రెవెన్యూ డివిజన్‌గా తూప్రాన్‌ | thupran as a revenue division | Sakshi
Sakshi News home page

రెవెన్యూ డివిజన్‌గా తూప్రాన్‌

Published Sun, Aug 21 2016 9:19 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

తూప్రాన్‌ మండల కేంద్ర స్వరూపం

తూప్రాన్‌ మండల కేంద్ర స్వరూపం

  • విస్తరించనున్న వ్యాపారం, వాణిజ్యం
  • నగర శోభను సంతరించుకోనున్న పట్టణం
  • తూప్రాన్‌: మండల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఏదురుచూస్తున్న కల ఎట్టకేలకు సకారమైంది. దీంతో మండలంలో ఆనందం సంతరించుకుంది. రెవెన్యూ డివిజన్‌గా తూప్రాన్‌  ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సర్వత్ర సంతోషం నెలకొంది. తూప్రాన్‌ మండలం.. హైదరాబాద్‌ నగరానికి  40 కీలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇప్పడికే అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది.

    44వ జాతీయ రహదారి కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, సికింద్రాబాద్‌ నుంచి నాగపూర్‌ వరకు రైలు మార్గం ఉండడం మండలానికి ఓ ప్రత్యేక గుర్తింపు అని చెప్పవచ్చు. అంతే కాకుండా మండలంలో రెండు ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌, అభ్యాస, ది జైన్‌ ఇంటర్‌నేషనల్‌ స్కూల్స్‌ ఉన్నాయి. అందులోను రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు సరిహద్దు మండలం కావడంతో ఉక్కడి భూములకు డిమాండ్‌ ఎక్కువ.

    దీంతో వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటుకు వ్యాపారవేత్తలు మక్కువ చూపుతున్నారు. కాళ్లకల్‌ పారిశ్రామిక ప్రాంతంలో టీఎస్‌ఐఐసీని సుమారు 11 వందల ఎకరాల్లో ఏర్పాటు చేయడంతో ఇప్పటికే సుమారు 40 పరిశ్రమలు నిర్మాణం జరుగగా వీటిలో 25 పారిశ్రమల వరకు ఉత్పత్తి ప్రారంభించాయి. మండలంలో మొత్తం 100కు పైగా పరిశ్రమలున్నాయి. 

    పంచయతీలు సైతం అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటి వరకు సిద్దిపేట ఆర్డీఓ పరిధిలో కొనసాగిన తూప్రాన్‌ మండల ప్రజలు అనేక వ్యయ ప్రయాసాలు పడ్డారు. భూముల విషయంలో ఏదైన సమస్య తెలెత్తితే 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేటకు వెళ్లడానికి రోజంతా సరిపోయేది. పోయిన పని అయితే సరి.. లేదంటే తిరిగి మరుసటి రోజు వేళ్లాల్సి వస్తే.. వారి బాధలు వర్ణాణాతీతం. కాని ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో తూప్రాన్‌ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఇప్పటికే మండలంలో...
    తూప్రాన్‌ మండలం హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉండడంతో దినదిన అభివృద్ధి చెందుతూ వస్తోంది. విద్యాపరంగా వివిధ రకాల 21 కళాశాలలు, వ్యాపార, వాణిజ్యం, 44వ జాతీయ రహదారి, దక్షిణ మధ్య రైల్వే మార్గంతో పాటు రియల్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. మండలంలో పోలీస్‌ సబ్‌ డివిజన్‌, టీపీసీపీడీసీఎల్‌ డివిజన్‌ కార్యాలయం, సబ్‌ రిజిష్టర్‌ కార్యాలయం ఉంది. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుతో  మండలం ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చి సౌలభ్యం ఏర్పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement