ఎన్‌హెచ్‌గా కోదాడ-కల్వకుర్తి మార్గం | NH kodada - KALWAKURTHY way | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌గా కోదాడ-కల్వకుర్తి మార్గం

Published Wed, Apr 29 2015 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM

NH kodada - KALWAKURTHY way

కేంద్రానికి ఎంపీ గుత్తా విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కోదాడ-మిర్యాలగూడ-దేవరకొండ-కల్వకుర్తి రోడ్డు మార్గాన్ని జాతీయ రహదారిగా అభివృద్ధిపరచాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభలో ఆయన ఈ అంశాన్ని ప్రత్యేక ప్రస్తావనల కింద కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ‘దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను అమలు చేస్తే ఇది వెనకబడిన ప్రాంతాల అభ్యున్నతికి, పారిశ్రామికరంగ అభివృద్ధికి, పర్యాటక కేంద్రాల అనుసంధానానికి దోహదపడుతుంది.

ఈ అంశంపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రికి చాలాసార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు పంపింది. అందువల్ల తక్షణం దీనిని జాతీయ రహదారిగా ప్రకటించి ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిధులు కేటాయించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది’ అని గుత్తా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement