IIS
-
‘మోదీ, షా’ విజన్ ఎంతో గొప్పది : రతన్ టాటా
న్యూఢిల్లీ : ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం, టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్ రతన్ టాటా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్‌పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా గొప్ప విజన్ కలిగిన నాయకులంటూ కొనియాడారు. బుధవారం గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్(ఐఐఎస్) పారిశ్రామికవేత్త రతన్ టాటా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోదీ, అమిత్ షా దూరదృష్టి గల నాయకులని ప్రశంసించారు. దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లడానికి మోదీ, షా ఎన్నో దూరదృష్టి గల నిర్ణయాలను తీసుకున్నారన్నారు. విజన్ కలిగిన నాయకులకు మద్దతిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మోదీ, షా నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతంగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొనడం విశేషం. సింగపూర్ ఐటీఈఎస్ నమూనాలో ప్రారంభమయ్యే ఈ సంస్థలు నేషనల్ స్కిల్ డెవలప్మంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీఎస్) నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో పనిచేస్తాయి. గాంధీనగర్‌లో ప్రారంభమయ్యే సంస్థలో రక్షణ, ఏరోస్పేస్, చమురు తదితర అంశాలలో శిక్షణ ఇస్తారు. మానవ వనరులను సమృద్దిగా ఉపయోగించడమే ఈ సంస్థలు లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. టాటా గ్రూప్ ఐఐఎస్‌కు భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు ఐఐఎస్‌ను ప్రారంభించింది. కాన్పూర్, మొంబైలలో ఐఐఎస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. -
దేశంలోనే అత్యుత్తమమైన ‘బయోనెస్ట్’
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ‘బయోనెస్ట్’పేరిట ఏర్పాటు చేసిన బయో–ఇంక్యుబేటర్ దేశంలోనే అత్యుత్తమమైందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్) మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.పద్మనాభన్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని హెచ్‌సీయూలో స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహకారంతో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద బయో–ఇంక్యుబేటర్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను దేశంలో అత్యుత్తమమైన 5 బయో ఇంక్యుబేటర్లను పరిశీలించానని, కానీ ఇంత అత్యాధునిక సౌకర్యాలు, విశాల స్థలం కలిగి ఉన్నది మరెక్కడాలేదన్నారు. తాను 5 వేల పరిశోధక ప్రతిపాదనలను చేశానని, అందులో 700 ప్రతిపాదనలు 500 పరిశ్రమల్లో ఆపరేషన్ అవుతున్నాయని చెప్పారు. ఇవన్నీ 100 ప్రొడక్టులుంటాయని, అందులో 50 వ్యాపారాత్మకమైనవని గుర్తుచేశారు. దేశంలోని ప్రభుత్వ సంస్థల్లో 1,000 రీసెర్చ్ లేబరేటరీస్ ఉన్నాయని, వాటిల్లో ఇంక్యుబేషన్ సౌకర్యాలు కల్పించి స్టార్టప్‌లను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. మహిళా పరిశోధక విద్యార్థులు స్టార్టప్‌లను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారాలని సూచించారు. 30 స్టార్టప్‌లకు అవకాశం.. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బయో–ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేశామని హెచ్‌సీయూ వీసీ ప్రొఫెసర్ అప్పారావు పొదిలె, ప్లాంట్ సైన్సెస్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ పి.రెడ్డన్న వెల్లడించారు. దీనిలో 30 వరకు స్టార్టప్‌లకు అవకాశం ఉంటుందని.. 350కి పైగా పీహెచ్డీ స్కాలర్ విద్యార్థులు, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో న్యూయార్క్ మౌంట్ సినాయ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఈసీటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఇ.ప్రేమ్‌కుమార్‌రెడ్డి, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ బి.సెంథిల్ కుమరన్ తదితరులు పాల్గొన్నారు. -
ఐఐఎస్‌కు కల్వకుర్తి విద్యార్థి
కల్వకుర్తి రూరల్ : అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనతో కష్టపడి చదివి ఓ విద్యార్థి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) ఎంపికయ్యాడు. కల్వకుర్తి కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న సంతోష్ ఉదయ్‌కుమార్ మొక్కవోని దీక్షతో ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఐఐఎస్ బెంగళూరులో జూనియర్ సైంటిస్ట్‌గా ఎంపికయ్యాడు. సంతోష్ ఇంటర్మీడియెట్ ఫిజిక్స్ పరీక్షలో ఫెయిలై అదే ఫిజిక్స్ శాస్త్రవేత్త కావాలనే ధృడసంకల్పంతో విద్యనభ్యసించి ఆ లక్ష్యాన్ని చేరుకోవడంపై ఉపాధ్యాయులు, తోటి స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. 2015లో నిర్వహించిన పీజీ ఎంట్రెన్స్ ఫిజిక్స్ విభాగంలో 36వ ర్యాంకు సాధించి ఓయూలో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో చేరి సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ మొదటి సంవత్సరం చదువుతూ ఐఐఎస్ ఎంట్రెన్స్ రాశాడు. రాష్ట్రంలోనే ఏకైక వ్యక్తిగా ఐఐఎస్ బెంగళూరుకు ఎంపికై తన సత్తాను చాటాడు. ఉదయ్‌ది తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామం. తమ కళాశాలలో చదివి ఉన్నత స్థానానికి ఎదిగిన ఉదయ్‌కుమార్‌ను కళాశాల ప్రిన్సిపాల్ యాజమాన్యం, అధ్యాపకులు అభినందించారు. -
ఎలక్ట్రిక్ బస్సులతో ఆదాయం కూడ ఎక్కువే!
బెంగళూరుః ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్యాన్ని నివారించడానికే కాక, డీజిల్ బస్సుల కన్నా అత్యధిక లాభాన్ని చేకూరుస్తాయంటున్నారు పరిశోధకులు. ఎలక్ట్రిక్ బస్సులతో రోజుకు 27 శాతం రెవెన్యూ పెరగడమే కాక, డీజిల్ బస్సులకంటే 82 శాతం లాభాలను కూడ చేకూర్చి పెడతాయని తమ అధ్యయాల్లో కనుగొన్నారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా ఇటీవల మెట్రోపాలిటన్ నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సుల వాడకాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మొదటిగా బెంగళూర్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) తమ రవాణా అవసరాలను తగ్గించడంతోపాటు... డీజిల్ బస్సులతో ఏర్పడే వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక ప్రయత్నంగా విద్యుత్ బస్సులను ఆవిష్కరించింది. దేశంలోనే మొదటిసారి జీరో ఎమిషన్ తో కూడిన పూర్తి ఎయిర్ కండిషన్డ్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. అర్బన్ ట్రాన్స్ పోర్ట్ కోసం ఎలక్ట్రానిక్ బస్సులపై జరిపిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) అధ్యయనాల్లో ఎలక్ట్రిక్ బస్సులు అత్యధిక ఆదాయాన్నితెచ్చి పెట్టడమే కాక, లాభాలను కూడ చేకూర్చి పెట్టేందుకు సహకరిస్తాయని తాజా అధ్యయనాలద్వారా తెలుసుకున్నారు. భారత నగరాల్లో రవాణాకు ఉపయోగించే సుమారు 150,000 డీజిల్ బస్సులనుంచి వచ్చే పొగ, కార్బన్ ఉద్గారాలు వాయుకాలుష్యాన్ని తీవ్రంగా పెంచుతున్నాయని, అవి భూగోళానికి తీరని నష్టాన్ని చేకూరుస్తుండటంతో ఐఐఎస్ అధ్యయనకారులు ఈ విషయంపై ప్రత్యేక అధ్యయనాలు చేపట్టారు. ఒక్కో డీజిల్ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మారిస్తే... సంవత్సరానికి సుమారు 25 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించవచ్చని బెంగళూరు దివేచా క్లైమేట్ ఛేంజ్ లోని షీలా రామ శేష సహా అధ్యయనకారుల బృందం తెలుసుకున్నారు. ఎలక్ట్రానిక్ బస్సులు CO2 ను విడుదల చేయవని, అయితే వాటిని ఛార్జింగ్ చేసేందుకు కావలసిన ఛార్జింగ్ స్టేషన్లకోసం ఇండియాలో విద్యుత్ శక్తికి ప్రధానమైన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు అవసరమని అన్నారు. అయితే అదే స్థానంలో బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లలో సోలార్ ప్యానెల్స్ ను స్థాపిస్తే సంవత్సరానికి ఒక్కోబస్సుతో మరో 25 టన్నుల CO2 ను నివారించవచ్చని కూడ వారు తెలిపారు. దేశంలో ఇప్పుడున్న 150,000 డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తే మొత్తం 3.7 మిలియన్ల కార్బన్ డై ఆక్సైడ్ ను నివారించవచ్చని తెలిపారు. కార్బన్ కాలుష్యం కారణంగా దేశంలో సంవత్సరానికి 670,000 లక్షల మంది చనిపోతున్నట్లు లెక్కల ప్రకారం తెలుస్తోందని, భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే మేజర్ పొల్యూటర్ గా మారుతోందని అధ్యయనకాలు తెలిపారు. -
ఐపీఓల కన్నా ఎఫ్‌డీలే మిన్న!
న్యూఢిల్లీ: గత పదేళ్లలో ఐపీఓల్లో కన్నా ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీలు) లోనే రాబడులు అధికంగా వచ్చాయని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఐఐఏఎస్ తెలిపింది. ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడమనేది జూదంగా మారిపోయిందని పేర్కొంది. పలు కంపెనీలు ఐపీఓల కోసం క్యూ కట్టిన నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడి కావడం విశేషం. 2003, ఏప్రిల్ 1 నుంచి 2014, జూలై మధ్యకాలంలో వచ్చిన 394 ఐపీఓలపై అధ్యయనం నిర్వహించిన ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.., 2003, ఏప్రిల్ నుంచి వచ్చిన ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లలో 60 శాతం మంది సొమ్ములు పూర్తిగా కరిగిపోయాయి. గత పదేళ్లలో వచ్చిన ఐపీఓల పనితీరు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచలేకపోయింది. ఐపీఓల్లో ఆఫర్ చేసిన ధర కంటే అధిక ధరకు ట్రేడవుతున్న కంపెనీలు 42 శాతంగానే (162) ఉన్నాయి. అయితే ఈ ఐపీఓల ద్వారా పెద్దగా రాబడులేమీ రాలేదు. బుల్ రన్‌లోనే ఐపీఓలకు ఈ స్థాయి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ కాలంలో వచ్చిన ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడానికి బదులుగా ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులే వచ్చేవి. పైగా పన్ను ప్రయోజనాలు కూడా దక్కేవి. 70 శాతం (245) కంపెనీల షేర్ల ధరలు ఆఫర్ ధర కంటే తక్కువగానే ట్రేడవుతున్నాయి. ఈ కాలంలో మొత్తం ఇరవై ప్రభుత్వ రంగ కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. వీటిల్లో నాలుగు కంపెనీలు(ఎంఓఐఎల్, ఎన్‌హెచ్‌పీసీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) షేర్ల ధరలు ఐపీఓ ఆఫర్ ధర కన్నా తక్కువగా ట్రేడవుతున్నాయి. తగిన నియమనిబంధనలను పాటించలేదన్న కారణంగా ఈ కాలంలో వచ్చిన మొత్తం ఐపీఓల్లో 25 కంపెనీల ట్రేడింగ్‌ను స్టాక్ ఎక్స్ఛేంజ్ లు నిలిపేశాయి.