differently abled persons
-
టీటీడీ బంపర్ ఆఫర్!
సాక్షి, చిత్తూరు(తిరుమల): వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వీరికి టీటీడి ప్రత్యేకదర్శనం కల్పిస్తోంది. 4వేల టోకెన్లను ప్రత్యేకంగా వీరి కోసం కేటాయించినట్లు టీటీడి తెలిపింది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడి శ్రీవారి భక్తులను కోరింది. ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడి తెలిపింది. ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు ఇస్తున్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 5 సంవత్సరాల లోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను సుపథం మార్గం ద్వారా స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నారు. సాధారణరోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా దర్శనభాగ్యం కల్పిస్తారు. -
2018 బడ్జెట్ : వారికి భారీ ఊరట
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్-2018 రావడానికి ఇంకా కేవలం 20 రోజులే సమయం ఉంది. ఈ సమయంలోపు అధికారంలోకి వచ్చే ముందు జరిగిన 2014 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోలను తీసి ఓ సారి చూడాలని కేంద్ర ప్రభుత్వం, డిపార్ట్మెంట్లను ఆదేశించింది. హామీ ఇచ్చిన వాటిలో నెరవేర్చని వాటి జాబితాను సిద్ధం చేయాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వాధికారులు ఈ జాబితా రూపకల్పనలో బిజీ బిజీ అయిపోయారు. అయితే ఈ జాబితాలో దివ్యాంగుల సంరక్షణ కుటుంబాలకు భారీ పన్ను ఊరట కల్పించాలని సామాజిక బాధ్యత, సాధికారిత మంత్రిత్వశాఖ కేంద్రప్రభుత్వాన్ని కోరింది. సామాజిక సంరక్షణ సెక్షన్ కింద బీజేపీ తన మేనిఫెస్టోలో, దివ్యాంగ సంరక్షణ కుటుంబాలకు అత్యధిక పన్ను ఊరట కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఈ బడ్జెట్లో దివ్యాంగ సంరక్షణ కుటుంబాలకు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ భారీ ఊరట కల్పించాలని ఆ మంత్రిత్వ శాఖ కోరుతోంది. కచ్చితంగా దీనిపై ఈసారి ఓ ప్రకటన వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పన్ను ప్రయోజనాలు పొందడంతో మెడికల్ ట్రీట్మెంట్, ట్రైనింగ్, రిహాబిలేషన్ ఖర్చులుంటాయి. అంగవైకల్యం 80 శాతం కంటే తక్కువ, 40 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఇప్పటివరకు 75వేల రూపాయలను ఊరటగా అందిస్తున్నారు. ఒకవేళ అంగవైకల్యం 80 శాతం కంటే ఎక్కువగా ఉంటే లక్ష 25వేల వరకు ఊరట లభిస్తుంది. -
లక్ష్మీనారాయణ సేవలు అభినందనీయం: వైఎస్ జగన్
సాక్షి, రాప్తాడు : లక్ష్మీ నారాయణ సేవలు ప్రశంసనీయం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 33వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన రాప్తాడులోని దివ్యాంగుల ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న లక్ష్మీ నారాయణను అభినందించారు. దివ్యాంగులకు భవిష్యత్‌పై భరోసాను కల్పిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతూ వారికి స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు ఆయన పడుతున్న శ్రమను అభినందిస్తున్నానని అన్నారు. అనంతరం అక్కడి దివ్యాంగులతో వైఎస్ జగన్ కాసేపు ముచ్చటించారు. -
క్యూ బాధ నుంచి పలు వర్గాలకు ఊరట
న్యూఢిల్లీ: వయోవృద్ధులకు, దివ్యాంగులకు సోమవారం కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత కరెన్సీ మార్పిడి కోసం గంటల కొద్దీ క్యూ లైన్లలో నిల్చొలేక వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వయోవృద్ధులు, దివ్యాంగులు ప్రత్యేక క్యూ ద్వారా బ్యాంకులో నగదు మార్పిడి చేసుకోవచ్చు. దీంతో పాటు పెన్షనర్లు ఏటా ప్రభుత్వానికి ఇచ్చే లైఫ్ సర్టిఫికేట్ గడువును వచ్చే ఏడాది జనవరి 15కు పెంచినట్లు ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నగదును ప్రజల వద్దకు చేర్చే వివిధ మార్గాలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. నాలుగైదు రోజులుగా బ్యాంకు ఉద్యోగులు నిరంతరాయంగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. వారందరికి తమ అభినందనలు తెలిపారు. ఏటీఎంలలో నగదు లావాదేవీలను రోజుకు రూ.2,500లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, రూ.2000 నోటును ఇవ్వగల ఏటీఎంలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.