఆర్ ఎందుకు జైలుకు పంపుతావు?. కళ్యాణ లక్ష్మీ, రైతు వందుజ్ ఆడబిడ్డ పుడితే నగదు ఇస్తున్నందుకు జైలుకు పంపుతారా?. మీ నియోజకవర్గ అభివృద్ది కి మాది బాధ్యత అని ప్రజలకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ టికెట్ ఎవరికి వచ్చిన వారికి మద్దతుగా నిలవాలి గెలిపించుకోవాలి. మహబూబ్ నగర్ లో 14 స్థానాలు బీ ఆర్ ఎస్ గెలవాలి అని పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి కేటీఆర్ చెప్పారు. -
ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో హైవే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి మన రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు 255 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. రూ.4,706 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారి నిర్మించనున్నారు. రహదారిలో అంతర్భాగంగా ఇప్పటికే కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. కాగా, రెండు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి నిర్మాణ ప్రక్రియ కూడా తాజాగా చేపట్టింది. రహదారి నిర్మాణం ఇలా... తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే 255 కి.మీ. రహదారి(ఎన్‌హెచ్167కె)ని ఏడు ప్యాకేజీల కింద నిర్మిస్తారు. అందులో తెలంగాణలో 91 కి.మీ. రహదారిని రూ.2,406 కోట్లతో నిర్మించేందుకు డీపీఆర్‌ను రూపొందించారు. మొదటి ప్యాకేజీ కింద రూ.886.69 కోట్లు, రెండో ప్యాకేజీ కింద రూ.1,082.40 కోట్లు, మూడో ప్యాకేజీ కింద రూ.436.91కోట్లతో పనులు చేపట్టేందుకు ఎన్హెచ్ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. ఇక ఏపీలో 164 కి.మీ. మేర రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో రహదారి నిర్మాణానికి ప్రణాళికను రూపొందించారు. మొత్తం నాలుగు ప్యాకేజీల కింద నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు ఈ రహదారిని నిర్మిస్తారు. అందులో మొదటి ప్యాకేజి కింద 62.57 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి రూ.785 కోట్లతో పనులకు డీపీఆర్‌ను తాజాగా ఖరారు చేశారు. మిగిలిన మూడు ప్యాకేజీల కింద పనులను రూ.1,515 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ఎన్హెచ్ఏఐ డీపీఆర్‌ను రూపొందిస్తోంది. నాలుగు ప్యాకేజీల డీపీఆర్‌లు ఖరారు అయ్యాక 2023 ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఏడాదిన్నరలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. -
రుణమాఫీ నిధులు విడుదల చేయాలి
కల్వకుర్తి : రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ సూచన మేరకు సన్న వడ్లు పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు దిగుబడి సరిగా రాలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఎకరాకు 20 బస్తాల దిగుబడి కూడా రాలేదని, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో తేల్చాలని అడిగారు. రైతులకు 26 లక్షల టన్నుల యూరియా ఉచితంగా ఇస్తామని 2017లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారని సీఎంను విమర్శించారు. తమది రైతు ప్రభుత్వమని చెప్తున్న సీఎం కేసీఆర్ కొత్త వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. ఈ చట్టాలను రద్దుచేసే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఆరో రోజుకు రేవంత్ పాదయాత్ర ఊర్కొండ: రేవంత్‌రెడ్డి పాదయాత్ర ఆరో రోజుకు చేరింది. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ, వెల్దండ మండలాల్లో పాదయాత్ర కొనసాగింది. ఊర్కొండ మండలం ఊర్కొండపేటలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం రేవంత్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. జకినాలపల్లి, ఇప్పపహాడ్ గ్రామాల మీదుగా వెల్దండ మండలంలోని కుప్పగండ్ల వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద సోయి లేకుండా, మద్యాన్ని ఏరులై పారిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఉపఎన్నిక వచ్చిన చోట మాత్రమే వరాల జల్లు కురిపిస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ఉపఎన్నిక రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత
సాక్షి, కల్వకుర్తి: మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి (75) కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన.. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. కరెంట్ కిష్టారెడ్డి గా పేరున్న ఈయన వార్డు సభ్యుడి నుంచి సర్పంచ్, ఎంపీపీ పదవులతో పాటు రెండుసార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. 1967లో సోషలిస్టు పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. అది జనతా పార్టీలో విలీనం కావడంతో అందులో చేరారు. 1973, 1981లో కల్వకుర్తి సర్పంచ్‌గా, 1987లో మండలాధ్యక్షుడిగా, 1994లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరి 2004లో మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. (చదవండి: అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయికి..) కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో కలసి పనిచేసినా రాజకీయంగా విభేదించి టీడీపీలో చేరారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అనంతరం 2018లో టీఆర్ఎస్లో చేరారు. ఎడ్మ కిష్టారెడ్డి అంత్యక్రియలు కల్వకుర్తిలోని ఆయన వ్యవసాయ పొలంలో మంగళవారం పూర్తయ్యాయి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కాసేపు పాడె మోశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. సామాజిక స్పృహ కలిగిన నాయకుడు: సీఎం కేసీఆర్ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. సామాజిక స్పృహ కలిగిన నాయకుడిగా ప్రజల అభిమానం సంపాదించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి సంతాపం తెలిపారు. నిజాయితీకి నిలువెత్తు రూపం: ఏపీ సీఎం జగన్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నిబద్ధత, నిరాడంబరత, నిజాయితీకి నిలువెత్తు రూపం ఎడ్మ కిష్టారెడ్డి అని కొనియాడారు. ఆయన మరణం తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటు న్నట్లు పేర్కొన్నారు. కిష్టారెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. కాంగ్రెస్ నేతల సంతాపం ఎడ్మ కిష్టారెడ్డి మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, సంపత్ కుమార్, చల్లా వంశీచంద్‌రెడ్డి, మల్లు రవి సంతాపం తెలిపారు. రైతులకు ఎప్పుడూ కరెంటు, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు అంటూ కరెంటు కిష్టారెడ్డిగా గుర్తింపు పొందారని జానారెడ్డి గుర్తుచేసుకున్నారు. -
మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి
సాక్షి, కల్వకుర్తి/కల్వకుర్తి: రైతుల ప్రధాన సమస్యల్లో ఒకటైన కరెంట్ ఇక్కట్లు తీర్చాలని ఎన్నో పోరాటాలు చేసి.. చివరికి సమస్య పరిష్కారానికి కృషిచేసి కరెంట్ కిష్టారెడ్డిగా పేరు గడించిన ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం మృతిచెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైఎస్సార్సీపీలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పారీ్టలో కొనసాగుతున్నారు. అభివృద్ధిలో చెరగని ముద్ర కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేయడంతోపాటు.. అభివృద్ధిలో తనదైన ముద్ర వేశాడు మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి. 1994 నుంచి 2004 వరకు విద్యుత్ కోసం ఆమరణ దీక్ష చేసి రైతుల పక్షాన పోరాటం చేసిన నాయకుడు ఆయన. విద్యుత్ సరఫరా సరిగా లేక బోరు మోటార్లు కాలిపోయి.. చేతికొచ్చే పంటలు ఎండిపోయి ఎంతోమంది రైతులు ఆత్మహత్యలే శరణ్యమనుకునే రోజుల్లో వారి బాధలు చూసి చలించిన ఆయన 9రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఎట్టకేలకు విద్యుత్ సమస్యను తీర్చి కరెంట్ కిష్టన్నగా పేరు గడించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాధనకు ఉద్యమాలు ఎన్నో చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో ఆయనకు ఆయనే సాటి. 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించాక నియోజకవర్గంలో 18.. 33/11కేవి సబ్స్టేషన్లు ఏర్పాటు చేయించి విద్యుత్ కష్టాలు తీర్చాడు. మహానేత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డికి కిష్టారెడ్డి ప్రీతిపాత్రు నిగా ఉన్నాడు. సబ్సిడీ కందిపప్పు పథకాన్ని కల్వకుర్తిలోనే ప్రారంభించారు. విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి కృషిచేశారు. అలాగే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి, నందమూరి తారక రామారావు, ప్రస్తుత ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్.జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ తదతరులతో సత్సంబంధాలు నెలకొల్పారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన మరణం నియోజకవర్గానికి తీరనిలోటని పలువురు పేర్కొంటున్నారు. ఎడ్మ ఆశయ సాధనకు కృషి : మంత్రి జీవితాంతం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయోజనాల కోసం పాటుపడిన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేద్దామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం సాయంత్రం కల్వకుర్తిలో ఎడ్మ కిష్టారెడ్డి పారి్థవదేహంపై పూలమాలలు వేసి నివాళులరి్పంచి మాజీ ఎమ్మెల్యే భార్య పుష్పమ్మ, కుమారుడు మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంను ఓదార్చారు. సీఎం కేసీఆర్ ఆయన మృతికి సంతాపం తెలిపారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం రాజీలేని పోరాటం చేసిన చరిత్ర ఎడ్మ కిష్టారెడ్డిదని కొనియాడారు. నివాళులరి్పంచిన వారిలో ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, జానారెడ్డి, జెడ్పీ చైర్మన్ పద్మావతి, వైస్‌చైర్మన్ బాలాజీసింగ్, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, అభిమానులు హాజరయ్యారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ఎడ్మ కిష్టారెడ్డి అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం అశ్రునయనాల మధ్య జరిగాయి. ఆయన పారి్థవదేహాన్ని ఇంటి నుంచి దేవరకొండ రోడ్డులో ఉన్న వారి వ్యవసాయం పొలం వరకు ర్యాలీగా తీసుకెళ్లారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, కిష్టారెడ్డి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ర్యాలీ వెంట కదిలారు. పెద్ద ఎత్తున జనం అంతిమయాత్రకు తరలివచ్చారు. ఆయన కుమారుడు, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. -
తల్లిదండ్రులు మందలించారని యువకుడు..
సాక్షి, కల్వకుర్తి : తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మార్చాలకి చెందిన రాముడు (24) హోటళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన యువకుడిని ఏదో విషయమై అతని తల్లిదండ్రులు మందలించారు. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను పురుగుల మందు తాగాడు. కొద్ది సమయం తర్వాత తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా.. కుమారుడు అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించి వెంటనే కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. పరిశీలించిన వైద్యులు.. అప్పటికే అతను మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పట్టణప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
-
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంటిపై దాడి
సాక్షి, కల్వకుర్తి టౌన్: స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకులే దాడిచేసిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వెల్దండ మండలం పోతేపల్లికి చెందిన సంజీవ్‌కుమార్‌యాదవ్ 9వ డైరెక్టర్ స్థానం, 7వ డైరెక్టర్ స్థానం నుంచి జూపల్లికి చెందిన భాస్కర్‌రావు పోటీచేసి గెలుపొందారు. వీరిలో జూపల్లి భాస్కర్‌రావుకు పీఏసీఎస్ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న సంజీవ్ అనుచరులు కల్వకుర్తిలో ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతుండగా సంజీవ్, జూపల్లి భాస్కర్‌రావు అనుచరులకు మాటమాట పెరిగి గొడవకు దారితీసి.. దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే సంజీవ్ అనుచరులు ఎమ్మెల్యే ఇంటికి ఉన్న కిటికీ అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు ఏకంగా ఎమ్మెల్యేపై దాడిచేసేందుకు యత్నించారు. వెంటనే తేరుకున్న గన్మెన్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే ఇద్దరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అద్దాలను ధ్వంసం చేస్తున్న సమయంలో ఓ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో డివిజన్లోని అన్ని పోలీస్స్టేషన్ల పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. పరిశీలించిన డీఎస్పీ.. ఎమ్మెల్యే ఇంటిపై దాడి సమాచారం తెలుసుకున్న డీఎస్పీ గిరిబాబు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్న సంజీవ్‌యాదవ్‌కు, మద్దతుదారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అనంతరం డీఎస్పీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను కలిసి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై డీఎస్పీ స్పందిస్తూ ఫిర్యాదు అందితే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఇంధన పొదుపులో ఆర్టీసీకి రెండు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపులో చురుగ్గా వ్యవహరించిన ఆర్టీసీలోని రెండు డిపోలకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టి.ఎస్.రెడ్కో) అవార్డులు దక్కాయి. కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ అధీనంలోని బ్యూరో ఆఫ్ ఎఫిషియెన్సీతో కలసి టి.ఎస్.రెడ్కో శుక్రవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా ఆర్టీసీ అధికారులు బంగారు, వెండి పురస్కారాలు అందుకున్నారు. 2018–19కి గానూ నల్లగొండ డిపో 106 బస్సులు, 171.51లక్షల కిలోమీటర్ల ఆపరేషన్‌తో 1.65లక్షల లీటర్ల ఇంధనం ఆదా చేసింది. తద్వారా రూ.1.09 కోట్ల ఖర్చు తగ్గింది. దీంతో ఇంధన పొదుపులో నల్లగొండ డిపో టాప్‌గా నిలిచి బంగారు పతకం దక్కించుకుంది. కల్వకుర్తి డిపోలో 77 బస్సులతో 98.71లక్షల కిలోమీటర్లు ఆపరేట్ చేసి, 1.37లక్షల లీటర్ల ఇంధనం ఆదాతో రూ.91.45 లక్షల ఖర్చు తగ్గింది. ఆ డిపో వెండి పతకం సాధించింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) సి.వినోద్ కుమార్, సీఎంఈ టి.రఘునాథరావు, నల్లగొండ రీజినల్ మేనేజర్ వెంకన్న, నల్లగొండ, కల్వకుర్తి డిపో మేనేజర్లు సురేశ్, సుధాకర్ పురస్కార స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. -
విద్యార్థుల అదృశ్యం..కల్వకుర్తిలో ప్రత్యక్షం
సాక్షి, కల్వకుర్తి(మహబూబ్‌నగర్) : స్థానిక గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినుల అదృశ్యం కథ సుఖాంతమైంది. బాలికలు అమ్రాబాద్‌లో క్షేమంగా పట్టుబడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయా ఘటనలకు సంబంధించి వివరాలిలా.. కల్వకుర్తిలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులు రాజేశ్వరి, పావని, సుజాత, నాగేశ్వరి ఈ నెల 26న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తమ సామగ్రిని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. అదేరోజు అర్ధరాత్రి కల్వకుర్తి బస్టాండ్‌లో సంచరిస్తున్నట్టు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు నమోదైంది. అయితే పాఠశాలలోని సీసీ కెమెరాల్లో మాత్రం ఈ దృశ్యాలు నమోదు కాలేదు. ఈ నెల 27న దీపావళి పండుగ కావడంతో వారిని ఎవరూ గుర్తించలేదు. చివరికి మధ్యాహ్నం సమయంలో ఆ నలుగురు విద్యార్థినులు పాఠశాలలో లేరని సిబ్బంది తెలుసుకుని పాఠశాల ప్రిన్సిపాల్ విజయరాంరెడ్డికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన అక్కడికి చేరుకుని తల్లిదండ్రులకు తెలియజేశారు. అదే రోజు రాత్రి 11 గంటలకు కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ సావిత్రమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గురుకులాల కార్యదర్శి ఆరా ఈ ఘటనపై రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరా తీశా రు. ఆయన ఆదేశాల మేరకు సోమవారం ఐటీడీఏ పీఓ వెంకటయ్య, గిరిజన పాఠశాలల ఆర్సీఓ కల్యాణిని పాఠశాలకు వెళ్లి అక్కడి సిబ్బంది, తోటి వి ద్యార్థినులతో వివరాలు సేకరించారు. ఇక గిరిజన గురుకుల పాఠశాలలో ఏ ర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగా ప నిచేయడం లేదు. ఈ ఘటనపై దృశ్యా లు ఏవీ అందులో రికార్డు కాలేదు. ఈ పాఠశాల నుంచి తప్పిపోయిన విద్యార్థిని సుజాతకు సోమవారం హాజరుపట్టికలో ఉపాధ్యాయులు హాజరు వేయడం గమనార్హం. ఈ ఘటన జరిగి రెండు రోజులైనా పాఠశాల సిబ్బంది బయటకు పొక్కనీయలేదు. చివరకు పోలీసులతోపాటు తల్లిదండ్రులకు సైతం విషయాన్ని ఆలస్యంగా తెలియజేశారు. ఈ నలుగురు విద్యార్థినులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. వారి ట్రంకు పెట్టెల్లో దొరికిన కొన్ని పత్రాలు, నోట్‌బుక్స్‌లో ఫోన్ నంబర్లు, ఉత్తరాల ఆధారంగా అలవాట్లను పాఠశాల సిబ్బంది వివరించారు. -
గీత దాటిన సబ్ జైలర్
సాక్షి, కల్వకుర్తి(నాగర్‌కర్నూల్) : విధుల పట్ల నిర్లక్ష్యం, అక్రమార్కులతో కుమ్మక్కు, తోటి ఉద్యోగుల పట్ల దురుసు ప్రవర్తన వెరసి కల్వకుర్తి సబ్‌జైలర్ సుధాకర్‌రెడ్డిపై వేటుకు కారణమైంది. కల్వకుర్తి సబ్ జైలర్‌గా మంథని నుంచి సుధాకర్‌రెడ్డి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి విధుల పట్ల అంటిముట్టనట్లుగా ఉన్న ఈయన సబ్‌జైలర్ నుంచి ఎస్ఐగా మారి తన పరిధి దాటి ఇసుక అక్రమార్కుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్ఐ అవతారం ఎత్తి.. సబ్ జైలర్‌గా విధులు నిర్వహించాల్సిన సుధాకర్‌రెడ్డి దారితప్పి ఎస్ఐగా అవతారం ఎత్తి ఇసుక అక్రమార్కుల దగ్గర అక్రమంగా వసూళ్లకు పాల్పడుతూ దందా నిర్వహిస్తున్నారు. కొంతమంది సిబ్బందిని తన అక్రమాలకు అండగా ఉపయోగించుకుంటున్నారు. డబ్బులు ఇవ్వని ఇసుక వ్యాపారు లకు ఫోన్లు చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఇసుక ట్రా క్టర్లు సీజ్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు సబ్ జైలర్ సుధాకర్‌రెడ్డి మంథనిలో విధులు నిర్వహించిన సమయంలో అనేక ఆరోపణలు రావడంతో కల్వకుర్తికి బదిలీ చేశా రు. ఇక్కడ కూడా విధులు నిర్వహిస్తూ ఒక ఇసుక వ్యాపారిని డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధిత వ్యా పారి సబ్‌జైలర్ ఫోన్‌కాల్‌ను రికార్డు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం కల్వకుర్తికి వచ్చి సమగ్ర విచారణ జరిపారు. సుధాకర్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతోపాటు విధుల పట్ల నిర్లక్ష్యాన్ని గుర్తించిన అధికారుల నివేదిక మేరకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్స్ సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేయడంతోపాటు సుధాకర్‌రెడ్డిని హెడ్‌క్వార్టర్ వదిలి పోకూడదనే ఆదేశాలిచ్చారు. సబ్ జైలర్ వ్యవహారం కల్వకుర్తి ప్రాంతంలో కలకలం రేకెత్తించింది. -
పెద్దలు ప్రేమను నిరాకరించారని..
తలకొండపల్లి(కల్వకుర్తి): నిండునూరేళ్లు హాయిగా బతకాల్సిన ఓ ప్రేమజంట పెద్దల మూర్ఖత్వానికి తనువు చాలించింది. తమ ప్రేమను అంగీకరించకపోవడంతో మనస్తాపం చెంది పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని వెంకటాపూర్‌లో ఈ విషాద ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వెంకటాపూర్‌కు చెందిన తాండ్ర వెంకటయ్య, పద్మ దంపతుల మూడో కుమారుడు మల్లేష్ (19), అదే గ్రామానికి చెందిన భాషమోని నర్సింలు, భీమమ్మ దంపతుల నాలుగో కుమార్తె శిల్ప(17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. మల్లేష్ ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ రెండో సంవత్సరం వరకు జడ్చర్లల్లో చదివాడు. గతేడాది చదువు మానేసి స్వగ్రా మంలోనే వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. శిల్ప వెల్జాల్లో 10వ తరగతి వరకు చదివింది. గతేడాది చదువు మానేసి ఇంటి వద్ద ఖాళీగానే ఉండేది. కొంతకాలంగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో పెద్దలు మందలించారు. అయినా, వీరిలో మార్పు రాలేదు. దీంతో శిల్ప తల్లితండ్రులు ఆమెను మాదాయిపల్లిలో ఉంటున్న బంధువుల వద్దకు పంపించారు. కొంతకాలంగా వీరు దూరంగా ఉంటున్నారు. అయితే, బుధవారం మధ్మాహ్నం మాదాయిపల్లిలో మల్లేష్, శిల్ప కలిసి తిరగడం ఇరుకుటుంబాల పెద్దలు గమనించి మందలించారు. బంధువులు శిల్పను వెంకటాపూర్‌కు పంపించారు. ఇరు కుటుంబాల్లో వీరి తల్లిదండ్రులు మరోమారు గట్టిగా హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన శిల్ప, మల్లేష్ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. గురువారం ఉదయం గ్రామ శివారులో ఇద్దరూ విగతజీవులగా పడి ఉన్నారు. ఉదయం పాలు పితికేందుకు పొలాలకు వెళ్తున్న రైతులు గమనించి గ్రామస్తులకు తెలిపారు. ఎస్ఐ సురేష్‌యాదవ్ సిబ్బందితో అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. సంఘటనా స్థలంలో ఒక బీరు బాటిల్, పురుగులమందు డబ్బా, దానిని కొనుగోలు చేసిన చిట్టీ, వాటర్‌బాటిల్, సెల్‌ఫోన్ పడి ఉన్నాయి. మృతుడు మల్లేష్ సోదరుడు మహేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పదంగా మృతిచెందినట్లు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగాని పూర్తివివరాలు తెలిసే అవకాశం లేదన్నారు. -
భగీరథ.. దాహం తీర్చే
సాక్షి, కల్వకుర్తి: వేసవి వస్తే చాలు పల్లెలు, పట్టణాలని వ్యత్యాసం లేకుండా తాగునీటికి కష్టాలు ఉండేవి. మహిళలు బిందెలు పట్టుకొని వ్యవసాయ పొలాలలోని బోర్ల వద్దకు పరుగులు తీసేవారు. ప్రభుత్వం లీజ్బోర్లు, ట్యాంకర్లతో సరఫరా చేస్తూ రూ.కోట్లు వ్యయం చేసేది. ఎన్ని సమీక్షలు పెట్టినా నిధులు నీళ్ల వ్యయం చేసినా నీటి కష్టాలు మాత్రం తీరేవి కావు. ప్రజలు నీటి బిందెలు పట్టుకొని ధర్నాలు సైతం చేసేవారు. ప్రతి గ్రామ సర్పంచ్‌కి అధికారులకు ఈ సమస్య పెద్దతలనొప్పిగా మారేది. ప్రస్తుతం అంతా మారిపోయింది. సీఎం కేసీఆర్ బృహత్తరమైన ఆలోచన తాగునీటి ఎద్దడికి శాశ్వతమైన పరిష్కారం చూపింది. మిషన్ భగీరథతో అ న్ని చోట్ల తాగునీటి కటకటకు పుల్‌స్టాప్ పడింది. వేసవిలో సైతం దాహం తీరి నీటి కష్టాలు తొలిగాయి. 35 గ్రామాలకు సరఫరా మండలంలోని 35 గ్రామాలకు భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అన్ని చోట్ల అవసరాన్ని గుర్తించి కొత్తగా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు మం జూరు చేశారు. కొన్ని చోట్ల ట్యాంకుల నిర్మాణం పూర్తయింది. మిగతా చోట్ల నిర్మాణంలో ఉన్నా యి. నిర్మాణం పూర్తయిన గ్రామాలు సుద్దకల్, గుండూరు, తాండ్ర, పంజుగుల్, సత్యసాయికాలనీలో కొత్త ట్యాంకులకు నీరు ఎక్కించి గ్రామాల్లో సరఫరా చేస్తున్నారు. మిగతా గ్రామాల్లో పాత ట్యాంకులకు నీటిని పంపింగ్ చేసి ఇళ్లలోకి సరఫరా చేస్తున్నారు. దాదాపు పెద్దగ్రామాలకు రోజు ల క్ష లీటర్ల చొప్పున సరఫరా చేస్తుంటే చిన్న గ్రామాలకు 50వేల లీటర్ల చొప్పున సరఫరా చేస్తున్నారు. వేసవిలో సైతం ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో.. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భజలాలు ఏటా గణనీయంగా పడిపోయి మున్సిపల్ బోర్లే కాదు, ఇళ్లలో ఉండే బోర్లు సైతం ఎండిపోయాయి. దీంతో కల్వకుర్తి పట్టణంలో నీటి సమస్య తీవ్రంగా ఉండేది. అంతే కాకుండా దాదాపు 40వేల జనాభా ఉండడంతో నీటి సమస్య జఠిలంగా ఉండేది. దీంతో మున్సిపల్లో కొన్నేళ్ల నుంచి నీటి సరఫరా ట్యాంకర్ల ద్వారానే చేస్తున్నారు. నీటి సరఫరాకు రోజు రూ.లక్ష ట్యాంకర్లకే ఖర్చు పెట్టేవారు. సమస్య తీరేది కాదు. ప్రజలు ఎవరింటికి వారు ట్యాంకర్ల ద్వారా పోయించుకునే వారు. నాలుగేళ్లలో ట్యాంకర్ల కోసం రూ.మూడు కోట్లపైనే వ్యయం చేశారని అంచనా. ఇక భగీరథ వచ్చిన తర్వాత పట్టణానికి నిత్యం 40లీక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో పాత ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. వేసవి వస్తే రోడ్లపై, కాలనీలో ట్యాంకర్ల చప్పుడే ఉండేది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయింది. ఒక్కరోజు తప్పించి మరోరోజు నీటి సరఫరా అవుతుండడంతో పట్టణంలో వేసవిలో సైతం నీటి సమస్య లేకుండా ఉండడంతో ప్రజలు చాలా సంతోష పడుతున్నారు. వేసవి కాలం అంతా.. సరఫరా మరో రెండు నెలల పాటు వేసవి ఉంటుం ది. భగీరథ నీరు వేసవిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయనున్నామని మిషన్ భగీరథ ఈఈ పు ల్లారెడ్డి తెలిపారు. దీంతో ఇక వేసవిలో నీటి సమస్య రాదు. గ్రా మాల్లో, పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికినట్లే. వేసవిలో సరఫరా చేస్తే ఇక వర్షాకాలం నల్లేరుమీద నడకలాంటిందే. -
పానీపూరి బండిలో సిలిండర్ పేలుడు
సాక్షి, కడ్తాల్(కల్వకుర్తి): పానీపూరి బండిలో గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ఫ గాయాలయ్యాయి. ఈ ఘటన కడ్తాల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీశైలం–హైద్రాబాద్ జాతీయ రహదారిపై మండల కేంద్రంలోని బస్‌స్టాప్ పక్కన, మార్వాడీ కమలేష్ అనే వ్యక్తి కొంత కాలంగా పానీపూరి తోపుడుబండిని ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నాడు. మంగళవారం సాయంత్రం పానిపూరిలు తయారు చేస్తుండగా, ఒక్కసారిగా సిలిండర్ పైపు నుంచి గ్యాస్ లీకై క్షణాల్లో ఆ బండి మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన సమీపంలోని చిరువ్యాపారులు పరుగులు పెట్టారు. గమనించిన స్థానికులు కొంత మంది సమీపంలోని పాలశీతలీకరణ కేంద్రం నుంచి నీళ్లు తీసుకువచ్చి వేంటనే మంటలపై నీళ్లు చల్లుతూ, బండి క్రింద ఉన్న సిలిండర్‌ను తొలగించారు. ఈ సంఘటనలో పానీపూరి బండి యాజమాని కమలేష్‌తో పాటు, అతని కుమారుడికి స్వల్ఫంగా గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు, సమీపంలోని చిరువ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. -
‘అంతా’ చెట్ల వెనకాలే..!
సాక్షి, కల్వకుర్తి రూరల్: నేరాలు, అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకునేందుకు పోలీసులు నిరంతరం నిఘా పెట్టడటంతో పాటు నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. సమాజంలో పెరిగిపోయిన నేర ప్రవృత్తి, అశ్లీలత వెరసి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దోహదం చేస్తుంది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన బొక్కలకుంట కట్ట పట్టణంలోని కూరగాయల మార్కెట్ నుంచి హైదరాబాద్ చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో ఉంది. రహదారి రద్దీగా ఉంటుంది. కట్టపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ పక్కన ఖాళీ వ్యవసాయ పొలంలో పెద్ద ఎత్తున కంపచెట్లు పెరిగిపోయాయి. రోడ్డు పక్కన చూస్తే కంపచెట్లే కనిపిస్తాయి. ఆ కంప చెట్ల వెనకాల చట్టవ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ విషయమై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు వెళ్లిన సంఘటనలున్నాయి. పోలీస్ వాహనం వచ్చేలోగా అక్కడ ఉన్నవారు పరారవుతుంటారు. యువతే ఎక్కువ కంపచెట్ల వెనకాల జోరుగా జూదం ఆడుతున్నారు. మొత్తం 30ఏళ్లలోపు లోపు యువత ఈ జూదానికి సంబంధించిన పేకాట, చిత్తుబొత్తులకు బానిసలవుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతుంది. చీకటి పడితే చాలు జూదంతో పాటు ఆ చెట్ల మధ్య వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఇందులోనూ ఒక వర్గానికి చెందిన యువకులు ఎక్కువగా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొద్ది మంది వ్యభిచారినులు ఆ చుట్టు పక్కల సంచరిస్తూ విటులను ముఖ్యంగా యువతను పెడదోవ పట్టించడంతో పాటు ఆ ప్రాంతంలోని వారికి సమస్యలు సృష్టిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం కుంట కట్టపై కంప చెట్ల వెనకాల జరుగుతున్న అసాంఘిక కార్యక్రలాపాలపై నిఘా పెంచుతాం. సమాచారం అందిస్తే దాడులు చేసి అడ్డుకుంటాం. చర్యలు తీసుకుంటాం. నర్సింహులు,ఎస్ఐ, కల్వకుర్తి -
పంటలెండుతున్నయ్.. పట్టించుకోండి
సాక్షి, కల్వకుర్తి రూరల్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఎండిపోతున్నాయి.. కేఎల్ఐ సాగునీరు వస్తుందనుకుంటే నిరాశే మిగిలింది.. నీళ్లందక కళ్లముందే పంటలు వాడుపట్టి పోతుంటే చూడలేకపోతున్నాం.. అధికారులు వెంటనే సాగునీరందించి పంటలను కాపాడాలి.. అని శనివారం తిమ్మరాశిపల్లి, జంగారెడ్డిపల్లి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. కల్వకుర్తి-అచ్చంపేట రహదారిపై తిమ్మరాశిపల్లి గేటు ఎదుట రాస్తారోకో నిర్వహించారు. నాలుగు రోజులుగా నీరందక సాగు చేసిన వేరుశెనగ, వరి పంటలు ఎండిపోయే దశకు చేరాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశెనగ గింజ పట్టే దశలో ఉందని, ఇప్పుడు నీరందక పోతే పంట దిగుబడి తగ్గిపోతుందని తెలిపారు. చివరి ఆయకట్టు అయిన జంగారెడ్డిపల్లి వరకు నీరు రాకుండా ఎగువ ప్రాంతాల్లో కాలువలను ధ్వంసం చేసి నీటిని వృథా చేస్తున్నారని, దీంతో వేలాది ఎకరాల్లో లక్షలాది రూపాయలు పెట్టి సాగుచేసిన పంటలు చేతికందకుండా పోయే ప్రమాదం ఉందని కన్నీళ్ల పర్యంతమయ్యారు. అందరికీ న్యాయం చేయాలంటే కాలువలను ధ్వంసం చేయకుండా నిఘా పెట్టించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నర్సింహులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలాగే వారి ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సంఘీభావం ప్రకటించారు. అక్కడినుంచే కేఎల్ఐ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సాగునీరందించేలా చూస్తామని వారు భరోసా ఇవ్వడంతో అదే విషయాన్ని రైతులకు చెప్పి ఆందోళన విరమింపజేశారు. -
కేటీఆర్ హామీతో అలకవీడిన ఎమ్మెల్సీ
సాక్షి, నాగర్ కర్నూలు: టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు పూర్తి కావస్తున్న ఆ పార్టీని అసమ్మతి సెగలు వీడటం లేదు. అసమ్మతి రాగం అందుకున్న కొందరు నేతలను టీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించిగా.. మరికొందరు నేతలు మాత్రం పార్టీని వీడిన సంగతి తెలిసిందే. కల్వకుర్తి టికెటు విషయంలో మనస్తాపం చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఓ దశలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్టు కూడా ప్రచారం జరిగింది. గతంలో అపద్దర్మ మంత్రి కేటీఆర్ నారాయణరెడ్డిని బుజ్జగించినప్పటికీ ఫలితం లేకపోయింది. నారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే.. కల్వకుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్‌కు గట్టి షాక్ తగిలే అవకాశాలు ఉండటంతో కేటీఆర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కేటీఆర్ గురువారం మరోసారి నారాయణరెడ్డితో సంప్రదింపులు జరిపారు. నారాయణరెడ్డితో భేటీ అయిన కేటీఆర్ భవిష్యత్తులో ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. దీంతో అలకవీడిన నారాయణరెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్‌ను గెలిపించుకుంటామని తెలిపారు. అనంతరం కేటీఆర్‌తో కలిసి కల్వకుర్తిలో జరిగే టీఆర్ఎస్ బహిరంగసభకు బయలుదేరి వెళ్లారు. -
కొత్త వ్యక్తులకు ఆశ్రయమివ్వొద్దు
