'రాకుండా అడ్డుకోవడానికి నీ జాగిరా' | minister jupally krishna rao react on mla vamshi chand reddy | Sakshi
Sakshi News home page

'రాకుండా అడ్డుకోవడానికి నీ జాగిరా'

Published Sat, Jul 29 2017 3:05 PM | Last Updated on Tue, Oct 30 2018 5:28 PM

'రాకుండా అడ్డుకోవడానికి  నీ జాగిరా' - Sakshi

'రాకుండా అడ్డుకోవడానికి నీ జాగిరా'

నాగర్ కర్నూల్: ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ప్రశ్నించే హక్కు, అర్హత కానీ  వంశీచంద్ కు లేదని జూపల్లి అన్నారు. ఇన్నాళ్లు కల్వకుర్తి ప్రాంతానికి నీళ్లు రాకపోవడానికి కాంగ్రెస్సే కారణమన్నారు. ఈ ఏడాది కల్వకుర్తి ప్రాంతానికి సాగు నీరిచ్చి తీరుతామని ఆయన తెలిపారు. తనను రాకుండా అడ్డుకోవడానికి  నీ జాగిరా అని జూపల్లి  ఎమ్మెల్యే పై మండిపడ్డారు. వంశీచంద్ రెడ్డి సొంతూరు అప్పారెడ్డిపల్లికి వచ్చి మీటింగ్ పెడతామని మంత్రి జూపల్లి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement