Achari
-
ఆచారి దీక్షకు స్పందన
కల్వకుర్తి / కల్వకుర్తి రూరల్ : రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను నెరవేర్చాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలకు స్పందన వచ్చింది. శనివారం కల్వకుర్తి పట్టణం ర్యాలీలు, నినాదాలతో దద్దరిల్లింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరింది. ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుర వీధుల గుండా ర్యాలీలు నిర్వహిస్తూ దీక్ష శిబిరం వద్దకు చేరుకుని మద్దతు ప్రకటించారు. ముస్లిం మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో బైక్‌లు, ఆటోలు, ఇతర వాహనాలతో ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. డ్రై వర్స్ అసోసియేషన్, పద్మశాలీసంఘంతోపాటు భవన నిర్మాణ కార్మికులు సైతం ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పాల్గొన్నారు. దుందుభీ కళాకారుల బందం దీక్ష శిబిరాన్ని ఆటపాటలతో ఉర్రూత లూగించింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు. -
విమోచన దినాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి
భూత్పూర్: తెలంగాణ ప్రాంతానికి రజాకార్ల నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విముక్తి దినంగా ప్రకటించి ఆ రోజున వేడుకలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ ఆచారి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేఎంఆర్ ఫంక్షన్ హల్లో జరిగిన పార్టీ జిల్లా స్థాయి పథాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఓట్ల బ్యాంకు రాజకీయాలు, మతోన్మాదశక్తులకు భయపడి వెనక్కి జరిగితే బీజేపీ పార్టీ తన సత్తాను చాటుతుందన్నారు. జిల్లాలోని అప్పంపల్లి తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిగా జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో తిరంగా యాత్రను నిర్వహించి ప్రభుత్వ చేతగాని తనంపై ప్రచారం చేస్తామని ఆయన హెచ్చారించారు. పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి బూతు అధ్యక్షుడు నుంచి తెలంగాణ సీఎంకు పోస్టుకార్డు ద్వారా తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కనువిప్పు కలిగేలా ఉత్తరాలు రాస్తామన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీవర్ధన్‌రెడ్డి, పడాకుల బాల్‌రాజు, మాంగ్యానాయక్, జిల్లా నాయకులు సుదర్శన్‌రెడ్డి, కర్ణాకర్‌రెడ్డి, రవిందర్‌రెడ్డి, గాల్‌రెడ్డి, మండల అధ్యక్షులు నర్సిములు తదితరులు పాల్గొన్నారు. -
విమోచన దినాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి
భూత్పూర్: తెలంగాణ ప్రాంతానికి రజాకార్ల నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విముక్తి దినంగా ప్రకటించి ఆ రోజున వేడుకలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ ఆచారి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేఎంఆర్ ఫంక్షన్ హల్లో జరిగిన పార్టీ జిల్లా స్థాయి పథాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఓట్ల బ్యాంకు రాజకీయాలు, మతోన్మాదశక్తులకు భయపడి వెనక్కి జరిగితే బీజేపీ పార్టీ తన సత్తాను చాటుతుందన్నారు. జిల్లాలోని అప్పంపల్లి తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిగా జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో తిరంగా యాత్రను నిర్వహించి ప్రభుత్వ చేతగాని తనంపై ప్రచారం చేస్తామని ఆయన హెచ్చారించారు. పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి బూతు అధ్యక్షుడు నుంచి తెలంగాణ సీఎంకు పోస్టుకార్డు ద్వారా తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కనువిప్పు కలిగేలా ఉత్తరాలు రాస్తామన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీవర్ధన్‌రెడ్డి, పడాకుల బాల్‌రాజు, మాంగ్యానాయక్, జిల్లా నాయకులు సుదర్శన్‌రెడ్డి, కర్ణాకర్‌రెడ్డి, రవిందర్‌రెడ్డి, గాల్‌రెడ్డి, మండల అధ్యక్షులు నర్సిములు తదితరులు పాల్గొన్నారు.