వెల్దండ (కల్వకుర్తి): హైదరాబాద్– శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న కొట్రతండాపై ప్రత్యేక దృష్టి సారించామని, గ్రామస్తులు ఎవరూ కొత్త వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని ఏఎస్పీ జోగుల చెన్నయ్య అన్నారు. మండలంలోని కొట్రతండాలో ఆదివారం అర్ధరాత్రి ఏఎస్పీ జోగుల చెన్నయ్య, కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డి ఆధ్వర్యంలో 30 మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంపై పోలీస్ నిఘా ఉంచుతున్నామన్నారు. ప్రధాన జాతీయ రహదారులపై ఉన్న గ్రామాలు, తండాలు, పట్టణాలకు ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. కొత్త వ్యక్తులకు ఆశ్రమం కల్పించ వద్దన్నారు. రౌడీ షీటర్లుగా పేరున్న వ్యక్తులతో సంబంధాలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుల తనిఖీలో అలాంటి వ్యక్తులను గుర్తిస్తే తండావాసులు ఇబ్బందులు పడతారన్నారు. తండాలో అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపించిన వెంటనే సమీపంలో పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాగే అక్రమంగా మద్యం, అధిక మొత్తంలో డబ్బులు నిల్వ ఉంచితే చర్యలు తీసుకుంటామన్నారు. క్షుణ్ణంగా తనిఖీలు.. కార్డెన్ సెర్చ్‌లో భాగంగా బృందాలుగా విడిపోయిన పోలీసులు ప్రతి ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతిఒక్కరి గుర్తింపు కార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి గుర్తింపు పత్రాలు లేని 19 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని.. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాహనదారులు వీటికి సంబంధించిన పత్రాలను, లైసెన్స్‌లను చూపించితే తీసుకెళ్లాలని సూచించారు. అలాగే గ్రామంలోని పలు కిరాణం షాపుల్లో మద్యం లభించడంతో దుకాణదారులను హెచ్చరించారు. ఇకపై ఇలాంటివి కనిపిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో వెల్దండ, కల్వకుర్తి సీఐలు గిరికుమార్ కల్కోట, సురేందర్‌రెడ్డి, ఆయా మండలాల ఎస్ఐలు వీరబాబు, ప్రదీప్, కృష్ణయ్య, నర్సింహ, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కల్వకుర్తి స్వతంత్ర అభ్యర్థిగా కసిరెడ్డి?
ఆమనగల్లు(కల్వకుర్తి) : కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీచేయనున్నారు. ఈ మేరకు ఆయన తన అనుచరులకు సంకేతాలు ఇచ్చారు. మాడ్గుల మండలం కొల్కులపల్లి గ్రామం నుంచి గురువారం కసిరెడ్డి నారాయణరెడ్డి పరోక్షంగా ప్రచారం ప్రారంభించారు. కల్వకుర్తి అసెంబ్లీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను పార్టీ ప్రకటించడంతో కసిరెడ్డి నారాయణరెడ్డి మనస్థాపానికి గురయ్యారు. మంత్రి కేటీఆర్ స్వయంగా బుజ్జగించినా ఆయన మెత్తబడలేదు. తన అనుచరుల ఒత్తిడితో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కసిరెడ్డి సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీగా విస్తృత పర్యటనలు కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆ వెంటనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించారు. నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని కసిరెడ్డి నారాయణరెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. టికెట్ రాకపోవడంతో... ఈ ఎన్నికల్లోనూ కల్వకుర్తి నుంచి పోటీ చేయడానికి కసిరెడ్డి నారాయణరెడ్డి ఆసక్తి చూపించారు. కానీ టీఆర్ఎస్ అధిష్టానం టికెట్‌ను జైపాల్‌యాదవ్‌కు కేటాయించింది. అప్పటి నుంచి కసిరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు. అయితే, రెండు మూడు రోజులుగా నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి ముఖ్యనాయకులతో కసిరెడ్డి రహస్య సమావేశాలు నిర్వహించి అనుచరుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. -
దాడులు చేస్తే బుద్ధిచెబుతాం
కల్వకుర్తి టౌన్ : అగ్రకుల నాయకులు బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల నాయకులపై దాడి చేస్తే బుద్ధి చెబుతామని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అన్నారు. వారుచేసే వ్యాపారంలో తగినంత ఓర్పు, సహనం ఉంటేనే చేయాలని, లేదంటే మానుకోవాలని చెప్పారు. బీసీ సంఘాలు, కులసంఘాల, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆదివారం కల్వకుర్తిలోని పాలమూరు చౌరస్తాలో దాదాపు మూడు గంటలకు పైగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తరంజన్‌దాస్ మాట్లాడారు. దాడి చేయడమే కాకుండా, తమకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేయటం దారుణమని అన్నారు. అమరావతి బార్ యజమానులు మండలంలోని తిమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను వెంబండించి కొట్టడం దారు ణమని బీసీ సంఘాల నాయకులు అన్నారు. వెల్దండ మండలం వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. దెబ్బలుతిన్న వారిని ప రామర్శించకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పూనుకుంటాం అమరావతి బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు సమయంలో అదే ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని, అయినా వినకుండా ఏర్పాటు చేశారని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఓ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ భాగస్వామిగా ఉంటూ, తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు. కల్వకుర్తి ఘటనను రాష్ట్రవ్యాప్త ఆందోళనగా మార్చుతామని బీసీ నాయకులు పేర్కొన్నారు. ఈ ఘటన విషయంలో డీఎస్పీ చొరవ అభినందించదగినదని అన్నారు. కానీ డీఎస్పీని స్థానిక ప్రజాప్రతినిధి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఆయన దురహంకారానికి నిదర్శనమని అన్నారు. డీఎస్పీతో సమావేశం పోలీసుల సూచనలతో ధర్నా విరమించిన బీసీ సంఘాల నాయకులతో కల్వకుర్తి డీఎస్పీ ఎల్సీ నాయక్, నాగర్‌కర్నూల్ డీఎస్పీ లక్ష్మీనారాయణ సమావేశం నిర్వహించారు. పట్టణాన్ని ప్రశాంత వాతావరణంలో ఉంచుదామని, దానికి అందరూ సహకరించాలని కోరారు. ముగ్గురు యువకులపై 20మందికి పైగా దాడిచేశారని, వారందరినీ అరెస్టు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. డీఎస్పీలు మాట్లాడుతూ వారిని కూడా పట్టుకుంటామని చెప్పారు. ధర్నా కార్యక్రమంలో బీసీ సబ్‌ప్లాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లె గోపాల్, బీఎల్ఎఫ్ పార్లమెంట్ సమన్వయకర్త ప్రొఫెసర్ వెంకటదాసు, ఓబీసీ నేత పైళ్ల ఆశయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బాలాజీ సింగ్, బీసీ నాయకులు బాలస్వామి గౌడ్, జంగయ్య, కేవీపీఎస్ నాయకులు, వడ్డెర కుల సంఘ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
'రాకుండా అడ్డుకోవడానికి నీ జాగిరా'
నాగర్ కర్నూల్: ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ప్రశ్నించే హక్కు, అర్హత కానీ వంశీచంద్ కు లేదని జూపల్లి అన్నారు. ఇన్నాళ్లు కల్వకుర్తి ప్రాంతానికి నీళ్లు రాకపోవడానికి కాంగ్రెస్సే కారణమన్నారు. ఈ ఏడాది కల్వకుర్తి ప్రాంతానికి సాగు నీరిచ్చి తీరుతామని ఆయన తెలిపారు. తనను రాకుండా అడ్డుకోవడానికి నీ జాగిరా అని జూపల్లి ఎమ్మెల్యే పై మండిపడ్డారు. వంశీచంద్ రెడ్డి సొంతూరు అప్పారెడ్డిపల్లికి వచ్చి మీటింగ్ పెడతామని మంత్రి జూపల్లి అన్నారు. -
భార్యపై కత్తితో దాడి
► ఉస్మానియాలో చికిత్స పొందుతున్న బాలు ► ఆమనగల్లు పట్టణం ప్రేమ్‌నగర్ కాలనీలో ఘటన ఆమనగల్లు(కల్వకుర్తి): కట్టుకున్న భార్యను ఓ భర్త కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన ఆమనగల్లు పట్టణం ప్రేమ్‌నగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఎస్ఐ రామలింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ప్రేమ్‌నగర్ కాలనీకి చెందిన మీసాల రాజుకు నాలుగు సంవత్సరాల క్రితం అదే కాలనీకి చెందిన బాలు అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర పాప కూడా ఉంది. బాలును భర్త రాజుతో పాటు అత్తామామలు, మరిది వేధింపులకు గురిచేసేవారు. దీనికి తోడు భర్త రాజు మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకుని భార్యతో నిత్యం గొడవపడేవాడు. ఈ విషయమై బుధవారం రాత్రి బాలు, రాజుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన గుట్టు భార్యకు తెలిసిపోయిందని తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో భార్యపై రాజు కత్తితో దాడి చేసి ఆమె మెడను తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలపాలైన బాలును కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దాడికి యత్నించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బాధిరాలి సోదరుడు గోపి ఫిర్యాదు మేరకు భర్త మీసాల రాజు, వారి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా హత్యాయత్నానికి పాల్పడిన మీసాల రాజు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
నాగర్‌కర్నూల్ జిల్లా సమగ్ర స్వరూపం
నాగర్‌కర్నూల్ కలెక్టర్ : ఈ.శ్రీధర్ ఎస్పీ : కల్మేశ్వర్ సింగనార్ ఇతర ముఖ్య అధికారులు డీఈవో: జనార్దన్‌రావు డీఎంహెచ్‌వో: సుధాకర్లాల్ జిల్లా జనాభా: 8,60,613 విస్తీర్ణం: 6,924 చదరపు కిలోమీటర్లు మండలాలు: 20 నాగర్‌కర్నూల్, తాడూరు, బిజినేపల్లి, తిమ్మాజిపేట, తెలకపల్లి, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, అచ్చంపేట, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, బల్మూర్, లింగాల, కల్వకుర్తి, ఊర్కొండపేట, వెల్దండ, వంగూరు, చారగొండ రెవెన్యూ డివిజన్లు: 3 (నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట) మున్సిపాలిటీలు: 4 (నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి), గ్రామ పంచాయతీలు: 329 ఎంపీ: నంది ఎల్లయ్య (నాగర్‌కర్నూల్) ఎమ్మెల్యేలు: జూపల్లి కష్ణారావు (కొల్లాపూర్), గువ్వల బాలరాజు (అచ్చంపేట), వంశీచంద్‌రెడ్డి (కల్వకుర్తి), మర్రి జనార్దన్‌రెడ్డి (నాగర్‌కర్నూల్) నీటి పారుదల: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్ వద్ద 8.61 టీఎంసీలు, వట్టెం వద్ద 16.58 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు పర్యాటకం: నల్లమల అటవీ ప్రాంతం, సోమశిల పురాతన శివాలయాలు, మాధవస్వామి దేవాలయం, అచ్చంపేట ఉమా మహేశ్వరక్షేత్రం, రంగాపూర్ ఉర్సు, సలేశ్వర క్షేత్రం, మల్లెలతీర్థం, కల్వకుర్తిలో సిర్సనగండ్ల సీతారామస్వామి ఆలయం, ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయం, వట్టెం వేంకటేశ్వరస్వామి ఆలయం, నందివడ్డెమాన్ పురాతన ఆలయాలు, శనైశ్వర క్షేత్రం, పాలెం వెంకటేశ్వరస్వామి దేవాలయం, జటప్రోల్ ఆలయాలు, సప్త నదుల సంగమ క్షేత్రం హైదరాబాద్ నుంచి దూరం: 120 కిలోమీటర్లు ఖనిజాలు: ఇనుము