బాధితులకు వెఎస్సార్‌సీపీ చేయూత
Published Sun, Oct 27 2013 3:28 AM | Last Updated on Wed, Aug 1 2018 3:52 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: పట్టణంలో నీట మునిగిన హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ నేతలు శనివారం పర్యటించారు. అనంతరం బాధితులకు పార్టీ నేతలు ఎన్ని ధనుంజయ్, గేదెల పురుషోత్తం తదితరులు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు మార్పు ధర్మారావు మాట్లాడుతూ, వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన వార్డు ల, కాలనీవాసులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో పార్టీ జిల్లా అడ్‌హాక్ కమిటీ సభ్యుడు అందవరపు సూరి బాబు, కేవీవీ సత్యనారాయణ, టి.కామేశ్వరి, దాసరి అప్పన్న, ఎ. త్రినాథ రెడ్డి, అప్పాజీరెడ్డి, కల్లేపల్లి విజయ్‌కుమార్, ఉండ్రాళ్ళ ధర్మారావు, పోతల రామారావు, చెట్లపల్లి మోహన్, ఎన్.శ్రీనివాస్, పాల్గొన్నారు.
బూరవల్లిలో...
బూరవల్లి (గార) : వంశధార నదీ ప్రవాహానికి గురైన 15 గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమా లు కొనసాగుతున్నాయి. శనివారం ఉద యం వైఎస్సార్‌సీపీ నాయకులు బూరవల్లి, అంబళ్లవలస పంచాయతీల పరిధిలోని ప్రజలకు బ్రెడ్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. ముందుగా బూరవల్లి గ్రామం లో వరద దెబ్బకు కూలిన ఇళ్లను నాయకులు మార్పు ధర్మారావు, అందవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ, గేదెల పురుషోత్తం పరిశీలించారు. బాధితుల తో మాట్లాడి బ్రెడ్స్ పంపిణీ చేశారు. అనంతరం ఎస్సీ కాలనీలో పర్యటించి బాధితులకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. తర్వాత అంబళ్లవలసలో పర్యటించి బాధితులను పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పీస శ్రీహరిరావు, తంగి శివప్రసాద్, మళ్ల నర్సునాయుడు, చిట్టిబాబు, మళ్ల నారాయణమూర్తి, కొబగాన అప్పారావు, కర్రి పద్మావతి, బూరవల్లి రంగారావు, సత్యనారాయణ, శిమ్మ నీలం పాల్గొన్నారు.
పంటనష్టం పరిశీలించిన నాయకులు
పలాస రూరల్ : వరద బాధిత రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వైఎ స్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యు డు డాక్టర్ కణితి విశ్వనాథం ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. పలాస మండలం పూర్ణభద్ర, అమలకుడియా, సరియాపల్లి, వీరభద్రాపురం, టెక్కలిపట్నం, కమలాపురం, గోపివల్లభపురం, రేగులపాడు, మోదుగులపుట్టి, గరుడుఖండి గ్రామాల్లో ఆయన శని వారం పర్యటించి నష్టపోయిన పంటల ను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఇచ్ఛాపురంలో..
ఇచ్ఛాపురం రూరల్ : బాహుదా నది పొంగిపొర్లడంతో ముంపునకు గురైన గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు డాక్టర్ ఎంవీ కృష్ణారావు పరిశీలించారు. జగన్నాథపురం, టి.బరంపురం, శాస నం, అరకుబద్ర, బొడ్డబడ తదితర గ్రామాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement