
సాక్షి, అనంతపురం: చంద్రబాబు హయాంలోనే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు పునాది పడిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. ఆయన పాలనలోనే సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష‍్యానికి గురుయ్యాయని ధ్వజమెత్తారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు చంద్రబాబు ఏనాడూ అభ్యంతరం చెప్పలేదని దుయ్యబట్టారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచినా చంద్రబాబు నోరు మెదపలేదని గుర్తు చేశారు.
'2017లో రెండో విడత అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయి. అప్పటిముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అభ్యంతరం చెప్పలేదు. ఈ ప్రాజెక్టుపై సీఎం జగన్ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతూనే ఉంది. న్యాయపోరాటం చేస్తోంది.' అని తోపుదుర్తి వ్యాఖ్యానించారు.
చదవండి: మెరుగైన పనితీరు కనబర్చాలి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment