జిల్లాలోని 97 పుష్కర ఘాట్లలో గురువారం ఒక్కరోజే 7,94,848 మంది స్నానాలు ఆచరిం చారు.
కొవ్వూరు/నరసాపురం అర్బన్/జంగారెడ్డిగూడెం రూరల్ : జిల్లాలోని 97 పుష్కర ఘాట్లలో గురువారం ఒక్కరోజే 7,94,848 మంది స్నానాలు ఆచరిం చారు. కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొవ్వూరు, తాళ్లపూడి, పెనుగొండ, నిడదవోలు, పెరవలి మండలాల్లో 4,85,993మంది పుష్కర స్నానాలు చేశారు. నరసాపురం డివిజన్ పరిధిలోని నరసాపు రం, యలమంచిలి, ఆచంట మండలాల్లో 2,35,991 మంది, కొవ్వూరు డివిజన్‌లోని పోలవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో 72,864మంది స్నానాలు చేశారు. గడచిన మూడు రోజుల్లో జిల్లావ్యాప్తంగా 21,48,009 మంది సాన్నాలు ఆచరించారు. వీరిలో కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఘాట్లలో 13,47,695 మంది, నరసాపురం డివిజన్ పరిధిలో 6,30,519 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 1,69,795 మంది ఉన్నారు.