వారంతా నేలతల్లిని నమ్ముకుని బతికే చిన్న, సన్నకారు రైతులు.. మూడు దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన ఎకరా.. ఒకటిన్నర ఎకరా భూమే వారికి జీవనాధారం. ఏళ్లక్రితం ఇచ్చిన గుంటలు మిట్టల భూమిని వారు తమ కాయకష్టంతో చదును చేసుకున్నారు. చెట్లు పుట్టలు తొలగించి సాగుకు యోగ్యంగా తయారు చేశారు. ఇప్పడు ఏడాదికి రెండుకార్లు చొప్పున పంటలు పండి స్తున్నారు. పెట్టుబడులు పెరగడంతో స్వయంసహాయక సంఘాల మహిళలందరూ కూలీలుగా మారి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే పరిశ్రమల పేరుతో.. ఆభూములను లాక్కునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒకప్పుడు మేం ఇచ్చిన భూములే కదా.. తిరిగి ఇచ్చేయండంటూ హుకుం జారీ చేసింది. లేకుంటే చేయాల్సింది చేస్తామంటూ హెచ్చరించింది. దీంతో ఏం చేయాలో తెలియక ‘మా కడుపుకొట్టొద్దు బాబూ..’ అంటూ రైతులందరూ ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. అధికారమదంతో బతుకుపై కొడితే రైతన్న సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.
పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం భూసేకరణ చేసేందుకు సిద్ధమవుతుండడంతో రైతులు, పేదలగుండెల్లో అలజడి మొదలైంది. మా కడుపుకొట్టొదని శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లోని పేద, మధ్యతరగతి వర్గాలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. పుడమితల్లిని నమ్ముకుని బతుకుతున్న తమపై భూసేకరణ పేరుతో పంజా విసిరితే.. ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.
శ్రీకాళహస్తిః జిల్లాలోని తూర్పువుండలాల్లో సాగునీటి వనరులు సమృద్ధిగా ఉండడంతో సన్న, చిన్నకారు రైతులు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. ఒకప్పుడు చిట్టడవులుగా ఉన్నా భూవుులను రైతులు తమ కాయుకష్టంతో పంట చేలుగా వూర్చా రు. పుడమితల్లిని నవుు్మకుని రాత్రిపగలు తేడాలు లేకుండా సేద్యం చేస్తూ.. భూమిపుత్రులుగా బతుకుతున్నారు. అరుుతే ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణతో ఒక్కోరైతు భవిష్యత్‌ను కారుచీకట్లోకి నెట్టేస్తోంది. ఉన్న ఎకరం, అర ఎకరం భూవుులను లాక్కొని పారిశ్రామికవేత్తలకు అప్పగించాలని సన్నాహాలు చేస్తుండ డంపై వారు ఆవేదన చెందుతున్నారు.‘‘మేం అధికారంలోకి వస్తే డీకేటీ భూవుులను సెటిల్‌మెంట్ చేస్తాం. రైతు సంక్షేవుం వూతోనే సాధ్యం’’ అని చెప్పిన చంద్రబాబు.. అధికార పీఠం దక్కడంతో తవు నోటికాడ కూడు లాగేసేందుకు యత్నిస్తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తొట్టంబేడు, శ్రీకాళహస్తి వుండలంలోనే పరిశ్రమల కోసం 44 వేల ఎకరాల భూవుులు సేకరించాలనియ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొట్టంబేడు వుండలంలోని చియ్యువరం, కాసరం, రాంబట్లపల్లి, చోడవరం, చేవుూరు, గుండేలుగుంట, వూమిడిగుంట, గొట్టిపూడి తదితర గ్రావూల్లో 26 వేల ఎకరాల భూవుులు స్వాధీనం చేసుకోవాలని అధికారులు సర్వేలు పూర్తిచేశారు. ఇక శ్రీకాళహస్తి వుండలంలోని ఓబులాయుపల్లి, రెడ్డిపల్లి, యుర్రవురెడ్డిపల్లి, గంగలపూడి, ఇనగలూరు,వెల్లంపాడు, గోవిందరావుపల్లి, రావూంజుపల్లి, అక్కూర్తి, ఉడవులపాడు, జింగిలిపాళెం, గుంటకిందపల్లి, వుద్దిలేడు తదితర గ్రావూల్లో 18వేల ఎకరాల భూవుులు రైతుల నుంచి లాక్కోవాలని చూస్తోంది. ఈ ప్రాంతంలో అంతా సన్న, చిన్నకారు రైతులే. అధికంగా ఎస్సీ, ఎస్టీలు, బీసీ తెగలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. కనీసం తావుు పంటలు సాగుచేయుడానికి కూలీలు ధరలు భరించలేవుంటూ వారే గ్రూపులుగా ఏర్పడి సేద్యం చేస్తున్నారంటే వారి పేదరికం తెలుస్తోంది. అరుునా ప్రభుత్వం కనికరం లేకుండా భూవుులు లాక్కోవడానికి శ్రీకారం చుట్టింది. దాంతో 50 వేల కుటుంబాలు భూవుులు కోల్పోనున్నాయి. 2లక్షల వుంది ప్రజలు నిరాశ్రయుులు కానున్నారు. దీంతో ఈరెండు వుండలాల్లోని అన్నదాతలకు భూవుుల భయం నెలకొంది.
రైతు నెత్తిన.. భూ సేకరణ పిడుగు
Published Thu, Jul 14 2016 1:36 AM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM
Advertisement