మాట్లాడుతున్న మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్
ఆచారి దీక్షకు స్పందన
Published Sat, Sep 10 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
కల్వకుర్తి / కల్వకుర్తి రూరల్ : రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను నెరవేర్చాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలకు స్పందన వచ్చింది. శనివారం కల్వకుర్తి పట్టణం ర్యాలీలు, నినాదాలతో దద్దరిల్లింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరింది. ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుర వీధుల గుండా ర్యాలీలు నిర్వహిస్తూ దీక్ష శిబిరం వద్దకు చేరుకుని మద్దతు ప్రకటించారు. ముస్లిం మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో బైక్‌లు, ఆటోలు, ఇతర వాహనాలతో ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. డ్రై వర్స్ అసోసియేషన్, పద్మశాలీసంఘంతోపాటు భవన నిర్మాణ కార్మికులు సైతం ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పాల్గొన్నారు. దుందుభీ కళాకారుల బందం దీక్ష శిబిరాన్ని ఆటపాటలతో ఉర్రూత లూగించింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement