
సాక్షి, అనంతపురం : జిల్లాలో మరోసారి అలజడి చెలరేగింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ్ యాదవ్‌ను చంపేందుకు కుట్ర పన్నిన పదిమంది కిరాయి హంతక ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రి పరిటాల సునీత డైరెక్షన్‌లోనే ధనుంజయ్ యాదవ్ హత్యకు కుట్ర జరిగిందని ఆరోపించారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకే వైఎస్‌ఆర్ సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.