topudurthi prakash reddy
-
చంద్రబాబుపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం
-
'చంద్రబాబు హయాంలోనే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు పునాది'
సాక్షి, అనంతపురం: చంద్రబాబు హయాంలోనే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు పునాది పడిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. ఆయన పాలనలోనే సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురుయ్యాయని ధ్వజమెత్తారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు చంద్రబాబు ఏనాడూ అభ్యంతరం చెప్పలేదని దుయ్యబట్టారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచినా చంద్రబాబు నోరు మెదపలేదని గుర్తు చేశారు. '2017లో రెండో విడత అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయి. అప్పటిముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అభ్యంతరం చెప్పలేదు. ఈ ప్రాజెక్టుపై సీఎం జగన్ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతూనే ఉంది. న్యాయపోరాటం చేస్తోంది.' అని తోపుదుర్తి వ్యాఖ్యానించారు. చదవండి: మెరుగైన పనితీరు కనబర్చాలి: సీఎం జగన్ -
పొలిటికల్ కారిడార్: రౌడీ షీటర్ విడుదల కోసం రోడ్డెక్కిన పరిటాల సునీత
-
చంద్రబాబు ‘కుప్పం’ డ్రామా హాస్యాస్పదం: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
అనంతపురం: కుప్పంలో టీపీపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కుప్పంలో చంద్రబాబు చేపట్టిన డ్రామా హాస్యాస్పదమన్నారు. రోజురోజుకూ చంద్రబాబు ప్రజాదరణ కోల్పోతున్నారని, ఉనికి కాపాడుకునేందుకే కుప్పంలో నాటకాలు ఆడారని ధ్వజమెత్తారు. రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యాలు ధీటుగా ఎదుర్కొంటామన్నారు. ‘ఉనికి కాపాడుకునేందుకే కుప్పంలో చంద్రబాబు నాటకాలు. చెన్నేకొత్తపల్లి ఉప సర్పంచ్ రాజారెడ్డిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వారిని అడ్డుకోవడంలో తప్పేంటి? పోలీసులను తిట్టడం పరిటాల కుటుంబానికి ఫ్యాషన్ అయిపోయింది. భద్రత కల్పిస్తున్న పోలీసులను దుర్భాషలాడటం పరిటాల సునీతకు తగునా? రాప్తాడు నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు పరిటాల కుటుంబం కుట్ర’అని మండిపడ్డారు తోపుదుర్తి. ఇదీ చదవండి: Andhra Pradesh: ఉనికి కోసమే బాబు ‘కుప్పం’ డ్రామా -
టీడీపీ హయాంలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీ
సాక్షి, అమరావతి: ప్రాజెక్టుల పేరుతో టీడీపీ దోపిడీ చేసిందని, ఆ ఐదేళ్లలో నీళ్లకు బదులు నిధులు పారించుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను తమ ప్రభుత్వం సరిదిద్దుతోందని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేరూరు డ్యామ్‌కు హంద్రీనీవా ద్వారా నీరిచ్చేందుకు టీడీపీ రూపొందించిన అంచనా వ్యయంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మూడు రిజర్వాయర్లు నిర్మిస్తోందని చెప్పారు. మూడు రిజర్వాయర్లు ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు ఇస్తామని, ఆ ఘనత సీఎం జగన్‌దేనని చెప్పారు. అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పథకం ద్వారా ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్ల నిర్మాణం అనంతపురం జిల్లా రైతుల దశాబ్దాల కల అని పేర్కొన్నారు. ఈ మూడు రిజర్వాయర్ల శంకుస్థాపనలను దేవినేని ఉమా, పరిటాల శ్రీరాంలు తప్పుపట్టడం సరికాదన్నారు. కరువు జిల్లా అనంతపురం ప్రజల కోసం మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌కు అక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలని దేవినేని ఉమా, పరిటాల శ్రీరాంలకు హితవు పలికారు. దమ్ము, ధైర్యం గురించి పరిటాల శ్రీరాం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు డాక్టర్ వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల పథకం పరిటాల రవీంద్ర కల అని చెప్పటం ఏమిటని, పరిటాల మరణించిన తర్వాత 2005లో హంద్రీనీవా పనులు డాక్టర్ వైఎస్సార్ ప్రారంభించారని గుర్తు చేశారు. 2007 చివరిలో జీడిపల్లి జలాశయం నిర్మాణం పూర్తి చేసుకుంటున్న దశలో ఈ ప్రాజెక్టు గురించి తాము ప్రతిపాదించామని, నాడు మహానేత వైఎస్సార్ దీనిని ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. -
'సీఐడీ విచారణ జరిపిస్తే నిజస్వరూపం తెలుస్తుంది'
సాక్షి, అనంతపురం : మంత్రిగా ఉన్న సమయంలో పరిటాల సునీత అనేక అక్రమాలకు పాల్పడ్డారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆమె అవినీతిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. సునీత తన కుటుంబసభ్యులతో కలిసి వందల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. సీఐడీ విచారణ జరిపిస్తే ఆమె నిజస్వరూపం మొత్తం బయటపడుతుందని, పౌరసరఫలా శాఖ కాంట్రాక్టులన్నీ ఆమె తన బినామీలకే కట్టబెట్టారని మండిపడ్డారు. జంగాలపల్లిలోని ఎఫ్‌సీఐ గోదాంలను నంద్యాలకు మార్చడంతో ప్రభుత్వానికి రూ. 100 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. (చంద్రబాబు.. అప్పుడు ఎందుకు జోలె పట్టలేదు?) -
మొసలి కన్నీరొద్దు సునీతమ్మా..
సాక్షి, అనంతపురం : ‘‘గత ఐదేళ్లూ మంత్రిగా ఉన్న మీరు రాప్తాడు పంచాయతీలోని గంగలకుంట చెరువుకూ నీళ్లెందుకు ఇవ్వలేక పోయారు..?, ధనదాహంతో జంగాలపల్లి ఎఫ్‌సీఐ గోదామును మీరే మూయించింది నిజం కాదా..? అక్కడ పని చేస్తున్న కార్మికుల పొట్ట కొట్టింది మీరు కాదా..?, కక్కలపల్లి సమీపంలో ప్రైవేట్ టమాట మండీలో తిష్టవేసిన మీ బంధువులు, అనచరులు రైతుల నుంచి పదిశాతం పన్ను వసూళ్లు చేస్తూ దోచుకున్నది వాస్తవం కాదా..?, 2016 నుంచి నీళ్లొస్తున్నా మీ సొంత మండలంలోని పేరూరు డ్యాంకు ఎందుకు నీళ్లివ్వలేకపోయారు...?’’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాజీ మంత్రి పరిటాల సునీతను ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంద రోజుల్లో రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేశామనీ. గంగలకుంట చెరువుకు నీళ్లు ఇచ్చేందుకు ఇప్పటికే సర్వే పూర్తి చేయించామన్నారు. పీఏబీఆర్ కుడికాలువకు నీళ్లివ్వగానే గంగలకుంట చెరువుకు నీళ్లిస్తామన్నారు. పరిటాల సునీత మూసివేయించిన ఎఫ్‌సీఐ గోదామును తెలిపించి కార్మికులకు ఉపాధి కల్పించేందుకు డిల్లీకి వెళ్లి ఎఫ్‌సీఐ సీఎండీని కలిసి విన్నవించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇస్తే అక్కడే కొనసాగిస్తామని వారు చెప్పగా... ఇదే విషయాన్ని అధికారులతో కలిసి విన్నవించగా... సానుకూలంగా స్పందించారన్నారు. టమాటా మండీతో దోచుకున్నారు అనంతపురం రూరల్ కక్కలపల్లి సమీపంలో ప్రైవేట్ టమాట మండీని పరిటాల సునీత బంధువులు, అనచరులు నడుపుతున్నారనీ, పదిశాతం పన్ను రైతుల నుంచి వసూళ్లు చేస్తూ దోచుకుంటున్నా సునీత, అప్పటి ప్రభుత్వం కళ్లు మూసుకుందని ప్రకాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా టమాట పండించిన రైతులు ధరలు లేక కోట్లాది రూపాయలు నష్టపోయారన్నారు. అసలు మండీ నడపడానికి ఎలాంటి అనుమతులు లేవని, దీన్ని సుమోటా తీసుకుని కలెక్టర్, ఎస్పీ కేసులు నమోదు చేయొచ్చన్నారు. ఈ మండీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరామన్నారు. ఇక సునీత సొంత మండలంలోని పేరూరు డ్యాంకు అతి తక్కువ ఖర్చుతో నీళ్లివచ్చని తాము చెబితే నవ్వారనీ, సీఎం జగన్మోహన్రెడ్డి సహకారంతో సర్వే పూర్తి చేయించామన్నారు. త్వరలోనే జీఓ కూడా విడుదలవుతుందన్నారు. డిసెంబరు 31లోపు పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చి డ్యాం కింద ఉన్న 10 వేల ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకొస్తామన్నారు. అనంతపురం రూరల్ పాపంపేట, కక్కలపల్లికాలనీ పంచాయతీలకు పీఏబీఆర్ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం జీఓ విడుదల చేసిందనీ, పైపులైను పనులు పూర్తికాగానే నీటి సరఫరా ప్రారంభమవుతుందన్నారు. పరిటాల సునీత ఐదేళ్లు ఎమ్మెల్యేగా, మరో ఐదేళ్లు మంత్రిగా పని చేసినా పరిష్కరించలేని సమస్యను తాము 60 రోజుల్లోనే పరిష్కరించామని చెప్పేందుకు గర్వపడుతున్నామన్నారు. అలాగే నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు ఇచ్చే ప్రక్రియ మొదలైందని, రెండేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మార్చేస్తామని ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా సీఎం పరితపిస్తున్నారనీ, వందరోజుల పాలనలో అభివృద్ధికి బీజం పడిందన్నారు. రానున్న రోజుల్లో సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందుతాయన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు మహానందరెడ్డి, ముక్తాపురం లక్ష్మీనారాయణరెడ్డి, శ్రీనివాసులు, రామాంజనేయులు పాల్గొన్నారు. -
టీడీపీది దోపిడీ సర్కార్
-
జగనన్న మీరే మా దిక్కు , మా భవిష్యత్ మీరే
-
‘వైఎస్ జగన్‌ను సీఎంగా చూశాకే తుది శ్వాస విడుస్తా’
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లాకు పరిటాల కుటుంబం చేసిందేమీ లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఫ్యాక్షన్ మరకలు అంటించిన ఘనత మాత్రం పరిటాల కుటుంబానికి దక్కుతుందని ఆయన దుయ్యబట్టారు. 34వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా రాప్తాడు సెంటర్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మాట్లాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలోనే అనంతపురం అద్భుతంగా ఉందని, మంచి రోజులు ఉండేవని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో అనంతపురాన్ని భ్రష్టుపట్టించారని, అసలు పట్టించుకోవడం మానేశారని మండిపడ్డారు. పరిటాల కుటుంబం ఫ్యాక్షన్‌ను ధైర్యంగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసిన తర్వాతే తన తుది శ్వాస విడుస్తానని అన్నారు. ‘జగనన్న మీరే మా దిక్కు అని, మా భవిష్యత్ మీరే’ అని వైయస్ఆర్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. తమకు నీరిచ్చి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైయస్ జగన్ కష్టం, పట్టుదల సామాన్యమైనది కాదని, వైయస్ రాజశేఖరరెడ్డి వారసుడు, పులివెందుల పులిబిడ్డ వైయస్ జగన్ అని కొనయాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 2009లో పెరూరు ప్రాజెక్టుకు నీరిస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. నీరు వస్తుందని తామంతా కల కన్నామని, రైతులకు నీరు వస్తుందని భావించామని కానీ వైయస్ఆర్ మరణంతో తాము దిక్కులేని వారిమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీనీవా ఎగువన ఆత్మకూరు మండలంలోని 12 వేల ఎకరాలకు నీరిస్తామని ఆరోజు టెండర్లు కూడా పిలిచారని, తమ నియోజకవర్గంలో 76 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందన్నారు. తమ హక్కులను కాలరాసే హక్కు టీడీపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పీఏబీఆర్ రిజర్వాయర్ నుంచి తమకు నీరు రావాల్సి ఉందని చెప్పారు. హెచ్ఎల్సీ కాల్వ వెంట ఉన్న 20 మండలాలకు పొలాలకు నీరు పారే అవకాశం ఉందని తెలిపారు. కుడికాల్వ కింద ఉన్న తాము అనాథలమయ్యామని, అన్యాయానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కేవలం వంకల్లో నీరు ఇచ్చి సస్యశ్యామలం చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని నిప్పులు చెరిగారు. మహానేత వైయస్ ఈ జిల్లాకు నీరు తెచ్చేందుకు ప్రాజెక్టులు కడితే ఎక్కడ ఆయనకు పేరు వస్తుందో అని కనీసం పిల్ల కాల్వలు కూడా తవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తి చేశారు. తినడానికి తిండి లేక విశ్వనాథరెడ్డి అనే సర్పంచ్ బెంగుళూరులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారని, పరిటాల సునీత ఈ నియోజకవర్గానికి ఏం చేయలేకపోయారని అన్నారు. ‘వైఎస్ జగన్‌ను సీఎంగా చూశాకే తుది శ్వాస విడుస్తా’ -
వైఎస్ఆర్ సీపీ నేత హత్య కుట్ర భగ్నం
-
వైఎస్ఆర్ సీపీ నేత హత్య కుట్ర భగ్నం
సాక్షి, అనంతపురం : జిల్లాలో మరోసారి అలజడి చెలరేగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ్ యాదవ్‌ను చంపేందుకు కుట్ర పన్నిన పదిమంది కిరాయి హంతక ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రి పరిటాల సునీత డైరెక్షన్లోనే ధనుంజయ్ యాదవ్ హత్యకు కుట్ర జరిగిందని ఆరోపించారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకే వైఎస్ఆర్ సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే: తోపుదుర్తి
అనంతపురం : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలపై దాడులు చేయడం పిరికిపంద చర్య అని రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే రాప్తాడులో ఇప్పటివరకూ ఎనిమిది వైఎస్ఆర్ విగ్రమాలపై దాడులు జరిగాయని ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. కాగా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యం కొసాగుతోంది. వైఎస్ఆర్ విగ్రహాలపై టీడీపీ నేతలు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సీకేపల్లిలో వైస్ఆర్ విగ్రహాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. -
‘మంత్రి సునీతను బర్తరఫ్ చేయాలి’
-
‘మంత్రి సునీతను బర్తరఫ్ చేయాలి’
కనగానపల్లె ఎంపీపీ ఎన్నికల్లో దౌర్జన్యానికి పాల్పడ్డ మంత్రి పరిటాల సునీతను బర్తరఫ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం పట్టణంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో ఎన్నికల అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాప్తాడు నియోజవవర్గంలో గత 20 ఏళ్లుగా ప్రజాస్వామ్యమే లేదని, బీసీ నేతలు ఎంపీపీ కాకుడదన్నదే మంత్రి సునీత ఉద్దేశమని ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగానే లేఖ రాసినా ఏపీ డీజీపీ సాంబశివరావు తగిన చర్యలు తీసుకోలేదన్నారు. వైఎస్ఆర్ సీపీకి మద్దతు ఇచ్చిన ఎంపీటీసీలను పోలీసులే పరిటాల పర్గీయుకలు అప్పగించడం దుర్మార్గం అన్నారు. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికల అక్రమాలపై హెచ్ఆర్సీ, కోర్టులను ఆశ్రయిస్తామని వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. -
'మంత్రి దౌర్జన్యాన్ని రాష్ట్రమంతా చూసింది'
చేతగాని మంత్రి పరిటాల సునీత చేసిన దౌర్జన్యాన్ని రాష్ట్రమంతా చూసిందని వైఎస్ఆర్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. కనగానపల్లె ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన వ్యవహారాన్ని ఆయన తప్పుబట్టారు. పోలీసు వ్యవస్థ మీద తాము నమ్మకం ఉంచి.. ఇక్కడ ఏదో జరుగుతోందన్న విషయాన్ని డీజీపీకి, ఎస్పీకి, కలెక్టర్‌కు ముందుగానే చెప్పామని ఆయన అన్నారు. కానీ అసలు ఎన్నిక అన్నది జరగకుండానే ఆర్డీవో డిక్లరేషన్ ఇచ్చేశారని.. ఇది ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. అసలు ఎంపీపీ ఉప ఎన్నికలో ఎవరూ చేతులు ఎత్తలేదని, సంతకాలు చేయలేదని.. వాళ్లు తమ సభ్యులను బలవంతంగా ఒత్తిడి చేసి దౌర్జన్యం చేశారని అన్నారు. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికను రద్దు చేయాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ తరఫున ఉన్న బిల్ల రాజేంద్ర, వెంకట్రామిరెడ్డి ఇద్దరినీ కొట్టారని చెప్పారు. సాక్షాత్తు సీఐ కూడా లోపలే ఉండి దౌర్జన్యం చేశారన్నారు. ఇప్పటికీ ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు తమతోనే ఉన్నారని ఆయన చెప్పారు. రాజేంద్ర, వెంకట్రామిరెడ్డి తమ జీపు ఎక్కేందుకు వస్తున్నా కూడా పోలీసులు వాళ్లను కొట్టి లాక్కెళ్లిపోయారన్నారు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ బీసీ అభ్యర్థి అయిన రాజేంద్రకు మద్దతిచ్చిందని, కానీ మంత్రి పరిటాల సునీత మాత్రం అగ్రవర్ణాల అభ్యర్థిని ఎంపీపీ చేయాలని పట్టుబట్టి, బలవంతంగా నెరవేర్చుకున్నారని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. -
'మంత్రి దౌర్జన్యాన్ని రాష్ట్రమంతా చూసింది'
-
చంద్రబాబు.. రెయిన్గన్ల పేరుతో మభ్యపెట్టొద్దు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ కరువు పేరుతో వెయ్యి కోట్ల రూపాయల దోపిడీకి సిద్ధపడ్డారని వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. తక్కువ ఖర్చుతో బైరవాన్ తిప్ప ప్రాజెక్టు, పేరూరు డ్యామ్‌లకు నీళ్లు ఇవ్వవచ్చని, అయితే కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతల ఆర్థిక ప్రయోజనాల కోసమే అనంతపురం జిల్లాలో ప్రాజెక్టులు చేపడుతున్నారని అన్నారు. చంద్రబాబు రెయిన్గన్ల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టవద్దని వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి అనంతపురం జిల్లాకు నీళ్లిచ్చే అవకాశాన్ని చంద్రబాబు ఎందుకు ఉపయోగించుకోవడంలేదని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. -
'రెయిన్గన్ల పేరుతో మభ్యపెట్టొద్దు'
-
'మమ్మల్ని టార్గెట్ చేయడానికే.. సునీతకు మంత్రి పదవి ఇచ్చారు'
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేయడానికే పరిటాల సునీతకు మంత్రి పదవి ఇచ్చారని ఆ పార్టీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డిది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ కీలక నేతలను హతమారుస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. రాప్తాడు మండల తహశీల్దార్ కార్యాలయంలో ఇటీవల వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన అల్లర్లకు బాధ్యులను చేస్తూ వైఎస్ఆర్ సీపీ నేతలు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.