పాలమూరుకు శత్రువు జూపల్లి: వంశీచంద్
పాలమూరుకు మొదటి శత్రువు మంత్రి జూపల్లి కృష్ణారావు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: పాలమూరుకు మొదటి శత్రువు మంత్రి జూపల్లి కృష్ణారావు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, మంత్రి జూపల్లిని ప్రజల్లోనే దోషిగా నిలబెడతానని హెచ్చరించారు. నల్లగొండకు, డిండికి నీళ్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదన్నారు.
జూపల్లి కృష్ణారావు గతంలో చెప్పిన ప్రకారమే నల్లగొండకు నీళ్లు ఇవ్వాలన్నారు. అయితే పాలమూరుకు అన్యాయం చేసే విధంగా జీఓను తెచ్చారని ఆరోపించారు.