Raptadu constituency
-
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు
-
పరిటాల వారి నకిలీ ఓట్ల రాజకీయం
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయతీలో ఇంటి నంబరు 8–63లో 12 ఓట్లు ఉన్నాయి. అందులో ఆరుగురు స్థానికులే. మరో ఆరుగురు కర్ణాటకకు చెందిన వారు. వాళ్లంతా పోలింగ్ రోజునే ఇక్కడికి వస్తారు. ఓటు వేసి వెళ్లిపోతారు. మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు ఓట్లేయడానికే తప్ప ఇటు వైపు కన్నెత్తి కూడా చూడరు. కర్ణాటకకు చెందిన కె.ప్రతాప్ (48), బి.రమేశ్‌కుమార్ (49), వి.నాగయ్య (73), డి.వెంకటస్వామి (71), డి.వెంకటప్ప (48), వి.వెంకటస్వామి (68) పేర్లు రామగిరి మండలం నసనకోట పంచాయతీ ఓటరు జాబితాలో ఉన్నాయి. వీళ్లందరూ ఎన్నికల రోజు మినహా మిగతా రోజుల్లో ఆంధ్రలో కనిపించరు. ...రామగిరి మండలంలో ఇలాంటి నకిలీ ఓట్లు చాలా పంచాయతీల్లో ఉన్నాయి. ప్రతి పంచాయతీలో కర్ణాటక వాసులను, ఇతర దేశాల్లో నివసిస్తున్న వారి పేర్లను ఓటరు జాబితాలో ఎక్కించి దొంగ ఓట్లు వేయించుకోవడమే పరిటాల కుటుంబం పని. సాక్షి, పుట్టపర్తి: గత ఎన్నికల్లో ఓటమి, వచ్చే ఎన్ని కల్లో గెలిచే అవకాశాల్లేవని అర్థమవడంతో ‘పరి టాల’ కుటుంబం దొంగ ఓట్లను కాపాడుకోవడానికి శతధా ప్రయత్నిస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో తాజా ఓటర్ల జాబితాపై లేనిపోని రాద్ధాంతం చే స్తోంది. పరిటాల రవీంద్ర టీడీపీలో ప్రవేశించినప్పటి నుంచి నకిలీ ఓట్లపైనే ఆధారపడ్డారు. అదే తరహాలో ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా దొంగ ఓట్ల రాజకీయం చేయాలని చూస్తు న్నట్లు తెలుస్తోంది. స్థానికంగా లేని వారి ఓట్ల తొల గింపును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.రవీంద్ర హయాంలోనే పెనుకొండ (ప్రస్తుతం రాప్తాడు) నియోజకవర్గంలో ఉన్న రామగిరి, కనగానపల్లి మండలాల్లో వేల సంఖ్యలో నకిలీ ఓట్లను చేర్చించింది పరిటాల కుటుంబం.రవీంద్రకు భయపడి అధికా రులు ఎదురు మాట్లాడేవారు కాదు. దశాబ్దాలుగా దొంగ ఓట్లతో పాటు రిగ్గింగ్, దౌర్జన్యాలతో అమాయక ప్రజల ఓట్లను వారే వేసుకొనేవారు. ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతోంది.ఫలితంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ఆంధ్రలో ఓటరు కార్డులు ఇచ్చేందుకు టీడీపీ నేతలు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. దొంగ ఓట్ల తొలగింపుపై పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అవి దొంగ ఓట్లే అని ఒప్పు కోలేక, కాదనీ చెప్పలేక రోజుకోరకంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక.. నేరుగా ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక నకిలీ ఓట్లపై పరిటాల కుటుంబం ఆధారపడింది. రవీంద్ర చేసిన హత్యాకాండను ప్రజలు మరువలేదు. నేడు వైఎస్సా ర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు సంపూర్ణంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాయితీగా గెలవలేక దొంగ ఓట్లపై మాజీ మంత్రి పరిటాల సునీత గతంలో నమోదు చేయించిన దొంగ ఓట్లను కాపాడుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. నకిలీ ఓట్లలో అధిక శాతం పరిటాల సునీత సొంత పంచాయతీ నసన కోటలోనే ఉన్నాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుండగా.. తమ పార్టీ ఓట్లు తొలగిస్తున్నారంటూ హంగామా సృష్టిస్తున్నారు. -
రాప్తాడు ఎమ్మెల్యే తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. పరిటాల సునీత అనుచరుడు అరెస్ట్
సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లాలో టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత తీరు వివాదాస్పదం అయింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల్లిపై పరిటాల సునీత ముఖ్య అనుచరుడు గంటాపురం జగ్గు అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాయలేని భాషలో బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలో గంటాపురం జగ్గును పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళను కించపరిచేలా మాట్లాడిన గంటాపురం జగ్గును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాల్సిన పరిటాల సునీత అందుకు భిన్నంగా వ్యవహరించారు. టీడీపీ నేత గంటాపురం జగ్గును వెంటనే విడుదల చేయాలంటూ చెన్నేకొత్తపల్లి పీఎస్ వద్ద ఆమె తనయుడితో కలిసి హల్చల్ చేశారు. చదవండి: (షిప్ రిపేర్ హబ్‌గా విశాఖ.. అదానీ పోర్ట్స్ నుంచి అమెరికా షిప్స్ వరకూ..) -
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పెద్దమనసు.. ఆ రైతులకు 5వేల ఉచిత బోర్లు
సాక్షి, అనంతపురం(రాప్తాడు): నియోజకవర్గంలో 5 వేల మంది రైతులకు తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా బోరుబావులు తవ్వించి వారి కలను సాకారం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాప్తాడుకు వచ్చిన ఆయన స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.10 కోట్లతో బోర్ల ఏర్పాటు తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గతంలో రాప్తాడు నియోజకవర్గంలో రెండు వేల మంది రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్వించినట్లు ప్రకాష్‌రెడ్డి గుర్తు చేశారు. స్ఫూర్తిదాయకమైన ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘వైఎస్సార్ జలకళ’ కార్యక్రమం కింద తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం కింద నియోజకవర్గంలో ఇప్పటి వరకూ 600 మంది రైతులకు బోర్లు వేయించామన్నారు. బోర్లు వేయించాలంటూ ప్రభుత్వ లక్ష్యానికి మించి 10,600 దరఖాస్తులు అందడంతో తోపుదుర్తి కుటుంబం చర్చించి ట్రస్ట్ ద్వారా ఉచిత బోర్లు వేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రూ.10 కోట్ల వ్యయంతో రాప్తాడు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలకు సంబంధించి ప్రతి మండలానికి వెయ్యి బోర్లు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలకు కలపి వెయ్యి బోర్లు వేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి తొలి విడతగా కనగానపల్లి మండలంలో 150, రాప్తాడులో 150, రామగిరిలో 100, చెన్నేకొత్తపల్లి మండలాల్లో 100 బోర్లు వేయిస్తామన్నారు. ఇవి పూర్తి కాగానే రెండో విడతలో మరో 500 బోర్లు వేయిస్తామన్నారు. ఇలా ప్రతి విడతలోనూ 500 బోర్లు వేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులు వీరే.. పేద రైతులు, ఇప్పటి దాకా బోర్లు వేయని రైతులు, ఎన్నిమార్లు బోర్లు వేసినా నీళ్లు పడని రైతులు మాత్రమే ఈ పథకం కింద అర్హులని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. గత రెండేళ్లుగా పేరూరు డ్యాం మరువ పారుతోందని, ఈ సారి దాదాపు 12 టీఎంసీల నీటిని పేరూరు డ్యాం నుంచి దిగువన పెన్నాలోకి వదిలినట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆశీర్వాదంతో పీఏబీఆర్ కుడికాలువ ద్వారా ప్రతి చెరువునూ నింపడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో భూగర్భజలాలు భారీగా పెరిగాయని, 200 అడుగుల్లోపే నీళ్లు పడే పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి కార్యకర్త గడప గడపకూ వెళ్లాలి ప్రతి గడపకూ వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఈ మూడేళ్లలో ఒనగూరిన లబ్ధిని వివరించాలని కార్యకర్తలకు సూచించారు. గత ప్రభుత్వం ఖజానాను కొల్లగొట్టి వెళ్లిపోయినా ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిధులు సమకూర్చుకుంటూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 8,900 ఇళ్లు మంజూరయ్యాయని, మరో 8,500 ఇళ్ల నిర్మాణాలకు ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని పేదలు ఎవరైతే ఆప్షన్–3లో ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటారో వారందరికీ రూ.35 వేల రుణాన్ని ఎన్నికల లోపు కాంట్రాక్టింగ్ సంస్థకు తామే చెల్లించి, ఆ రుణాన్ని మాఫీ చేయిస్తామన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ బోయ రామాంజినేయులు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ జూటూరు శేఖర్, యూత్ మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, బీసీ సెల్ నాయకుడు పసుపుల ఆది పాల్గొన్నారు. -
చంద్రబాబు ‘కుప్పం’ డ్రామా హాస్యాస్పదం: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
అనంతపురం: కుప్పంలో టీపీపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కుప్పంలో చంద్రబాబు చేపట్టిన డ్రామా హాస్యాస్పదమన్నారు. రోజురోజుకూ చంద్రబాబు ప్రజాదరణ కోల్పోతున్నారని, ఉనికి కాపాడుకునేందుకే కుప్పంలో నాటకాలు ఆడారని ధ్వజమెత్తారు. రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యాలు ధీటుగా ఎదుర్కొంటామన్నారు. ‘ఉనికి కాపాడుకునేందుకే కుప్పంలో చంద్రబాబు నాటకాలు. చెన్నేకొత్తపల్లి ఉప సర్పంచ్ రాజారెడ్డిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వారిని అడ్డుకోవడంలో తప్పేంటి? పోలీసులను తిట్టడం పరిటాల కుటుంబానికి ఫ్యాషన్ అయిపోయింది. భద్రత కల్పిస్తున్న పోలీసులను దుర్భాషలాడటం పరిటాల సునీతకు తగునా? రాప్తాడు నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు పరిటాల కుటుంబం కుట్ర’అని మండిపడ్డారు తోపుదుర్తి. ఇదీ చదవండి: Andhra Pradesh: ఉనికి కోసమే బాబు ‘కుప్పం’ డ్రామా -
పరిటాల సునీతకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్
సాక్షి, అనంతపురం: టీడీపీ పాలనలో అవినీతి, దౌర్జన్యాలు చేసింది పరిటాల కుటుంబీకులేనని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల సునీత, శ్రీరామ్ వంటి వ్యక్తులు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తోపుదుర్తి మహిళా డైరీలో ఒక్క రూపాయి దుర్వినియోగం కాలేదని పేర్కొన్నారు. అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని పరిటాల సునీత, శ్రీరామ్‌కు సవాల్ విసిరారు. చదవండి: (ఫిట్మెంట్తో పాటు ఉద్యోగులకు సీఎం జగన్ మరో గుడ్‌న్యూస్) -
పరిటాల దోపిడీ అనంతం
రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ దోపిడీ తవ్వేకొద్దీ ఆశ్చర్యం కలిగిస్తోంది. చిన్నాన్న నారాయణ చౌదరి, తమ్ముళ్లు ధర్మవరపు మురళి, ధర్మవరపు బాలాజీ.. సమీప బంధువులు రామ్మూర్తి నాయుడు, నెట్టెం వెంకటేష్, మహేంద్ర సాగించిన అక్రమాల బాగోతం ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. కనీసం ఆ పార్టీ నేతలను కూడా ఎదగనీయకుండా.. ప్రజలకూ మేలు చేయకపోగా గత ఐదేళ్లలో ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కూడబెట్టిన తీరు ఆ పార్టీలోనే తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే పరిటాల కోట బద్దలైంది. ఇదే సమయంలో అవినీతి పుట్ట పగులుతోంది. సాక్షి, రాప్తాడు : టీడీపీ ప్రభుత్వ హయాంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ఆ పార్టీ నేతలు సొమ్ము చేసుకున్నారు. ఐదేళ్లలో కనీసం ప్రజలను కలిసి, వారి బాగోగులు తెలుసుకున్న పాపాన పోలేదు. పైగా జన్మభూమి కమిటీల పెత్తనం సరేసరి. ప్రజల సొమ్మును యథేచ్ఛగా దోచుకున్నారు. నాయకుల అండదండలతో కాంట్రాక్టర్లు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఎవరికి ముట్టజెప్పాల్సింది వారి చేతిలో పెట్టి.. నాసిరకం పనులతో మమ అనిపించారు. రామగిరి మండలంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీఓ కార్యాలయ భవనం నాలుగు నెలలు కూడా పూర్తి కాకుండానే చిన్నపాటి వర్షానికి గదులన్నీ కారి ముద్దయిన విషయం తెలిసిందే. ఈ పని చేసింది మరెవరో కాదు.. మాజీ మంత్రి పరిటాల సునీత చిన్నాన్న ఎల్.నారాయణ చౌదరి. ఏదో ఒక పనిలే అనుకుంటే.. తాజాగా ఇంకో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాలుగైదు రోజుల క్రితం కురిసిన వర్షానికి మండలంలోని గొల్లపల్లి నుంచి పెసరకుంట గ్రామానికి వేసిన రోడ్డుకు ఇరుపైపులా మట్టి రోడ్డు పూర్తిగా కోసుకుపోయింది. చాలా చోట్ల రోడ్డు కూడా తారు లేచిపోయింది. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే పెసరకుంట గ్రామస్తులు నరకం చూస్తున్నారు. సొంత నియోజకవర్గంలో, కుటుంబ సభ్యులు చేసిన పనులు ప్రజలకు పది కాలాల పాటు సేవలందించాల్సింది పోయి.. పట్టుమని పది రోజులు కూడా నిలవని పరిస్థితి. తారు పోసి.. మాయ చేసి ఐదేళ్ల పాటు ప్రజలను విస్మరించిన పరిటాల కుటుంబం ఎన్నికల వేళ గిమ్మిక్కులు చేసింది. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ట్రైబల్ సబ్‌ప్లాన్ నిధులు రూ.1.20కోట్లతో మండలంలోని గొల్లపల్లి గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారి నుంచి పెసరకుంట వరకు తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ పనులను మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు, టీడీపీ నేత ఎల్.నారాయణప్పకు చెందిన శ్రీకృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్స్(ఎస్కేసీ) దక్కించుకుంది. ఎల్.నారాయణప్ప నుంచి మరూరుకు చెందిన టీడీపీ నేత తక్కెల్ల చంద్రబాబు నాయుడు సబ్ కాంట్రాక్టు తీసుకున్నాడు. అయితే ఇతను కూడా డమ్మీయే. రోడ్డు పనులు చేయించింది మాత్రం మాజీ మంత్రి సునీత సోదరుడు ధర్మవరం మరళి. ఆయనే దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షించాడు. అయితే ఎక్కడా నిబంధనలను పాటించకపోయినా సునీత సోదరుడు కావడంతో అధికారులు కూడా మౌనందాల్చాల్సి వచ్చింది. ఎన్నికల వేళ హడావుడి సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో ప్రజలకు గాలం వేసేందుకు రోడ్డు నిర్మాణాన్ని తెరపైకి తీసుకొచ్చారు. గత ఫిబ్రవరి 10న ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏప్రిల్ నెలలో రోడ్డుపై కంకర పరిచి, మే నెల 2, 3 తేదీల్లో 2.35 కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేసేశారు. కేవలం వారం రోజుల్లోపు చేపట్టిన ఈ రోడ్డు నాణ్యత ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. కోటి రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డు నెల రోజులు తిరక్కుండానే నామరూపాలు కోల్పోతోంది. రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన బరŠమ్స్ విషయంలో సదరు కంపెనీ నిబంధనలకు తిలోదకాలిచ్చింది. ప్రస్తుతం చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డుకు ఇరువైపులా మోకాలి లోతు గుంతలు ఏర్పడటంతో పాటు రోడ్డు కోతకు గురవుతోంది. ఎక్కడికక్కడ నెర్రెలు చీలుతున్నాయి. అప్పటికే ఉన్న రోడ్డు మీద తారు పోసిన తీరు చూస్తే పరిటాల కుటుంబం ధన దాహం ఏ స్థాయి ఉందో ఊహించుకోవచ్చు. ఎన్నికల వేళ శ్రీకృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులన్నీ దాదాపు ఇదేవిధంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. నిబంధనలు.. ఉల్లంఘనలు ♦ ఆర్అండ్బీ పరిధిలో నిర్మించే 7 మీటర్ల రోడ్లకు అటు ఇటు నిర్మించే మట్టి రోడ్డు పనులు 5 మీటర్ల చొప్పున నిర్మించాలి. ♦ అదే పంచాయతీరాజ్ పరిధిలో నిర్మించే రోడ్లకు ఒక వైపు 1.5 మీటర్లు, మరోవైపు 1.5 మీటర్ల మట్టి రోడ్డు నిర్మించాలి. అయితే ఈ రోడ్డు విషయంలో ఈ నిబంధనలను పట్టించుకున్న దాఖలాల్లేవు. ♦ రోడ్డు నిర్మాణానికి ఆయా శాఖలు మట్టి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తాయి. ఇలా మంజూరు చేసిన వాటికి ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తరలించి మట్టి రోడ్డు నిర్మించాలి. ముఖ్యంగా ఎర్రమట్టితోనే మట్టి రోడ్డు వేయాలి. నల్ల రేగడి, లూజ్ మట్టి ఉన్న ప్రాంతాల్లో తప్పని సరిగా ఇతర ప్రాంతాల నుంచి ఎర్రమట్టిని తరలించాలి. కానీ ఇక్కడ నిర్మిస్తున్న మట్టి రోడ్డు పక్కనే ఉన్న మట్టిని తవ్వి వినియోగించారు. ♦ మట్టి రోడ్డు నిర్మాణంలో భాగంగా లేయర్ల వారీగా రోడ్డు రోలర్‌తో తిప్పించాలి. తోలిన మట్టి గట్టిపడే వరకు నీళ్లు చల్లి రోలింగ్ చేయించాలి. కానీ ఇక్కడ ఒకేసారి మట్టి వేసి లెవల్ చేసి రోలింగ్ చేశారు. ♦ మట్టి రోడ్డు గడ్డపారతో తవ్వినా గుంత పడని విధంగా నిర్మించాలి. కానీ చిన్న పాటి వర్షం వస్తే టూవీలర్ కూడా ఇరుక్కుపోయే విధంగా ఉన్న నిర్మాణాలు అవినీతికి అద్దం పడుతున్నాయి. ♦ గత నాలుగైదు రోజుల కిత్రం కురిసిన వర్షానికి గొల్లపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలానికి ట్రాక్టర్లో వెళ్లాడు. రోడ్డు పక్కనే తోట ఉండటంతో ట్రాక్టర్‌ను రోడ్డుపై నుంచి పొలంలోకి దింపుతుండగా మట్టి రోడ్డులో ఇరుక్కుపోయింది. ట్రాక్టర్‌ను బయటకు తీసేందుకు ఆ రైతుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించాల్సి వచ్చింది. ♦ రోడ్డు పక్కనే మట్టి రోడ్డును తప్పని సరిగా రోడ్డుకు అటు ఇటు ఏటవాలుగా వర్షం నీరు రోడ్డుపై నిల్వ ఉండకుండా నిర్మాంచాలి. అయితే ఈ నిబంధనను పాటించకపోవడంతో నూతనంగా నిర్మించిన రోడ్డు కూడా నెర్రెలు చీలుతోంది. ♦ రోడ్డు నిర్మాణం పూత పూసినట్లుగానే ఉందని, ఇంకాస్త మందంతో వేయాలని అప్పట్లో పెసరకుంట, గొల్లపల్లి గ్రామస్తులు, పొలాల రైతులు అడ్డుపడడంతో వారిని మాజీ మంత్రి సోదరుడు ధర్మవరపు మురళి బెదిరించినట్లు సమాచారం. -
హైదరాబాద్‌లో బట్టబయలైన పరిటాల నిర్వాకం
సాక్షి, హైదరాబాద్/అనంతపురం: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ నేతలు బరితెగింపులకు దిగుతున్నారు. రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను గట్టెక్కించేందుకు ప్రలోభాలకు తెరతీశారు. అందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల అనుచరులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు ఆరు వేల రూపాయలు పంచుతున్నట్టు ప్రచారం జరగుతోంది. అయితే తాజాగా హైదరాబాద్‌లో పరిటాల సునీత నిర్వాకం బట్టబయలైంది. నగరంలోని అరాంఘర్ చౌరస్తా వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పరిటాల వర్గీయుడి నుంచి పోలీసులు 24లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సునీత ముఖ్య అనుచరుడు రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్ డ్రైవర్ సంతోష్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రౌడీరాజ్యం!
వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి ఈ నెల ఏడో తేదీన రామగిరి మండలంలో పర్యటించారు. నసనకోట పంచాయతీకి చెందిన బోయ సూర్యనారాయణ అలియాస్ సూర్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు చంద్రశేఖర్‌రెడ్డి వెంటే ఉన్నాడు. ఇది తెలుసుకున్న టీడీపీ వారు బోయ సూర్యనారాయణపై దాడి చేసి గాయపరిచారు. పైగా అతడిని స్టేషన్‌కు పిలుచుకెళ్లి తనపై వైఎస్సార్సీపీ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డే దాడి చేయించినట్లు కేసు పెట్టించారు. తమ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పర్యటిస్తున్నారనే సమాచారంతో రామగిరి మండలం పేరూరుకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు సుబ్బుకృష్ణ 2017 నవంబరు 12న గ్రామంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు సుబ్బుకృష్ణపై దాడి చేసి తిరిగి అతనిపైనే పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. ఈ రెండు ఉదాహరణలు చాలు రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలు ఎలా గాడితప్పాయనేందుకు. అనంతపురం: ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లి తమ భావాలను వ్యక్తపరచవచ్చు. కానీ రాప్తాడు నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాస్వామ్యానికి పాతరేసింది. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి, వారి బంధువులు చెప్పినట్లు వినాల్సిందే. మాట వినని వారిపై పోలీసులను ఉసిగొలుపుతున్నారు. ‘ఎద్దు ఈనిందంటే గాడికి కట్టేయ్’ అన్న చందంగా పోలీసుల తీరు ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు పోలీసులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఉంటూ తప్పొప్పులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేసులు నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. పోలీసులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. చివరికి తెగబడి అధికారులపై కూడా దాడులు చేస్తుంటే చోద్యం చూడాల్సిన పరిస్థితి. కనగానపల్లి ఎంపీపీ భర్త ముకుందనాయుడు స్వయంగా ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేశారు. రామగిరి ప్రవేశానికి ప్రత్యేక ఆంక్షలు రామగిరి మండలంలోకి విపక్ష నేతలు వెళ్లనీయకుండా ప్రత్యేక ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చెబుతున్న పోలీసులు.. విపక్షనేతలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, బెదిరింపులు, పోలీసుల ఏకపక్ష తీరుపై ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలను పరిరక్షించకపోతే అధికార పార్టీ నేతల ఆగడాలు మరింత ఎక్కువవుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఆగడాల్లో కొన్ని.. ► 2016 మే 30న కనగానపల్లి మండలం కుర్లపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేశారు. బాధితులు అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరామర్శించడానికి వెళ్లిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై కూడా దాడికి యత్నించారు. ► 2016 సెప్టెంబర్ 2న వైఎస్ వర్ధంతి రోజున కనగానపల్లి మండలం యలకుంట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ► 2016 నవంబరు 16న రాప్తాడు మండలం బండమీదపల్లిలో మంత్రి లోకేష్ పర్యటనలో భాగంగా ఫ్లెక్సీలు చింపేశారనే సాకుతో యర్రగుంటలో ఓ మహిళపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ► గొందిరెడ్డిపల్లిలో 2017 నవంబరులో భూ సమస్య కారణంగా సర్పంచ్ కుమారుడు బాబయ్య, బంధువులపై టీడీపీ వారు దాడి చేశారు. ఓటమి భయంతోనే ఫ్యాక్షన్‌కు బీజం మంత్రి సునీతపై ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు ధ్వజం ఆత్మకూరు: ఎన్నికలకు ముందే ఓటమి భయం వెంటాడటంతో మంత్రి పరిటాల సునీత ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ, గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు ఆరోపించారు. ఫ్యాక్షన్ సంస్కృతిని ఆత్మకూరుకు తీసుకురావద్దంటూ ఆదివారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి, రాప్తాడు మండల కన్వీనర్ మీనుగ నాగరాజుపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్నోబులేసు మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క హామీనీ పూర్తిగా నెరవేర్చకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి.. ఎలాగైనా గెలిచేందుకు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఫ్యాక్షన్‌కు బీజం వేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే రామగిరి మండలంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పర్యటించకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారని విరుచుకుపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే మంత్రిని కూడా నియోజకవర్గంలో ఎక్కడా తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి సోదరుడు బాలాజీ వైఎస్సార్సీపీ నాయకులను బెదిరింపులకు గురిచేస్తున్నారని, అమాయక ప్రజలను నేర వృత్తిలోకి బలవంతంగా దింపుతున్నారని అన్నారు. అనంతరం గూలి కేశవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి దాదాపు 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చే అవకాశం ఉండగా ..వాటిని పూర్తిగా రద్దు పరిచి కొత్త స్కీములను ప్రవేశపెడుతున్నారన్నారు. ఆత్మకూరుకు లిఫ్ట్ ఇరిగేష్‌న్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలంటూ వినతిపత్రం అందచేశారు. -
లక్ష్మీనారాయణ సేవలు అభినందనీయం: వైఎస్ జగన్
సాక్షి, రాప్తాడు : లక్ష్మీ నారాయణ సేవలు ప్రశంసనీయం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 33వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన రాప్తాడులోని దివ్యాంగుల ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న లక్ష్మీ నారాయణను అభినందించారు. దివ్యాంగులకు భవిష్యత్‌పై భరోసాను కల్పిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతూ వారికి స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు ఆయన పడుతున్న శ్రమను అభినందిస్తున్నానని అన్నారు. అనంతరం అక్కడి దివ్యాంగులతో వైఎస్ జగన్ కాసేపు ముచ్చటించారు. -
రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ
కనగానపల్లి : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు టీడీపీని వీడారు. రాప్తాడు నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సోమవారం కలిసి ఆ పార్టీలో చేరారు. వీరిలో కనగానపల్లి తాజా మాజీ ఎంపీపీ బిల్లే రాజేంద్ర, వైస్ ఎంపీపీ పున్నం వెంకట్రామిరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు బిల్లే గంగమ్మ ఉన్నారు. మంత్రి పరిటాల సునీత బంధువులు, అనుచరుల అజమాయిషీని భరించలేకనే టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు. అణచివేతను భరించలేక.. 2014లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కనగానపల్లి మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు గాను ఆరు స్థానాలను వైఎస్ఆర్ సీపీ, ఐదు స్థానాలను టీడీపీ దక్కించుకున్నాయి. వైఎస్ఆర్ సీపీకి చెందిన ఇద్దరిని ప్రలోభాలకు గురిచేసి టీడీపీ వైపు తిప్పుకున్నారు. ఎలక్కుంట్ల ఎంపీటీసీ సభ్యుడు బిల్లే రాజేంద్రను ఎంపీపీ చేశారు. ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే ఐదేâýæ్ల పాటు బీసీలను ఆ పదవిలో కొనసాగించ డం ఇష్టంలేని పరిటాల వర్గీయులు ఇటీవల బిల్లే రాజేంద్రపై ఒత్తిళ్లు తీసుకొచ్చి బలవంతంగా రాజీనామా చేయించారు. తెరపైకి తమ సామాజిక వర్గానికి చెందిన ముత్తువకుంట్ల ఎంపీటీసీ సభ్యురాలు పద్మగీతను తీసుకొచ్చారు. బలహీన వర్గాలపై అణచివేతను నిరసిస్తూ రాజేంద్రతో పాటు వైస్ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, కనగానపల్లి ఎంపీటీసీ సభ్యురాలు బిల్లే గంగమ్మ టీడీపీ నుంచి బయటకొచ్చేశారు. తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బుధవారం జరగనున్న ఎంపీపీ ఎన్నిక రసవత్తవరంగా మారనుంది. -
పరిటాల కోటకు బీటలు?
సొంత పార్టీలోనే తమ్ముళ్లకు విలువ లేకుండా పోయింది. మండలాలు, గ్రామాల్లో పార్టీ ఇన్చార్జిలు, జన్మభూమి కమిటీ సభ్యులను ఏర్పాటు చేయడం ద్వారా పరోక్షంగా ప్రజా ప్రతినిధుల అధికారాన్ని వాళ్లకు కట్టబెట్టినట్లైంది. వీరి పెత్తనాన్ని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే భరించలేకపోతున్నారు. ఇందులో భాగంగానే కొంత కాలంగా అసమ్మతితో రగలిన తమ్ముళ్లు ఎట్టకేలకు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదంతా రాష్ట్రమంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. * రాజకీయ పెత్తనం భరించలేకపోతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు * రాజీనామా బాటలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ కనగానపల్లి : పరిటాల కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాప్తాడు నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి రాజుకుంది. రాజకీయ పెత్తనాన్ని భరించలేని అధికార పార్టీకి చెందిన కనగానపల్లి ఎమ్పీపీ బిల్లే రాజేంద్ర, వైస్ ఎమ్పీపీ వెంకట్రామిరెడ్డి కొన్ని రోజులుగా ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సైతం వీరు పాల్గొనలేదు. జన్మభూమి కమిటీలు, పార్టీ ఇన్చార్జిల ఏర్పాటుతో ప్రభుత్వ కార్యకలాపాల్లో వీరికి సరైన ప్రాధాన్యత దక్కలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక మొదలు మండల స్థాయి సమావేశాల్లోనూ వీరికి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. వీరితో పాటు మరో ఇద్దరు ఎమ్పీటీసీలు కూడా టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎమ్పీపీ, వైస్ ఎమ్పీపీని వివరణ కోరగా వాస్తవమేనని ధ్రువీకరించారు. అడ్డదారులలో ఎంపీపీ దక్కించుకున్న అధికార పార్టీ: 2014లో కనగానపల్లి మండలంలో జరిగిన ఎమ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి ఆరు, టీడీపీ ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ సీపీకి చెందిన ఇద్దరు ఎమ్పీటీసీలను టీడీపీ నాయకులు లొంగదీసుకుని ఎమ్పీపీ పదవి దక్కించుకున్నారు. పదవులను కల్పించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీ నాయకులే పెత్తనం చేస్తుండడంతో టీడీపీలో అసమ్మతి రాజుకుంది. అనుకున్న రీతిలో కనగానపల్లి ఎమ్పీపీ, వైస్ ఎమ్పీపీ తమ పదవులతో పాటు ఎమ్పీటీసీ స్థానాలకు రాజీనామా చేస్తే మండలంలో పలు రాజకీయ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.