సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్‌లో ఉన్న వేములవాడ, వేములవాడ (రూరల్), చందుర్తి, బోయిన్‌పల్లి, కోనరావుపేట్, రుద్రంగి మండలాలను కొత్తగా ఏర్పాటు చేసిన వేములవాడ రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేశారు.
కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రంగా వేములవాడను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు వినోద్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఆరు మండలాలతో వేములవాడ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కావడం వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని వినోద్ సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment