న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్-2018 రావడానికి ఇంకా కేవలం 20 రోజులే సమయం ఉంది. ఈ సమయంలోపు అధికారంలోకి వచ్చే ముందు జరిగిన 2014 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోలను తీసి ఓ సారి చూడాలని కేంద్ర ప్రభుత్వం, డిపార్ట్‌మెంట్లను ఆదేశించింది. హామీ ఇచ్చిన వాటిలో నెరవేర్చని వాటి జాబితాను సిద్ధం చేయాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వాధికారులు ఈ జాబితా రూపకల్పనలో బిజీ బిజీ అయిపోయారు. అయితే ఈ జాబితాలో దివ్యాంగుల సంరక్షణ కుటుంబాలకు భారీ పన్ను ఊరట కల్పించాలని సామాజిక బాధ్యత, సాధికారిత మంత్రిత్వశాఖ కేంద్రప్రభుత్వాన్ని కోరింది.
సామాజిక సంరక్షణ సెక్షన్ కింద బీజేపీ తన మేనిఫెస్టోలో, దివ్యాంగ సంరక్షణ కుటుంబాలకు అత్యధిక పన్ను ఊరట కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఈ బడ్జెట్‌లో దివ్యాంగ సంరక్షణ కుటుంబాలకు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ భారీ ఊరట కల్పించాలని ఆ మంత్రిత్వ శాఖ కోరుతోంది. కచ్చితంగా దీనిపై ఈసారి ఓ ప్రకటన వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పన్ను ప్రయోజనాలు పొందడంతో మెడికల్ ట్రీట్‌మెంట్, ట్రైనింగ్, రిహాబిలేషన్ ఖర్చులుంటాయి. అంగవైకల్యం 80 శాతం కంటే తక్కువ, 40 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఇప్పటివరకు 75వేల రూపాయలను ఊరటగా అందిస్తున్నారు. ఒకవేళ అంగవైకల్యం 80 శాతం కంటే ఎక్కువగా ఉంటే లక్ష 25వేల వరకు ఊరట లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment