చంద్రబాబు ‘కుప్పం’ డ్రామా హాస్యాస్పదం: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి | AP MLA Topudurthi Prakash Reddy Criticized Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఉనికి కాపాడుకునేందుకే చంద్రబాబు ‘కుప్పం’ డ్రామా: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

Published Sun, Aug 28 2022 1:20 PM | Last Updated on Sun, Aug 28 2022 3:09 PM

AP MLA Topudurthi Prakash Reddy Criticized Chandrababu Naidu - Sakshi

కుప్పంలో టీపీపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి.

అనంతపురం: కుప్పంలో టీపీపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి. కుప్పంలో చంద్రబాబు చేపట్టిన డ్రామా హాస్యాస్పదమన్నారు. రోజురోజుకూ చంద్రబాబు ప్రజాదరణ కోల్పోతున్నారని, ఉనికి కాపాడుకునేందుకే కుప్పంలో నాటకాలు ఆడారని ధ్వజమెత్తారు. రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యాలు ధీటుగా ఎదుర్కొంటామన‍్నారు.

‘ఉనికి కాపాడుకునేందుకే కుప్పంలో చంద్రబాబు నాటకాలు. చెన్నేకొత్తపల్లి ఉప సర్పంచ్ రాజారెడ్డిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వారిని అడ్డుకోవడంలో తప్పేంటి? పోలీసులను తిట్టడం పరిటాల కుటుంబానికి ఫ్యాషన్ అయిపోయింది. భద్రత కల్పిస్తున్న పోలీసులను దుర్భాషలాడటం పరిటాల సునీతకు తగునా? రాప్తాడు నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు పరిటాల కుటుంబం కుట్ర’అని మండిపడ్డారు తోపుదుర్తి.

ఇదీ చదవండి: Andhra Pradesh: ఉనికి కోసమే బాబు ‘కుప్పం’ డ్రామా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement