ఐఐఎస్‌కు కల్వకుర్తి విద్యార్థి | kalwakurthy student selected to IIS | Sakshi

ఐఐఎస్‌కు కల్వకుర్తి విద్యార్థి

Published Wed, Aug 10 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

సంతోష్‌ ఉదయ్‌కుమార్‌

సంతోష్‌ ఉదయ్‌కుమార్‌

అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనతో కష్టపడి చదివి ఓ విద్యార్థి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌) ఎంపికయ్యాడు.

కల్వకుర్తి రూరల్‌ : అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనతో కష్టపడి చదివి ఓ విద్యార్థి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌) ఎంపికయ్యాడు. కల్వకుర్తి కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న సంతోష్‌ ఉదయ్‌కుమార్‌ మొక్కవోని దీక్షతో ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఐఐఎస్‌ బెంగళూరులో జూనియర్‌ సైంటిస్ట్‌గా ఎంపికయ్యాడు. సంతోష్‌ ఇంటర్మీడియెట్‌ ఫిజిక్స్‌ పరీక్షలో ఫెయిలై అదే ఫిజిక్స్‌ శాస్త్రవేత్త కావాలనే ధృడసంకల్పంతో విద్యనభ్యసించి ఆ లక్ష్యాన్ని చేరుకోవడంపై ఉపాధ్యాయులు, తోటి స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. 2015లో నిర్వహించిన పీజీ ఎంట్రెన్స్‌ ఫిజిక్స్‌ విభాగంలో 36వ ర్యాంకు సాధించి ఓయూలో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో చేరి సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్‌ మొదటి సంవత్సరం చదువుతూ ఐఐఎస్‌ ఎంట్రెన్స్‌ రాశాడు. రాష్ట్రంలోనే ఏకైక వ్యక్తిగా ఐఐఎస్‌ బెంగళూరుకు ఎంపికై తన సత్తాను చాటాడు. ఉదయ్‌ది తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామం. తమ కళాశాలలో చదివి ఉన్నత స్థానానికి ఎదిగిన ఉదయ్‌కుమార్‌ను కళాశాల ప్రిన్సిపాల్‌ యాజమాన్యం, అధ్యాపకులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement