
సాక్షి, రాప్తాడు : లక్ష్మీ నారాయణ సేవలు ప్రశంసనీయం అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 33వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన రాప్తాడులోని దివ్యాంగుల ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న లక్ష్మీ నారాయణను అభినందించారు.
దివ్యాంగులకు భవిష్యత్‌పై భరోసాను కల్పిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతూ వారికి స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు ఆయన పడుతున్న శ్రమను అభినందిస్తున్నానని అన్నారు. అనంతరం అక్కడి దివ్యాంగులతో వైఎస్ జగన్ కాసేపు ముచ్చటించారు.