ప్రాణం తీసిన రూ. 10 కోసం | Life taken for Rs.10 | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన రూ. 10 కోసం

Published Mon, Jun 29 2015 1:36 AM | Last Updated on Fri, Aug 17 2018 7:48 PM

ప్రాణం తీసిన రూ. 10  కోసం - Sakshi

ప్రాణం తీసిన రూ. 10 కోసం

తాగిన మైకంలో బండరాయితో కొట్టి చంపిన తోటి కూలీ
శ్రీరాంపూర్: పది రూపాయల కోసం జరిగిన వివాదం ఒకరి ప్రాణం తీసింది. మద్యం మత్తులో ఇద్దరు కూలీల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధి దొరగారిపల్లెలో శనివారంరాత్రి జరిగింది. గ్రామపరిధిలోని మన్నెవాడకు చెందిన కుమ్మరి పోశం(30), కొడిపె లక్ష్మణ్(25) కూలీ పనులు చేస్తుంటారు.

శనివారం ఇద్దరు వేర్వేరుగా గుడుంబా తాగి, పాన్‌షాప్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో పోశంను ఉద్దేశించి కొడిపె లక్ష్మణ్ ‘పది రూపాయలు ఇవ్వరా’ అంటూ అడిగాడు. ‘ఇంతలేనోనివి నువ్వు నన్ను పది రూపాయలు అడిగేటోనివా?, ఇంకా రా అంటవా..’ అంటూ పోశం ప్రశ్నిం చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చివరికి లక్ష్మణ్‌ను పోశం  కింద పడేసి కొట్టాడు. తర్వాత తేరుకున్న లక్ష్మణ్ కోపంతో బండరాయి తీసుకొని పోశం ఛాతీపై బలంగా కొట్టగా, అతడు అక్కడికక్కడే చనిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement