సాక్షి, హైదరాబాద్: 18 ఏళ్లకే గ్రామ సర్పంచ్ అయ్యి.. మరోవైపు పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్న తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్‌ను తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పొగడ్తలతో ముంచెత్తారు. కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి సాదరంగా స్వాగతించడమే కాకుండా.. పెద్ద పదవి గ్యారెంటీగా ఇస్తామని తెలంగాణ భవన్ నుంచి హామీ ఇచ్చారాయన.
కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్, ఇతర పార్టీ కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో ఇవాళ కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘వెంకటేశ్‌ను గత వారమే కలిశాను. తన రాజకీయ జీవితం ఏంటి అని అడిగాం. 18 ఏళ్లకే సర్పంచ్ అయ్యాను అని చెప్పాడు. పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నడు. కచ్చితంగా బీ ఆర్ ఎస్ అండ మీ అండ మీకు ఉంటుంది. వుప్పల వెంకటేష్ గ్యారెంటీగా పెద్ద పదవి ఇస్తామని హామీ ఇచ్చారాయన. తలకొండపల్లి కి వస్తాను., మీ సత్తా చూస్తాను అంటూ ఉప్పల వెంకటేశ్‌ను ఉద్దేశించి కేటీఆర్ చమత్కరించారు.
కేటీఆర్ హాట్ కామెంట్లు
బీఆర్‌ఎస్‌లో టికెట్ కేటాయింపులపైనా కేటీఆర్ హాట్ కామెంట్లు చేశారు. ‘‘ఒక నియోజకవర్గంలో ఎందరో టికెట్లు ఆశిస్తారు. కానీ, అందరికీ ఇవ్వలేం. ఎవరో ఒక్కరికే టికెట్ ఇస్తారు. ఒకటే నియోజకవర్గం, ఒకటే సీటు, ఒకటే బీఫామ్. ఆశలు, విబేధాల్ని పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయండి. పార్టీ ప్రకటించిన అభ్యర్థిని అందరూ సమిష్టిగా గెలిపించుకోవాలి. కేసీఆర్‌ను హ్యాట్రిక్‌సీఎంను చేయాలి అని బీఆర్‌ఎస్ శ్రేణుల్ని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇది సంక్షేమ ప్రభుత్వం
‘‘రాష్ట్రంలో 9ఏళ్లుగా ఇంటింటికి సంక్షేమ పథకం ఇస్తున్నాం. పుట్టిన బిడ్డ నుంచి,వృద్ధుల వరకు అందరికీ సంక్షేమం అందుతోంది. కేసీఆర్ కిట్, చదువులకు ఆర్ధిక సాయం, పెన్షన్లు, కల్యాణలక్ష్మి, సొంత భూమి కలిగిన వారికి గృహలక్ష్మి, ఉద్యోగాలు,రైతు బంధు, చేనేత మిత్ర, గొర్రెల పంపిణీ ఇలా అనేక పథకాలు అందిస్తున్నాం. 76 యేళ్లు అయ్యింది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఇన్నేళ్లలో ఎందుకు గత ప్రభుత్వాలు ఇంటింటికి నీళ్ళు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు’’ అని కేటీఆర్ మాట్లాడారు.
రేవంత్‌పై సెటైర్లు
‘‘ప్రతిపక్ష పార్టీలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారు. 4వేల పెన్షన్లు, 25 గంటల కరెంట్ ఇస్తాం అంటున్నారు. ఇన్నేళ్లు ఎందుకు ఇవ్వలేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఒకాయన అడుక్కుంటున్నడు. బీజేపీ అధికారం లోకి వస్తె కేసిఆర్ పథకాలు కొనసాగిస్తాం అని బీజేపీ నాయకులు అంటున్నారు. కేసీఆర్ పథకాలు కొనసాగించాకా మీరెందుకు. సంపద పెంచాలి,పేదలకు పంచాలి మా నినాదం. కానీ సంపద పెంచుకొని, వెనక వేసుకోవాలి అనేది ప్రతిపక్షాల తీరు. సంచులు మోసినా వాడు కూడా నీతులు పలుకుతున్నాడు. సంచులు మోసి, జైల్లో చిప్ప కూడు తిన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. పీసీసీ పదవి అదొక పదవా? ప్రైమ్ మినిస్టర్ పదవి అయినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. వీళ్లకు అభ్యర్థులే లేరు, వీళ్లకు ఓటు ఎలా వేస్తారు?.
కేసీఆర్‌నే జైలుకు పంపుతరా?
మహబూబ్ నగర్ ను సస్యశ్యామలం చేస్తాం. కల్వకుర్తి ప్రజలు చాలా తెలివి గల వారు. మీతో పెట్టుకున్నోడు ఎవడు బాగు పడలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు బాగా చెప్తున్నారు. కాంగ్రెస్ హయం లో కరెంట్ కోసం కష్టపడే వాళ్ళం. వీళ్ళను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టే. వీళ్ళను నమ్మకండి. బీజేపీ అధికారం లోకి వస్తే అందరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తాం అన్నాడు మోదీ. పడ్డయా?. కానీ కేసిఆర్ రైతు బంధు, పెన్షన్లు, ఇలా అనేక పథకాలు అమలు చేశారు. కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణ కు ఉండాలి, ఢిల్లీ నేతల మాటలు పట్టుకుంటే మాటిమాటికీ ఢిల్లీ వెళ్ళాలి. తెలంగాణ ఆత్మగౌరవానికి, ఢిల్లీ గులాంగురికి మధ్య జరుగుతున్న పోటీ. బీజేపీ ది హిందు ముస్లిం మధ్య చిచ్చు పెట్టడమే పని. కేసీఆర్ ను జైలుకు పంపుతాం అన్నవాడే షెడ్డుకు పోయాడు. కేసీఆర్ ఎందుకు జైలుకు పంపుతావు?. కళ్యాణ లక్ష్మీ, రైతు వందుజ్ ఆడబిడ్డ పుడితే నగదు ఇస్తున్నందుకు జైలుకు పంపుతారా?. మీ నియోజకవర్గ అభివృద్ది కి మాది బాధ్యత అని ప్రజలకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ టికెట్ ఎవరికి వచ్చిన వారికి మద్దతుగా నిలవాలి గెలిపించుకోవాలి. మహబూబ్ నగర్ లో 14 స్థానాలు బీ ఆర్ ఎస్ గెలవాలి అని పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి కేటీఆర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment