
సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
ఆలయ గుడి చెరువు మైదానంలో భారీ బహిరంగ సభ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రజాపాలన విజయోత్స వాల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల జిల్లా పర్యటనకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేవంత్ బుధవారం ఉదయం 10 గంటలకు వేములవాడకు చేరుకొని శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం గుడి చెరువు ఖాళీ స్థలంలో వేములవాడ పట్టణాభివృద్ధికి, దేవాలయ అభివృద్ధికి రూ. 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు.
ప్రభుత్వం శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు గాను రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ.47.85 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణానికి రూ.3.8 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. అలాగే సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. అనంతరం సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సభ ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు.

Comments
Please login to add a commentAdd a comment